అన్వేషించండి

Low Cost Bike: ఈ హీరో బైక్‌ రేటు కేవలం రూ.62 వేలే - బైక్‌ టాక్సీ కెప్టెన్లు, డైలీ వర్కర్లకు డబ్బు మిగిలిస్తుంది!

Hero HF Deluxe: ఈ బైక్ 97.2cc ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్-సిలిండర్, OHC టెక్నాలజీ ఇంజిన్‌తో పని చేస్తుంది. స్మూత్‌ ట్రాన్స్‌మిషన్ కోసం 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ అమర్చారు.

Hero HF Deluxe Price, Mileage And Features Telugu: హీరో HF డీలక్స్, తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ రేటు బైకుల్లో ఒకటి. తక్కువ ధర, మంచి మైలేజ్‌, తక్కువ నిర్వహణ ఖర్చుల కారణంగా ఈ బండి అమ్మకాలు చాలా బాగున్నాయి,  గత నెల (జులై 2025‌) లో కూడా బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. ఆ నెలలో, మొత్తం 71,477 యూనిట్ల HF డీలక్స్ అమ్మకాలు జరిగాయి, గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే ఇది 53 శాతం పెరుగుదల. 

ఆంధ్ర, తెలంగాణలో ధర
హీరో HF డీలక్స్ 2025 మోడల్ ఎక్స్-షోరూమ్ ధర విజయవాడలో రూ. 62,018 నుంచి (Hero HF Deluxe ex-showroom price, Hyderabad) ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి మారుతుంది. ఇప్పుడు కొన్ని బైకులను సెకండ్‌ హ్యాండ్‌లో కొనాలన్నా ఇంతకంటే ఎక్కువ రేటే చెబుతున్నారు.

హీరో HF డీలక్స్ బేస్‌ వేరియంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం దాదాపు రూ. 9,000 ఖర్చు అవుతుంది. ఇన్సూరెన్స్‌ కోసం దాదాపు రూ. 6000 చెల్లించాలి. ఇతర చిన్నపాటి ఖర్చులు కూడా కలుపుకుని, బెజవాడలో ఈ బండి ఆన్-రోడ్ ధర (Hero HF Deluxe on-road price, Vijayawada) దాదాపు రూ. 77,100 అవుతుంది. హైదరాబాద్‌లోనూ ఎక్స్‌-షోరూమ్‌ రేటు (Hero HF Deluxe ex-showroom price, Hyderabad) రూ. 62,018 నుంచి ప్రారంభమవుతుంది, దాదాపు రూ. 77,100 ఆన్‌-రోడ్‌ ధర (Hero HF Deluxe on-road price, Hyderabad) వద్ద కొనవచ్చు.

హీరో HF డీలక్స్ ఫీచర్లు
హీరో HF డీలక్స్ డిజైన్‌ స్టైలిష్‌గా, చాలా బాగుంటుంది. ఇది చాలా ఆకర్షణీయమైన & ఆధునికంగా కనిపించే బైక్. బైక్ సీటు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎక్కువ సేపు కూర్చుని నడిపేందుకు వీలుగా ఉంటుంది. ఈ బండి దాని తక్కువ బరువు కారణంగానూ దీనిని సులభంగా హ్యాండిల్‌ చేయవచ్చు. కంపెనీ, హీరో HF డీలక్స్‌ను కిక్‌ స్టార్ట్‌, సెల్ఫ్‌ స్టార్ట్‌ ఆప్షన్స్‌లో అమ్ముతోంది.

హీరో HF డీలక్స్‌లో మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థను కంపెనీ అమర్చింది. ఈ మోటర్‌ సైకిల్‌ సస్పెన్షన్ వ్యవస్థ కూడా చాలా బాగుంది. బైక్‌ మెరుగైన హ్యాండ్లింగ్ కోసం డిజిటల్ మీటర్, ఇగ్నిషన్ సిస్టమ్ & ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి.

హీరో HF డీలక్స్ ఇంజిన్
హీరో HF డీలక్స్ 97.2cc ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్-సిలిండర్, OHC టెక్నాలజీ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది. ఈ ఇంజిన్‌ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌కు అనుసంధానమై ఉంది, గేర్‌ షిఫ్టింగ్ అనుభవం స్మూత్‌గా ఉంటుంది. 

డబ్బును ఆదా చేసే మైలేజీ
హీరో HF డీలక్స్ అద్భుతమైన మైలేజీని ఆఫర్‌ చేస్తుంది. కంపెనీ లెక్క ప్రకారం, ఇది లీటరు పెట్రోలుకు దాదాపు 70 km ప్రయాణిస్తుంది. ARAI సర్టిఫై చేసిన మైలేజీ 68 kmpl. అంటే, చాలా బైకులతో పోలిస్తే ఇది బెస్ట్‌ మైలేజీ ఇస్తుంది, డబ్బును ఆదా చేస్తుంది.

ఈ డైలీ కమ్యూటర్ బైక్‌లో 9.6 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్‌ను పూర్తిగా నింపితే, చేస్తే 670 కి.మీ. వరకు నడపవచ్చు. 

కంపెనీ, ఇటీవల, కొత్త ఫీచర్లతో 'హీరో HF డీలక్స్ ప్రో' ను లాంచ్‌ చేసింది. ఈ బైక్‌కు ఇంధనాన్ని ఆదా చేసే i3S టెక్నాలజీని అందించింది. 

టాప్ హెడ్ లైన్స్

Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget