₹49,999 కే EMotorad G1 Cargo e-Cycle - డెలివరీ బాయ్స్‌కి డీసెంట్ ఆఫర్, 5 ఏళ్ల వారంటీ కూడా!
EMotorad G1 Cargo E Cycle: ఇమోటార్డ్, కొత్తగా G1 కార్గో ఈ-సైకిల్ లాంచ్ చేసింది. ఒక్క చార్జ్‌తో 100 కి.మీ. రేంజ్ ఇవ్వగలదు. ₹49,999 ధర, 5 ఏళ్ల వారంటీతో యూత్, డెలివరీ రైడర్ల కోసం ఇదొక గేమ్‌చేంజర్!.

EMotorad G1 Cargo E Cycle Price, Mileage, Features In Telugu: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో, యువతను ఎక్కువగా వెయిటింగ్‌లో పెట్టిన ఒక కొత్త మోడల్ రోడ్డెక్కింది. ఎలక్ట్రిక్ సైకిల్ తయారీదారు EMotorad, తాజాగా, G1 కార్గో ఈ-సైకిల్ ను లాంచ్ చేసింది. ఇది ముఖ్యంగా లాస్ట్-మైల్ డెలివరీ కోసం డిజైన్ అయింది. అయితే, వ్యక్తిగత ఉపయోగం కోసం కూడా సూపర్‌గా సరిపోతుంది. మీరు గానీ ఈ టూవీలర్‌ను కొంటే.. ఈ కొత్త సైకిల్‌ను ఎక్కడ కొన్నావు, ఎంతకు కొన్నావు, ఎంత ఇస్తుందంటూ ప్రజలు ప్రశ్నలతో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు.
రేంజ్ & బ్యాటరీ స్పెక్స్
G1 కార్గో ఈ-సైకిల్‌లో 250W రియర్ హబ్ మోటార్ అమర్చారు. దీని పవర్‌కి సపోర్ట్‌గా డ్యూయల్ 48V 10.2Ah రిమూవబుల్ బ్యాటరీలు ఉంటాయి. ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే, పెడల్ అసిస్ట్ మోడ్‌లో 100 కి.మీ వరకు, థ్రోటిల్ మోడ్‌లో 75 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. అంటే డెలివరీ రైడర్లకు ఒక పెద్ద సొల్యూషన్ & అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు.
డిజైన్ & కంఫర్ట్
హై టెన్సైల్ లాంగ్‌టెయిల్ స్టీల్ ఫ్రేమ్‌తో నిర్మించిన ఈ సైకిల్ బలమైన బాడీతో వచ్చింది. ముందు భాగంలో 24 x 3.0 అంగుళాల వెడల్పాటి టైర్లు, వెనుక భాగంలో 20 x 3.0 అంగుళాల టైర్లు అమర్చారు. దీనివల్ల సైకిల్‌కి అదనపు స్టెబిలిటీ వస్తుంది. 80mm ట్రావెల్ ఫోర్క్ సస్పెన్షన్ వలన గతుకుల రోడ్డుపైనా స్మూత్‌గా రైడ్ చేయొచ్చు.
సేఫ్టీ ఫీచర్లు
ఈ సైకిల్ రైడర్ల కోసం కొన్ని సేఫ్టీ ఫీచర్లను కూడా పరిచయం చేశారు. సైకిల్‌కు 180mm మెకానికల్ డిస్క్ బ్రేకులు ఇచ్చారు. రైడింగ్ డేటాను చూపించే Cluster C2 మల్టీ ఫంక్షనల్ డిస్‌ప్లే కూడా ఉంది.
లోడ్
పెద్ద బరువుల విషయంలోనూ డెలివెరీ బాయ్స్ హ్యాపీగా ఈ టూవీర్‌ను వాడుకోవచ్చు. ఈ సైకిల్ గరిష్టంగా 150 కిలోల బరువు మోయగలదు.
ధర & వారంటీ
ముఖ్యంగా ధర చాలా ఆకర్షణీయంగా ఉంది. కేవలం ₹49,999 ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా 5 ఏళ్ల ఫ్రేమ్ వారంటీ ఇస్తున్నారు. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇంత స్ట్రాంగ్ ఫీచర్లతో ఈ-సైకిల్ రావడం నిజంగా గేమ్‌చేంజర్.
ఎక్కడ దొరుకుతుంది?
G1 కార్గో ఈ-సైకిల్ ఇప్పటికే EMotorad డీలర్ నెట్‌వర్క్, అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
“G1 కార్గో ఈ-సైకిల్ కేవలం బిజినెస్‌ల కోసం మాత్రమే కాదు, వ్యక్తిగత అవసరాలకూ ఉపయోగపడుతుంది. ఇంధన ఖర్చు తగ్గించి, మెయింటెనెన్స్ ఖర్చు తగ్గిస్తుంది. అదనంగా గ్రీన్ ఫ్యూచర్ కోసం సాయపడుతుంది” - EMotorad సహ వ్యవస్థాపకుడు & CEO కుణాల్ గుప్తా
EMotorad G1 కార్గో ఈ-సైకిల్ యువతకు, డెలివరీ బాయ్స్‌కి, చిన్న బిజినెస్ ఓనర్స్‌కి ఖచ్చితంగా కొత్త మార్గం చూపే వాహనం. తక్కువ ధర, ఎక్కువ రేంజ్, బలమైన ఫ్రేమ్, 5 ఏళ్ల వారంటీతో ఈ సైకిల్ భారతీయ ఈ-మొబిలిటీ మార్కెట్‌లో గేమ్‌చేంజర్‌గా నిలిచే అవకాశం ఉంది.





















