Diwali Car Offers 2025: మారుతి నుంచి టాటా, హ్యుందాయ్ వరకు - కస్టమర్లకు బంపర్ డిస్కౌంట్లు, Grand Vitara పై సూపర్ ఆఫర్
2025 దీపావళికి మారుతి, టాటా & హ్యుందాయ్ తమ కార్ల మీద గణనీయమైన ఆఫర్లను ప్రకటించాయి. కొన్ని కార్ల మీద లక్షల రూపాయల వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.

2025 Diwali Car Offers Discounts: మారుతి సుజుకి, ఈ దీపావళి సీజన్‌లో తన కస్టమర్ల కోసం ఒక మంచి బహుమతిని ప్రకటించింది. ఈ కంపెనీ, ప్రీమియం SUV Grand Vitara పై ₹1.80 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల (అక్టోబర్ 2025) మొత్తం, నెక్సా డీలర్‌షిప్స్‌లో అందుబాటులో ఉంది. వేరియంట్‌ను బట్టి ఆఫర్ ప్రయోజనాలు మారవచ్చు. ఈ నెలలో కారు కొంటే.. టాటా, హ్యుందాయ్ కార్లపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
మారుతి గ్రాండ్ విటారా
నివేదికల ప్రకారం, మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై ₹1.80 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. పెట్రోల్ వేరియంట్‌లపై కస్టమర్లు ₹1.50 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. Grand Vitara Dominion Edition కోసం ₹57,900 విలువైన యాక్సెసరీ ప్యాక్ కూడా ఈ ఆఫర్‌లో చేర్చారు. CNG వేరియంట్‌ను ఎంచుకునే కస్టమర్‌లు ₹40,000 వరకు తగ్గింపును పొందుతారు. ఈ ఆఫర్ SUV అన్ని వేరియంట్లకు (సిగ్మా, డెల్టా, జీటా & ఆల్ఫా) వర్తిస్తుంది. గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్ ధర ₹10.76 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది దాని విభాగంలో పైసా వసూల్ SUVగా పేరు తెచ్చుకుంది.
ఇంజిన్ & మైలేజ్
మారుతి గ్రాండ్ విటారాను టయోటా సహకారంతో అభివృద్ధి చేశారు & Urban Cruiser Hyryder కు శక్తినిచ్చే అదే 1.5-లీటర్ K15 పెట్రోల్ ఇంజిన్‌ను విటారాలోనూ బిగించారు. ఈ ఇంజిన్ 100 bhp & 135 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఈ SUV లో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఎంపిక కూడా ఉంది. ఈ స్పెసిఫికేషన్ల కారణంగా, ఇది దాని విభాగంలో అత్యంత అధునాతన SUVలలో ఒకటిగా నిలిచింది. హైబ్రిడ్ వేరియంట్ పెట్రోల్ ఇంజిన్‌తో ఎలక్ట్రిక్ మోటారును కలిపి ఉపయోగిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ కారుకు అదనపు శక్తిని అందిస్తుంది & బ్యాటరీని కూడా ఛార్జ్ చేస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ SUV లీటరుకు 27.97 km వరకు మైలేజీని అందిస్తుంది & పూర్తి ట్యాంక్‌తో 1200 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేయగలదు.
టాటా మోటార్స్ దీపావళి ఆఫర్లు
టాటా మోటార్స్ కూడా తన కస్టమర్ల కోసం గొప్ప దీపావళి ఆఫర్‌ను లాంచ్ చేసింది. తన MY24 మోడళ్లపై ₹1.35 లక్షల వరకు డిస్కౌంట్‌లను ఈ కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్‌లో ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్ & కన్స్యూమర్ డిస్కౌంట్ ఉన్నాయి. Tata Altroz Racer పై ₹1.35 లక్షల వరకు అతి పెద్ద ప్రయోజనాన్ని కంపెనీ అందిస్తోంది. Tiago & Tigor (పెట్రోల్ & CNG)పై ₹45,000 & నెక్సాన్‌పై ₹45,000 చొప్పున ఆఫర్లు ఉన్నాయి. Harrier & Safari డీజిల్ మోడళ్లపై ₹75,000 వరకు ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చు.
హ్యుందాయ్ దీపావళి ఆఫర్లు
ఈ పండుగ సీజన్‌లో హ్యుందాయ్ ఇండియా కూడా తన కస్టమర్లకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. కంపెనీ తన కార్లపై మొత్తం ₹7 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. Grand i10 Nios పై ₹75,000 వరకు మొత్తం ప్రయోజనం పొందవచ్చు, Hyundai Aura పై ₹58,000 వరకు మొత్తం ప్రయోజనం పొందవచ్చు. Hyundai Venue, i20 & Alcazar కూడా ముఖ్యమైన దీపావళి ఆఫర్‌లను అందుకుంటున్నాయి. ఈ ప్రయోజనాలు డీలర్‌షిప్ & వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి.
మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే, ఈ దీపావళే సరైన సమయం. మారుతి, టాటా & హ్యుందాయ్ అన్నీ తమ టాప్ మోడళ్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో ప్రతి కస్టమర్‌కు సరైన డీల్ అందుబాటులో ఉంది.





















