Rynox Navigator Hydration Backpack రివ్యూ: రైడర్లు కోసం కాంపాక్ట్ సైజ్‌లో పవర్‌ఫుల్ బ్యాక్‌ప్యాక్
రైనాక్స్ నావిగేటర్ హైడ్రేషన్ బ్యాక్‌ప్యాక్, రీలోడ్ 2.5 లీటర్ బ్లాడర్ రైడర్ల కోసం కాంపాక్ట్, డ్యూరబుల్ హైడ్రేషన్ గేర్. రోజువారీ రైడింగ్‌కి, వీకెండ్ రైడ్‌లకు పర్ఫెక్ట్‌గా ఉపయోగపడుతుంది.

Rynox Navigator Backpack Review: మోటార్‌సైకిల్ రైడర్లు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రోజూ బైక్‌పై ప్రయాణించే వాళ్లు ఎండలో, వర్షంలో సరైన హైడ్రేషన్ మెయింటైన్ చేయడం (మంచినీరు తాగడం) చాలా ముఖ్యం. రైనాక్స్ బ్రాండ్ ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది Navigator Hydration Backpack & Reload 2.5L బ్లాడర్ (నీటి సంచి). చిన్నదిగా కనిపించినా, ఈ కిట్ రైడర్‌కు ఇచ్చే ఉపయోగం మాత్రం అద్భుతం.
స్టైలిష్ & రఫ్ యూజ్‌కి కూడా రెడీ
ఈ బ్యాక్‌ప్యాక్ బయటికి సన్నగా, లైట్‌గా కనిపించినా, చేతిలో పట్టుకున్న వెంటనే క్వాలిటీ ఫీలింగ్ వస్తుంది. మెటీరియల్ చాలా స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల రోజువారీ కమ్యూట్‌లో ఉండే రఫ్ యూజ్‌ను కూడా ఈజీగా తట్టుకుంటుంది. స్టిచింగ్, జిప్పర్లు, హార్నెస్ సిస్టమ్ అన్నీ ప్రీమియంగా కనిపిస్తాయి. పసుపు రంగు స్ట్రిప్స్, రిఫ్లెక్టివ్ ప్యానెల్స్ వల్ల అన్ని సమయాల్లోనూ ఇది రిఫ్లెక్ట్ అవుతూ కనిపిస్తుంది, ప్రమాదాలను నివారిస్తుంది.
బైక్ మీద కదలకుండా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది
ఈ బ్యాక్‌ప్యాక్ ప్రధాన హైలైట్ దాని ఫిట్టింగే. వెన్నుకు గట్టిగా, బౌన్స్ కాకుండా స్థిరంగా కూర్చుంటుంది. దానికోసం ఇచ్చిన స్టెర్నమ్ స్ట్రాప్, వెస్ట్ స్ట్రాప్ చాలా హెల్ప్ చేస్తాయి. అయితే, పొడవైన టెయిల్ ఉన్న కొన్ని బైక్‌లలో ఇది పిలియన్ (కో-రైడర్) సీట్‌కి తగిలే అవకాశం ఉంటుంది. మరో చిన్న సమస్య ఏమిటంటే, హైడ్రేషన్ హోస్ కొన్ని సార్లు హెల్మెట్‌కి కూడా తగులుతుంది. వీటికి అలవాటు పడితే, అవి సమస్యల్లా అనిపించవు.
స్టోరేజ్ పరిమితమే, కానీ యుటిలిటీ మాత్రం అద్భుతం
ఈ బ్యాక్‌ప్యాక్ మొత్తం స్టోరేజ్ 4 లీటర్లు మాత్రమే. అందులో 3.5 లీటర్లు మెయిన్ కంపార్ట్‌మెంట్, బయట ఉన్న రెండు చిన్న జిప్ పాకెట్స్ కలిపి 0.5 లీటర్లు స్పేస్ ఉంటుంది. వాలెట్, ఛార్జర్, తాళాలు వంటి చిన్న వస్తువులు ఈ చిన్న పాకెట్స్‌లో పెట్టుకోవచ్చు. కానీ, పెద్ద వస్తువులు పెట్టాలంటే బ్లాడర్ తీసివేయాల్సిందే.
అయితే, బ్యాక్‌ప్యాక్ వెలుపల ఇచ్చిన Hypalon ఎలాస్టిక్ స్టోరేజ్ చాలా యూజ్ అవుతుంది. గ్లోవ్స్‌లాంటి వాటిని అక్కడ దాచుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రీమియం బ్రాండ్‌లు అయిన Kriega లాంటి గేర్‌లలో కనిపించే స్టైల్.
Reload 2.5L Hydration Bladder – క్లీన్, లీక్‌ప్రూఫ్, యూజర్ ఫ్రెండ్లీ
ఈ బ్లాడర్ (నీటి సంచి) రైడర్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. స్మోక్‌డ్ ఫినిష్ చాలా స్మార్ట్‌గా కనిపిస్తుంది. మొదటిసారి బాగా వాష్ చేసిన తర్వాత నీటికి ఎలాంటి వాసన రాలేదు. నింపడం, క్లోజ్ చేయడం, వాష్ చేయడం చాలా ఈజీ. పూర్తిగా నింపినా లీక్ కాలేదు. హోస్ (నీటి పైపు) పొడవు సరిపోతుంది. డస్ట్ కవర్‌తో వచ్చే బైట్ వాల్వ్‌ను రోడ్డుపై రైడ్ చేస్తూ కూడా ఈజీగా వాడొచ్చు. అయితే లాంగ్ చిన్ కర్టన్ ఉన్న హెల్మెట్ అయితే కొంచెం అడ్జస్ట్‌మెంట్ కావచ్చు.
ధర పరంగా మంచి వాల్యూ
Navigator బ్యాక్‌ప్యాక్ ధర రూ.3,550. Reload బ్లాడర్ రూ.1,350. రెండూ కలిపితే రూ.4,900. ఈ ధర... OGIO లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కంటే చవక, కానీ క్వాలిటీ మాత్రం అవే రేంజ్‌లో ఉంటుంది.
వర్షాకాలంలో వాడకం కోసం వాటర్‌ప్రూఫ్ కంపార్ట్‌మెంట్ ఉండి ఉంటే బాగుండేది. కానీ, ఒక సింపుల్ జిప్ పౌచ్ దీని కోసం విడిగా కొని వాడితే ఇక సమస్యే లేదు. రోజువారీ రైడర్స్, లాంగ్ రైడ్ లవర్స్, వీకెండ్ స్ప్రింట్ రైడర్లందరికీ Navigator + Reload కాంబో ఒక ప్రాక్టికల్, కాంపాక్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ హైడ్రేషన్ సొల్యూషన్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















