Bajaj Pulsar F250: కొత్త పల్సర్ విడుదల చేసిన బజాజ్ - లేటెస్ట్ ఫీచర్లు, రేటు ఎంతో తెలుసా?
Bajaj Pulsar F250 On Road Price: బజాజ్ అత్యాధునిక ఫీచర్లతో కొత్త పల్సర్ బైక్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఉన్న పల్సర్ కు స్పోర్టీ హంగులు అద్ది మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.
Bajaj Pulsar F250 launched, Know Price: భారతీయ టూ వీలర్ మార్కెట్లో తన బైకులను విస్తరించేందుకు బజాజ్ ఆటో ప్రయత్నిస్తూనే ఉంది. రీసెంట్ గా పల్సర్ NS400Zను లాంచ్ చేసిన కంపెనీ, తాజాగా సరికొత్త పల్సర్ F250ని ఇండియన్ మార్కెట్ కు పరిచయం చేసింది. అత్యంత ప్రజాదరణ కలిగిన పలర్స్ లైనప్ లో సరికొత్త హంగులు అద్దుతూ కొత్త బైక్ ను తీసుకొచ్చింది. వాస్తవానికి గత నెలలో పల్సర్ NS400Z విడుదల చేసిన సందర్భంగానే F250 మోడల్‌ను కూడా లాంచ్ చేసింది. అయితే, ఈ మోడల్ ధరకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే పల్సర్ N250ని కూడా విడుదల చేసింది. తాజాగా పల్సర్ లైనప్ లోనే మరో కొత్త మోడల్ ను విడుదల చేసింది.
బజాజ్ పల్సర్ F250 ధర, ఫీచర్లు
బజాజ్ తాజాగా విడుదల చేసిన పల్సర్ F250 ధరను వెల్లడించింది. ఈ కొత్త మోడల్ ధర రూ. 1 లక్షా 51 వేలు(ఎక్స్-షోరూమ్)గా ఫిక్స్ చేసింది. ఇప్పటికే ఈ కొత్త బైక్ బజాజ్ షో రూమ్ లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. గత మోడల్ తో పోల్చితే తాజా F250 ధర కేవలం రూ. 851 ఎక్కువగా ఉండటం విశేషం. అంతేకాదు, గత మోడల్ తో పోల్చితే కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. బ్లూ టూత్ కనెక్టివిటీకి సపోర్టు చేసే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ను యాడ్ చేశారు. యాప్ సపోర్టు, కాల్స్, ఎస్సెమ్మెస్ అలర్ట్స్, నావిగేషన్తో పాటు రెయిన్, రోడ్, స్పోర్ట్ లాంటి 3 ABS మోడ్ లను కలిగి ఉంది.
బజాజ్ పల్సర్ F250 ఇంజిన్ ప్రత్యేకతలు
ఇక బజాజ్ పల్సర్ F250 ఇంజిన్ కూడా లేటెస్ట్ అప్ డేట్స్ ను కలిగి ఉంది. ఈ మోడల్ లో 249.07 cc ఆయిల్ కూల్డ్ ఇంజన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఇంజిన్ 8750rpm దగ్గర 24bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 6500rpm దగ్గర 21.5Nm టార్క్ ను జెనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంది. ఈ లేటెస్ట్ బైక్ లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది. ఈ బైక్ 17 ఇంచుల అల్లాయ్ వీల్స్ తో పాటు టెలిస్కోపిక్ ఫోర్క్ లను కలిగి ఉంటుంది. కొత్త పెటల్ డిస్క్ బ్రేక్‌లు ముందు, వెనుక భాగంలో అమర్చబడి ఉంది. పల్సర్ N250 లాగే ఇందులోనూ 110 సెక్షన్ ఫ్రంట్, 140 సెక్షన్ వెనుక టైర్ సెటప్ ను కలిగి ఉంది.
Bajaj Pulsar F250 is the semi-fared sibling of the N250, brand has confirmed that the F250 will be making its way in the coming months.
— 91Wheels.com (@91wheels) April 17, 2024
Expected Updates-
✅ New full-digital instrument cluster
✅ Traction control system
✅ Three ABS modes: rain, road, and off-road
✅ 37mm USD… pic.twitter.com/xNCKkr7gSc
ఏ బైకులకు పోటీ అంటే?
తాజాగా విడుదలైన బజాజ్ పల్సర్ F250 భారతీయ మార్కెట్లో ఉన్న పలు బైకులకు పోటీగా మారనుంది. కరిజ్మా XMR, సుజుకి Gixxer SF250తో పాటు యమహా R15 V4 లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
Read Also: కారులో కూర్చొంటే క్యాన్సర్ వస్తుందా? తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి