అన్వేషించండి

Car cabins: కారులో కూర్చొంటే క్యాన్సర్ వస్తుందా? తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి

కారు క్యాబిన్లలో విషపూరిత క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్లేమ్ రిటార్డెంట్ల కారణంగానే క్యాన్సర్ సోకే అవకాశం ఉన్నట్లు తేలింది.

Car cabins become toxic: ఈ రోజుల్లో చాలా మంది కార్లు వినియోగిస్తున్నారు. కాస్త దూర ప్రయాణం అయితే, ఎక్కువ మంది కార్లలో వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. విందులు, వినోదాలు, టూర్లకు వెళ్లాలంటే తప్పకుండా కార్లనే వినియోగిస్తున్నాయి. అయితే, కార్లలో ఎక్కువ జర్నీ చేయడం, అదీ కారు అద్దాలు వేసుకుని వెళ్లడం మంచిది కాదంటున్నారు నిపుణులు. కారు క్యాబిన్ క్యాన్సర్ కారక విష వాయువులతో నిండి ఉన్నట్లు తాజాగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.  

కారు క్యాబిన్లలో క్యాన్సర్ కారక వాయువులు

అమెరికాలో ఇటీవల నిర్వహించిన పీర్ రివ్యూడ్ రీసెర్చ్ సంచలన విషయాలను వెల్లడించింది. క్యాబిన్ లోని గాలిలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నట్లు వెల్లడించింది. ఈ వాయువులను పీల్చడం వల్ల కారులో ప్రయాణిస్తున్న వాళ్లు తీవ్రమైన అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని తెలిపింది. కారు క్యాబిన్ లో క్యాన్సర్ కు కారణమయ్యే కెమికల్స్ ఉత్పత్తి అవుతున్నాయని వివరించింది. అమెరికాలోని సుమారు 30 రాష్ట్రాల్లో  నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా 2015 నుంచి 2022 వరకు మార్కెట్లోకి వచ్చిన కార్లపై ఈ అధ్యయనం నిర్వహించారు.   

ఫ్లేమ్ రిటార్డెంట్ కెమికల్స్ తోనే అసలు ముప్పు

కార్లు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు క్యాబిన్‌లో మంటలు వ్యాపించకుండా ఫ్లేమ్ రిటార్డెంట్ కెమికల్స్ ఉపయోగిస్తారు. సీట్లు, ఇంటీరియర్ తయారీలోనూ దీనిని వినియోగిస్తారు. రక్షణ కోసం వాడే ఈ కెమికల్స్ కారణంగానే ఇప్పుడు క్యాన్సర్ ముప్పు తలెత్తుతుందంటున్నారు నిపుణులు. అమెరికాలో నడిచే 99 శాతం కార్లలో TCIPP అనే ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయనాన్ని వాడుతున్నారు. దీనితో పాటు TDCIPP, TCEP అనే మరో రెండు ఫ్లేమ్ రిటార్డెంట్లు కూడా ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనాలు క్యాన్సర్ కు కారణం అవుతున్నాయి.

రోజుకు గంట కారు నడిపినా ప్రమాదమే!

సగటున ఒక కారును రోజూ గంట నడిపితే అనారోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఎక్కువ ప్రయాణాలు చేసే వ్యక్తులు, పిల్లలపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా శ్వాస సంబంధ సమస్యలు ఏర్పడుతాయంటున్నారు. పిల్లల్లో తక్కువ పెరుగుదల, ఉబ్బసం, నరాల బలహీనతం, ఊబకాయం సహా పలు ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. అంతేకాదు, ఫ్లేమ్ రిటార్డెంట్ల వినియోగం వల్ల పిల్లలో IQ శక్తి గణనీయంగా తగ్గుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. నిజానికి పెద్దల కంటే పిల్లలు ఎక్కువగా శ్వాస తీసుకుంటారు. దీంతో వారి మీద ఫ్లేమ్ రిటార్డెంట్ కెమికల్స్ ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు.

వేసవిలో పరిస్థితి మరింత దారుణం

వేసవిలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. విపరీతమైన వేడి కారణంగా కారు క్యాబిన్ లో విష రసాయనాలు విడుదల చేసే వాయువులు పెరుగుతాయని వెల్లడించారు. వేసవిలో మరిన్ని శ్వాస సమస్యలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. పరిస్థితి విషమిస్తే క్యాన్సర్ సోకే అవకాశం ప్రమాదం ఉందంటున్నారు.  

విష రసాయనాల నుంచి ఎలా కాపాడుకోవాలంటే?

కారు క్యాబిన్ లో విడుదలయ్యే విష రసాయనాల నుంచి కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కాపాడుకోవచ్చు. వీలైనంత వరకు షెడ్లు, గ్యారేజీలలో కార్లు పార్కింగ్ చేసే సమయంలో విండోలు ఓపెన్ చేసి పెట్టాలి. టాక్సిక్ ఫ్లేమ్ రిటార్డెంట్ వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జర్నీకి కొద్ది సేపటి ముందు కారు విండోలు ఓపెన్ చేయాలంటున్నారు.   

Read Also: కారుకు ఇలాంటి మార్పులు చేయిస్తున్నారా? చట్టపరంగా వచ్చే చిక్కులేమిటీ? ఈ జాగ్రత్తలు పాటించకపోతే కష్టమే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chudidar Gang in Hyderabad | హైదరాబాద్ లో వణికిస్తున్న చుడీదార్ దొంగలు | ABP DesamHema Bangalore Rave Party Issue | చిల్ అవుతున్న హేమ.. మరో కేసులో చిక్కుకుందా..! | ABP DesamSIT Report to AP DGP | ఏపీ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి | ABP DesamTeam Kannappa at Cannes Film Festival 2024 | కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మంచు ఫ్యామిలీ క్లాస్ షో | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Ap Elections: 'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
TS ECET - 2024 Results: తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి
TS ECET - 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, 95.86 శాతం ఉత్తీర్ణులు - ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి
Hema: రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
Nellore News: కన్నీళ్లు పెట్టించే ఘటన - అక్క మృతిని తట్టుకోలేని చెల్లెలు, మృతదేహం వద్ద ఏడుస్తూ...
కన్నీళ్లు పెట్టించే ఘటన - అక్క మృతిని తట్టుకోలేని చెల్లెలు, మృతదేహం వద్ద ఏడుస్తూ...
Embed widget