అన్వేషించండి

30hp పవర్‌తో 250cc బైక్ - హీరో ఎక్స్‌ట్రీమ్ 250R నిజ జీవిత మైలేజ్ ఇదే!

హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బైక్ సిటీలో, హైవే మీద ఎంత మైలేజ్ ఇస్తుంది? 30hp పవర్ కలిగిన ఈ 250cc స్పోర్టీ బైక్‌పై నిర్వహించిన రియల్ వరల్డ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఫలితాలు ఇవే.

Hero Xtreme 250R Fuel Economy Test: భారతీయ మార్కెట్లో 250సీసీ సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. యువతను ఆకట్టుకునే స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లతో హీరో మోటోకార్ప్ తీసుకొచ్చిన ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ ప్రస్తుతం యువత దృష్టిని ఆకర్షిస్తోంది. చూడడానికి ఈ బైక్ ఎంత బాగున్నా, ఎక్కువమంది ఎక్కువగా తెలుసుకోవాలనుకునేది ఒక్కటే.. మైలేజ్ ఎంత ఇస్తుంది?

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు, ఎక్స్‌పర్ట్‌లు Hero Xtreme 250Rపై ప్రత్యేక రియల్ వరల్డ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహించారు. నగర రోడ్లు, హైవే పరిస్థితుల్లో బైక్ ఎంత ఇంధనం వినియోగిస్తుందో పరిశీలించారు.

శక్తిమంతమైన ఇంజిన్

హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్‌లో 249.7cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 30 hp పవర్‌ను, 25 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. పనితీరు పరంగా ఈ బైక్ నగర ప్రయాణాలతో పాటు హైవే రైడింగ్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది.

హైవేపై ఎంత మైలేజ్?

మొదట బైక్‌ ట్యాంక్‌ ఫుల్‌ చేసి దాదాపు 49.8 కిలోమీటర్ల హైవే రూట్‌లో నడిపారు. ఈ ప్రయాణం పూర్తయిన తర్వాత ట్యాంక్‌ను మళ్లీ నింపగా 1.27 లీటర్ల పెట్రోల్ అవసరమైంది. దీంతో, హీరో ఎక్స్‌ట్రీమ్ 250R హైవేపై లీటరుకు 39.21 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చినట్లు లెక్క తేలింది. 250cc సెగ్మెంట్‌లో ఇది మంచి ఫలితంగా చెప్పవచ్చు.

నగరంలో పరిస్థితి ఎలా ఉంది?

హైవే టెస్ట్ అనంతరం, మళ్లీ ట్యాంక్‌ను ఫుల్‌ చేసి, ముంబై నగరంలోని రద్దీ రోడ్లపై బైక్‌ను 47.3 కిలోమీటర్ల మేర నడిపారు. ట్రాఫిక్ పరిస్థితుల్లో ప్రయాణం పూర్తయ్యాక ట్యాంక్‌ను తిరిగి నిండుగా నింపేందుకు 1.44 లీటర్ల ఇంధనం అవసరమైంది. 
దీంతో, సిటీ మైలేజ్ లీటరుకు 32.84 కిలోమీటర్లుగా నమోదైంది. ట్రాఫిక్, తరచూ బ్రేకింగ్, వేగం మార్పులు వంటి అంశాలు ఉండే నగర ప్రయాణాల్లో ఈ నంబర్‌ కూడా చాలా బాగుందనే చెప్పవచ్చు.

సగటు మైలేజ్ ఎంత?

సిటీ, హైవే ఫలితాలను కలిపి చూస్తే హీరో ఎక్స్‌ట్రీమ్ 250R సగటున లీటరుకు 36.02 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది.

మైలేజ్ వివరాలు:

* సిటీ మైలేజ్ – 32.84 కి.మీ./లీటర్
* హైవే మైలేజ్ – 39.21 కి.మీ./లీటర్
* సగటు మైలేజ్ – 36.02 కి.మీ./లీటర్

ఈ మైలేజ్ అందరికీ వస్తుందా?

పరీక్ష సమయంలో, ఎక్స్‌పర్ట్‌లు ట్రాఫిక్‌కు అనుగుణంగా స్థిరమైన వేగాన్ని కొనసాగించారు. నగరంలో అనవసరంగా వేగం పెంచడం, ఓవర్‌టేక్‌లు చేయడం వంటివి చేయలేదు. హైవేపై ఎక్కువ సమయం గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు.

వాస్తవ వినియోగానికి వచ్చేసరికి.... రైడింగ్ స్టైల్‌, ట్రాఫిక్ పరిస్థితులు, రోడ్ల స్థితి, వాతావరణం వంటి అంశాలపై మైలేజ్ మారవచ్చు. స్పోర్టీగా రైడ్ చేసే వారికి ఈ నంబర్లు కొంత తగ్గే అవకాశం ఉంది.

కొనుగోలుదారులకు మంచి ఎంపికేనా?

పనితీరు, పవర్, మైలేజ్ మధ్య సమతుల్యత కోరుకునే వారికి హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది. 30hp పవర్ అందించే 250cc బైక్ నుంచి సగటున 36 కి.మీ. మైలేజ్ రావడం ఈ సెగ్మెంట్‌లో మంచి ఫలితంగా చెప్పవచ్చు. రోజువారీ వినియోగంతో పాటు వీకెండ్ హైవే రైడింగ్‌ను ఇష్టపడే రైడర్లకు ఇది సరైన ప్యాకేజీగా కనిపిస్తోంది.

హైదరాబాద్‌ & విజయవాడలో ధర

విజయవాడలో Hero Xtreme 250R ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹ 1,72,524 కాగా, అన్ని ఖర్చులు కలుపుకుని ఆన్‌రోడ్‌ ధర: ₹ 2,08,466.

హైదరాబాద్‌లో Hero Xtreme 250R ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹ 1,72,524 కాగా, అన్ని ఖర్చులు కలుపుకుని ఆన్‌రోడ్‌ ధర: ₹ 2,17,252.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
కొత్త SUVల దెబ్బకు పడిపోతుందన్నారు.. కానీ ఈ కారు జోరు తగ్గలేదు, ఇప్పటికీ టాప్‌ ప్లేస్‌!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో
Maruti Wagon R CNG నిజంగా ఎంత మైలేజ్ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో వచ్చిన ఫలితం ఇదే!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget