Honda Shine 100 vs Shine 100 DX: షైన్ 100 కంటే షైన్ 100 DXలో కొత్తగా ఏం మారింది? డిజైన్, ఫీచర్లు, మైలేజ్ తేడాలేంటి?
Honda Shine 100 DX Comparison: హోండా షైన్ 100 & షైన్ 100 DX మధ్య డిజైన్, ఫీచర్లు, మైలేజ్ వంటి అంశాల్లో తేడాలేంటి? మీ అవసరాలకు సరిపోయేది ఏది?.

Honda Shine 100 vs Shine 100 DX Comparison: హోండా మోటార్‌సైకిల్స్, తన 100cc సెగ్మెంట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు & Shine 100కి బలం ఇచ్చేలా Shine 100 DX పేరుతో కొత్త వేరియంట్‌ను ఇటీవలే తీసుకొచ్చింది. మైలేజ్ ప్రాధాన్యతతో కొనుగోలు చేసే కస్టమర్ల కోసం షైన్ 100ను తీసుకువచ్చిన కంపెనీ.. ఇప్పుడు అదనపు ఫీచర్లు, అప్‌డేటెడ్ డిజైన్‌తో Shine 100 DXను లాంచ్ చేసింది.
బాడీ లుక్స్‌లో స్పష్టమైన తేడాలు
Shine 100 DXలో, ముఖ్యంగా డిజైన్‌లో పెద్ద మార్పులు ఉన్నాయి. ఈ మోడల్‌లో క్రోమ్ హెడ్‌ల్యాంప్ కవర్, క్రోమ్ మఫ్లర్ షీల్డ్, బ్లాక్ అవుట్ ఇంజిన్, బ్లాక్ గ్రాబ్‌రైల్ వంటి ప్రీమియం టచ్‌లు ఉన్నాయి. మునుపటి Shine 100లో ఇవన్నీ సాధారణ మెటల్ ఫినిష్‌తో, యుటిలిటీలకు తగ్గట్లు ఉంటాయి.
Shine 100 DX ట్యాంక్ డిజైన్ మరింత కర్వీగా ఉండేలా మార్పులు చేశారు. స్టిక్కర్ల డిజైన్ కూడా స్పోర్టీగా ఉంటుంది. రెండు మోడళ్లలో సీటు పొడవు ఒకేలా ఉన్నా, Shine 100 DXలో కంఫర్ట్ కోసం మెరుగైన కవరింగ్ వాడారు.
ఫీచర్ల పరంగా Shine 100 DX ఆధిక్యం
Shine 100లో ఫ్యూయల్ గేజ్, స్పీడోమీటర్ వంటి సాధారణ అనలాగ్ క్లస్టర్ వస్తుంది. కానీ Shine 100 DXలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. ఇది రియల్ టైమ్ మైలేజ్, డిస్టెన్స్-టు-ఎంప్టీ, సర్వీస్ రిమైండర్ వంటి ఆధునిక సమాచారం చూపుతుంది. అంతేకాక, Shine 100 DXలో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్‌తో భద్రత పరంగా ఒక అడుగు ముందుంది.
టైర్లు, సస్పెన్షన్, బరువులో తేడాలు
Shine 100లో ట్యూబ్ టైర్లు ఉండగా, Shine 100 DXలో ట్యూబ్‌లెస్ టైర్లు ఇచ్చారు. రియర్ సస్పెన్షన్ రెండు బైకులలోనూ డ్యూయల్ షాక్ అబ్సార్బర్లు ఉన్నా, Shine 100 DXలో వాటిని 5-స్టెప్ అడ్జస్ట్ చేయవచ్చు. Shine 100 బరువు సుమారు 99 కిలోలు కాగా, Shine 100 DX బరువు 103 కిలోలు ఉంటుంది.
ఇంజిన్, పనితీరు — రెండింటిలోను ఒకే కెపాసిటీ
ఇంజిన్ పరంగా Shine 100 & Shine 100 DX రెండింటిలోనూ 98.98cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది. ఇది 7.28 bhp పవర్, 8.05 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై ఉంటుంది. మైలేజ్ పరంగా, Shine 100 లీటర్‌కు 65-70 కి.మీ. వరకు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. Shine 100 DXలోనూ ఇదే ఇంజిన్ కావడంతో మైలేజ్ తేడా ఉండకపోవచ్చు.
ధర వివరాలు
Shine 100 ప్రస్తుతం సుమారు ₹68,800 ఎక్స్-షోరూమ్ ధరకు అందుతోంది. Shine 100 DX ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే అందుబాటులో ఉండేలా రూ.75,000 లోపే ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 1 నుంచి Shine 100 DX కోసం బుకింగ్స్ ప్రారంభమవుతాయి.
మీకు ఏది సరిపోతుంది?
సాధారణ అవసరాలకు, ఎక్కువ మైలేజ్, తక్కువ ధర కోరుకునేవారికి Shine 100 సరైన ఎంపిక.
డిజైన్, ఫీచర్లు, భద్రతపై కొంత ఎక్కువ దృష్టి పెట్టేవాళ్లకు Shine 100 DX మంచి ఎంపిక అవుతుంది.
వినియోగించదగిన, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండే బైక్ కావాలనుకునేవారి కోసం హోండా ఈ రెండు వేరియంట్లను మార్కెట్లో ఉంచింది. మీ బడ్జెట్, అవసరాల మేరకు ఎంపిక చేసుకోండి.





















