అన్వేషించండి

2025 Honda NX200: రంగులు, ఫీచర్లు, ఆన్‌-రోడ్‌ ధర సహా 6 కీలక విషయాలు

హోండా NX200 2025లో కొత్తగా వచ్చిన ఎడ్వెంచర్‌ స్టైల్‌ బైక్‌. ఇంజిన్‌ వివరాలు, ఫీచర్లు, రంగులు, ధరలు, హైదరాబాద్‌ & విజయవాడ ఆన్‌ రోడ్‌ ప్రైస్‌ వివరాల్ని ఇక్కడ సులభంగా తెలుసుకోండి.

Honda NX200 Price Features: హోండా 200సీసీ సెగ్మెంట్‌ బైక్స్‌ను ఇష్టపడే వారికి 2025 ఒక ప్రత్యేక సంవత్సరం. ఎందుకంటే, హోండా తన మోస్ట్‌ పాపులర్‌ CB200X‌ ను నిలిపివేసి, దాని స్థానంలో పూర్తిగా అప్‌డేట్‌ చేసిన Honda NX200 ను మార్కెట్లోకి తెచ్చింది. పేరు కొత్తైనా, ఈ బైక్‌లో చేసిన అప్‌డేట్‌లు, ఫీచర్లు, ధరలు అన్నీ రైడర్లలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మీరు కూడా NX200 కొనాలని ఆలోచిస్తే, ఇప్పుడే తెలుసుకోవాల్సిన 6 ముఖ్య విషయాలు మీ కోసం ఇక్కడ సులభంగా అందిస్తున్నాం.

1) ఇంజిన్‌ శక్తి & పనితీరు

హోండా NX200లో 184.4సీసీ సింగిల్‌-సిలిండర్‌, ఎయిర్‌-కూల్డ్‌, టూ-వాల్వ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 17hp@8500rpm పవర్‌ & 15.7Nm@6000rpm టార్క్‌ ఇస్తుంది. ఇంజిన్‌ స్పందన చురుకుగా ఉంటుంది. అలాగే 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ స్మూత్‌గా పని చేస్తుంది. అదనంగా స్లిప్‌ & అసిస్ట్‌ క్లచ్‌ ఉండటం నగర ప్రయాణాల్లో కంఫర్ట్‌ మరింత పెంచుతుంది.

2) బరువు ఎంత?

ఈ బైక్‌ కెర్భ్‌ వెయిట్‌ (ఫ్యూయల్‌, ఆయిల్‌, కూలెంట్‌ వంటివి కూడా కలిపిన బరువు) 148kg, అంటే ఇది హార్నెట్‌ 2.0 కంటే 6 కిలోల వరకు ఎక్కువ బరువు. హైవేలో ఈ అదనపు బరువు స్టెబిలిటీని మెరుగుపరుస్తుంది.

3) ఎన్ని వేరియంట్లు ఉన్నాయి?

NX200లో ఒకే వేరియంట్‌ - స్టాండర్డ్‌ మాత్రమే ఇప్పటికి అందుబాటులోకి వచ్చింది. అయితే, స్టాండర్డ్‌ వేరియంట్‌లోనే హోండా అన్ని అవసరమైన ఫీచర్లను అందించింది.

4) ఫ్యూయల్‌ ట్యాంక్‌ కెపాసిటీ

ఇందులో 12 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఉంది. ఎక్కువ దూరం వెళ్లే రైడర్లకు ఈ 12 లీటర్ల సామర్థ్యం సరిపోతుంది.

5) ఎన్ని రంగులలో వచ్చింది?

హోండా NX200 మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో లాంచ్‌ అయింది, అవి: రెడ్‌, బ్లూ‌, బ్లాక్‌. ఈ మూడు రంగులలో బ్లూ & రెడ్‌ కలర్స్‌కు మంచి డిమాండ్‌ ఉన్నట్లు షోరూమ్‌లు చెబుతున్నాయి.

6) ఎక్స్‌-షోరూమ్‌ ధర & ఆన్‌-రోడ్‌ ధర వివరాలు

NX200 ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹1.56 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ).

హైదరాబాద్‌లో ఆన్‌-రోడ్‌ ధర

ఎక్స్‌-షోరూమ్‌ ధర – ₹1,56,428
RTO – ₹25,196
ఇన్సూరెన్స్‌ (Zero Depreciation) – ₹13,332
అదనపు వారంటీ – ₹1,114
ఇతర ఛార్జీలు – ₹995
మొత్తం ఆన్‌-రోడ్‌ ధర – ₹1,97,065

విజయవాడలో ఆన్‌-రోడ్‌ ధర

ఎక్స్‌-షోరూమ్‌ ధర – ₹1,56,428
RTO – ₹18,771
RTO ఖర్చులు – ₹1,300
ఇన్సూరెన్స్‌ (Zero Depreciation) – ₹12,984
స్టాండర్డ్‌ యాక్సెసరీస్‌ – ₹3,000
ఇతర ఛార్జీలు – ₹3,000
హైపొథికేషన్‌ – ₹500
మొత్తం ఆన్‌-రోడ్‌ ధర – ₹1,95,983

హోండా NX200 ఒక అర్బన్‌–అడ్వెంచర్‌ తరహాలో ఉండే బైక్‌. నగర ప్రయాణాలు, వారం చివరి రైడ్స్‌, హైవే కమ్యూట్‌ - అన్ని పరిస్థితుల్లో ఇది బలంగా, కంఫర్ట్‌తో నడుస్తుంది. సింపుల్‌ డిజైన్‌ అయినా బాడీ స్టాన్స్‌ షార్ప్‌గా ఉండటం, తక్కువ మెయింటెనెన్స్‌, హోండా నమ్మకమైన ఇంజిన్‌ వంటివన్నీ ఈ బైక్‌ ప్రధాన హైలైట్స్‌. 200సీసీ సెగ్మెంట్‌లో ప్రాక్టికల్‌గా ఉండే బైక్‌ కోసం చూస్తున్న వారికి NX200 మంచి ఆప్షన్‌ అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Advertisement

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Satya Nadella: భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
Embed widget