అన్వేషించండి

Hero Passion Plus: హీరో ప్యాషన్ ప్లస్‌కు అనూహ్య డిమాండ్ - ధర తక్కువ, 770 కి.మీ. రేంజ్‌!

Hero Passion Plus Mileage: హీరో ప్యాషన్ ప్లస్‌ కోసం క్లెయిమ్ చేసిన మైలేజ్ లీటరుకు 70 కిలోమీటర్లు. ఫుల్ ట్యాంక్‌తో ఇది 770 కిలోమీటర్ల వరకు నడపగలదు.

Hero Passion Plus Price, Mileage And Features In Telugu: హీరో మోటోకార్ప్ బ్రాండ్‌ నుంచి వచ్చి, నగరాల్లో & పల్లెల్లో విజయవంతంగా నడస్తున్న కమ్యూటర్ బైక్ హీరో ప్యాషన్ ప్లస్. ఈ బైక్‌, గత నెలలో (జూన్ 2025) 26,249 యూనిట్లు అమ్ముడైంది. విశేషం ఏంటంటే.. ఈ సంఖ్య గత సంవత్సరం జూన్ 2024లో అమ్ముడైన 13,100 యూనిట్లతో పోలిస్తే రెట్టింపు. అంటే, హీరో ప్యాషన్ ప్లస్‌ డిమాండ్‌ ఏడాది కాలంలో 100% కంటే ఎక్కువే పెరిగింది.

హీరో ప్యాషన్ ప్లస్‌ బాహ్య రూపం స్పోర్టీగా & అట్రాక్టివ్‌గా ఉంటుంది. కొత్త గ్రాఫిక్స్‌, డ్యూయల్‌టోన్ కలర్ స్కీమ్‌ ఈ బైక్‌కి యూత్‌ఫుల్‌ లుక్‌ ఇస్తుంది. స్టైలిష్‌ హెడ్‌ల్యాంప్‌, క్రోమ్ ఫినిష్ మిరర్లు & బాడీ కలర్‌లో ఉన్న సైడ్ ప్యానెల్స్‌ ప్రత్యేకంగా కనిపిస్తాయి. మొత్తంగా, ఈ బండి డిజైన్‌ చాలా స్టైల్‌గా, నగరాల్లో & పల్లెల్లో యూత్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉంటుంది.

డిమాండ్‌ ఎందుకు పెరిగింది?
నిజానికి, హీరో ప్యాషన్ ప్లస్ బైక్, కామన్‌ మ్యాన్‌ కోరుకునే మైలేజీని ఇస్తుంది & దాని నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. స్టైల్‌గా ఉండడం, మెరుగైన మైలేజీ ఇవ్వడం, నిర్వహణ ఖర్చులు తక్కువ కావడం వంటి కారణాల వల్ల ఈ టూవీలర్‌ డిమాండ్ వేగంగా పెరిగింది. పెట్రోల్ ధరలు ప్రజల ఆదాయానికి గండి కొడుతున్న ఈ నేటి కాలంలో, ఈ బైక్ చవకైన & మేలైన ఎంపికగా మారింది. హీరో ప్యాషన్ ప్లస్‌లో ఇచ్చిన i3S టెక్నాలజీ (ఐడల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్) బైక్‌ను ఎక్కువ ఇంధన- సామర్థ్యంతో పని చేయిస్తుంది. అందుకే, డైలీ అప్‌ అండ్‌ డౌన్‌ చేసేవాళ్లకు ఈ బైక్‌ తెలివైన ఎంపిక అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ధర
విజయవాడలో... హీరో ప్యాషన్ ప్లస్ DRUM BRAKE OBD2B వేరియంట్ ధర 81,251 (ఎక్స్-షోరూమ్) కాగా, ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 99,200. హైదరాబాద్‌లో, ఇదే వేరియంట్‌ ధర 81,141 (ఎక్స్-షోరూమ్) కాగా, ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 1,00,200. ఆన్‌-రోడ్‌ ధరలో RTO ఛార్జీలు, ఇన్సూరెన్స్‌, ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చాలా బైక్‌లతో పోలిస్తే దీనిని తక్కువ ధర టూవీలర్‌గా పరిగణించవచ్చు.

ఇంజిన్, పనితీరు & మైలేజ్
హీరో ప్యాషన్ ప్లస్ 97.2 cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ OBD2B ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 7.91 bhp పవర్‌ను & 8.05 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు. ఈ బైక్‌ గరిష్టంగా 85 kmph వేగంతో నడుస్తుంది. మైలేజ్‌ విషయానికి వస్తే... కంపెనీ డేటా ప్రకారం, లీటరు పెట్రోల్‌కు 70 కి.మీ. మైలేజీ ఇస్తుంది. ఈ బైక్‌కు ఉన్న 11 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో, ఇది ఫుల్ ట్యాంక్‌తో దాదాపు 770 కి.మీ దూరాన్ని కవర్ చేయగలదు. రోజువారీ ప్రయాణికులకు ఇదొక అద్భుతమైన రైడింగ్‌ నంబర్‌.

ప్యాషన్ ప్లస్ ఫీచర్లు
హీరో ప్యాషన్ ప్లస్‌లో రోజువారీ ఉపయోగం కోసం చాలా ప్రాక్టికల్‌ ఫీచర్లు ఉన్నాయి. వాటిలో... i3S టెక్నాలజీ, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్, USB ఛార్జింగ్ పోర్ట్ & సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ వంటివి ఉన్నాయి.

రైడర్‌ భద్రత కోసం ముందు & వెనుక చక్రాలకు 130mm డ్రమ్ బ్రేక్‌లు బిగించారు, ఇవి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (IBS)తో ఉంటాయి. ఈ బ్రేకింగ్ సిస్టమ్ బైక్‌ రైడింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తుంది, ప్రమాదాలను తగ్గిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget