Honda NX125: కొత్త స్కూటీని లాంచ్ చేయనున్న హోండా - ఎన్‌టార్క్ 125కి పోటీగా!
Honda NX125 India Launch: ప్రముఖ ఆటోమేకర్ హోండా మనదేశంలో కొత్త స్కూటర్‌ను లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. అదే హోండా ఎన్ఎక్స్125. ఇది టీవీఎస్ ఎన్‌టార్క్ 125కి పోటీని ఇవ్వనుంది.
Honda New Scooter: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త మోడల్‌తో మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కంపెనీ తన కొత్త ఉత్పత్తికి పేటెంట్ కూడా దాఖలు చేసింది. హోండా కొత్త డిజైన్‌తో ఎన్ఎక్స్125ని డిజైన్ చేసింది. ఎన్ఎక్స్125 మొదటిసారిగా 2020 సంవత్సరంలో చైనాలో లాంచ్ అయింది.
హోండా ఎన్ఎక్స్125
హోండా ఎన్ఎక్స్125 అనేది ఒక స్పోర్టీ స్కూటర్. ఇది గ్రాజియా తరహాలో ఉంటుంది. అదే పవర్‌ట్రెయిన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో గ్రాజియా అందుబాటులో లేదు. హోండా ఈ కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేస్తే అది టీవీఎస్ ఎన్‌టార్క్ 125కి గట్టి పోటీని ఇస్తుంది. దీంతో పాటు ఇది సుజుకి అవెనిస్, యమహా రే జెడ్ఆర్ 125, ఏప్రిలియా ఎస్ఆర్ 125లకు కూడా దీటైన ప్రత్యర్థిగా నిలుస్తుంది.
హోండా కొత్త స్కూటర్ డిజైన్
ఈ కొత్త హోండా స్కూటర్ ముందు భాగంలో ఆధునిక డ్యూయల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంది. ఇది సూచికలుగా కూడా పనిచేస్తుంది. దీంతో పాటు ఈ స్కూటర్‌లో డ్యూయల్ టోన్‌తో హ్యాండిల్ బార్ కౌల్, ఇంటీరియర్ ప్యానెల్స్, టెయిల్ సెక్షన్‌ను ఇన్‌స్టాల్ చేశారు. మీరు ఈ స్కూటర్ మొత్తం షేప్‌లో షార్ప్ ఎడ్జెస్‌ను చూడవచ్చు.
Also Read: రూ.ఆరు లక్షల్లోనే సెవెన్ సీటర్ కారు - పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!
హోండా ఎన్ఎక్స్125 ఫీచర్లు
హోండా ఈ కొత్త స్కూటర్‌ను అనేక ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ఈ స్కూటర్‌లో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించనున్నారు. దీంతో పాటు ముందు భాగంలో రెండు చిన్న స్టోరేజ్ కంపార్ట్‌మెంట్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్‌లో అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంది. ఈ కొత్త ద్విచక్ర వాహనంలో యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇన్‌స్టాల్ చేశారు. ఈ స్కూటర్ ఇంధన ట్యాంక్ కెపాసిటీ ఆరు లీటర్లుగా ఉంది.
హోండా యాక్టివా రేంజ్‌లో ఉంటుందా?
భారత మార్కెట్లో ఒకే ఒక హోండా స్కూటర్ అందుబాటులో ఉంది. అదే హోండా యాక్టివా 125. హోండా యాక్టివా అనేది ఒక 125 సీసీ స్కూటర్. కంపెనీ గ్రాజియాను భారత మార్కెట్‌లో కూడా విడుదల చేసింది. కానీ ఈ స్కూటర్ అమ్మకాలు తక్కువగా ఉన్న కారణంగా దీన్ని నిలిపివేశారు. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో యాక్టివా కూడా ఒకటి. ఈ కొత్త మోడల్ ఇండియాకు వస్తే ఎంత మందికి నచ్చుతుందో చూడాలి.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
A perfect deal for a perfect ride! Get incredible deals on Honda 2wheelers. Enjoy an exclusive 5% cashback upto INR 5000, with free service maintenance package for a year and 3 + 3 years of warranty. Dont delay - visit our dealership today!
— Honda 2 Wheelers India (@honda2wheelerin) September 2, 2024
For further details, please give us a… pic.twitter.com/u6wj5VMEa3