Tata Punch EV Super Striker: ఐపీఎల్ 2024లో పంచ్ ఈవీ గెలిచిందెవరు? - వావ్ అనిపించే స్ట్రైక్ రేట్!
James Fraser McGurk: ఐపీఎల్ 2024 సీజన్‌లో టాటా పంచ్ సూపర్ స్ట్రైకర్ అవార్డును ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జేమ్స్ ఫ్రేజర్ మెక్‌గర్క్ గెలుచుకున్నాడు. 234.04 స్ట్రైక్‌రేట్‌తో మెక్‌గర్క్ బ్యాటింగ్ చేశాడు.
Tata Punch EV Winner: ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ ఆదివారం సాయంత్రం చెన్నైలో జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ ఫైనల్ జరిగింది. ఈ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. ఇందులో ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది ఇయర్ పేరును కూడా ప్రకటించారు.
టాటా మోటార్స్ ఐపీఎల్‌కి స్పాన్సర్ కంపెనీ. 2018 సంవత్సరం నుంచి తన స్పాన్సర్‌షిప్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఐపీఎల్ 2024లో ఆడిన అన్ని గేమ్‌లలో టాటా పంచ్ ఈవీ కారుని స్టేడియంలో చూసే ఉంటారు. కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రతి సంవత్సరం ఐపీఎల్ కోసం తన కార్లలో ఒకదాన్ని ఎంచుకుంటుంది. అదే సమయంలో టాటా ఈ సీజన్ కోసం పంచ్ ఈవీని ఎంచుకుంది.
టాటా పంచ్ ఈవీని ఎవరు పొందారు?
టాటా ఐపీఎల్ 2024 అవార్డు వేడుకలో వివిధ రంగాలలో అనేక ప్రైజ్ మనీలు అందించారు. అదే సమయంలో మొత్తం సీజన్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించిన ఆటగాడికి ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ దక్కింది. దీనిలో విజేతకు టాటా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కారు పంచ్ ఈవీని బహుమతిగా అందించారు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ఈ కారును గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో ఫ్రేజర్ మెక్‌గర్క్ 234.04 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.
Striking aisi karo ki sab yaad rakhe 🔥
— Delhi Capitals (@DelhiCapitals) May 26, 2024
Well deserved, Electric Striker Of The Season Jake Fraser McGurk 👏💙 pic.twitter.com/tr5Q0QhSjQ
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
టాటా పంచ్ ఈవీ అదుర్స్
ఇది టాటా మోటార్స్ లాంచ్ చేసిన గొప్ప ఎలక్ట్రిక్ కారు. ఈ కారులో డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ఉంది. దీంతోపాటు స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్ కూడా అందించారు. టాటా పంచ్ ఈవీలో మీరు మీ మానసిక స్థితికి అనుగుణంగా లైట్లను కూడా మార్చుకోవచ్చు. అదే సమయంలో ఈ కారు ముందు స్టోరేజ్ ఏరియాతో పాటు అదనపు స్టోరేజ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ కారుకు సంబంధించిన 20 వేరియంట్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఇది టాటా లాంచ్ చేసిన లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కారు. 35 kWh బ్యాటరీని ఈ కారులో అందించారు. దీని కారణంగా ఈ కారును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 421 కిలోమీటర్ల రేంజ్ అందించనుంది. ఈ టాటా కారు 90 కేడబ్ల్యూ శక్తిని పొందుతుంది. 190 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పంచ్ ఈవీలో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందించారు. ఈ కారును 56 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ టాటా కారు 9.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. టాటా పంచ్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 10,98,999 నుంచి ప్రారంభం అవుతుంది.