అన్వేషించండి

రోల్స్‌ రాయిస్‌, లాంబోర్గినీ, మెక్‌లారెన్‌ - ఏ సెలబ్రిటీ ఏ కార్‌ నడుపుతున్నారు?

ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌, ఎంఎస్‌ ధోనీ, నటాషా పూనావాల్లా సహా ఇండియన్‌ సెలబ్రిటీలు నడిపే లగ్జరీ, స్పోర్ట్స్‌, విన్టేజ్‌ కార్ల పూర్తి వివరాలు.

Celebrity Cars India: సెలబ్రిటీకి కారు అంటే కేవలం ప్రయాణ సాధనం కాదు. అది వారి అభిరుచి, వ్యక్తిత్వం, స్టేటస్‌, అవసరమైతే జనాల నుంచి ఎంత త్వరగా తప్పించుకోవాలనే ఆలోచనను కూడా చెప్పేస్తుంది. ముంబయిలో బాలీవుడ్‌ స్టార్లు నడిపే లగ్జరీ కార్లే కాదు... హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై వంటి నగరాల్లోనూ ఓ ఖరీదైన కారు కనిపిస్తే చాలు, అది ఎవరిదో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. వెంటాడే కెమెరాలు, సోషల్‌ మీడియా హడావిడి మధ్య సెలబ్రిటీలు ఎంచుకునే కార్లు పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయమే.

లగ్జరీ కార్లు

ఇషా అంబానీ - బెంట్లీ ఆర్నేజ్‌ ఆర్‌
బిలియనీర్‌ వారసురాలి గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నా, ఇంగ్లాండ్‌లో తయారైన బెంట్లీ ఆర్నేజ్‌ ఆర్‌ ప్రత్యేక ఆకర్షణ. టైమ్‌లెస్‌ డిజైన్‌, రాజసమైన లుక్‌ ఈ కార్‌కు ప్రత్యేకత.

అజయ్‌ దేవ్‌గణ్‌ - మసెరాటి క్వాట్రోపోర్టే
తనను తాను కార్‌ ఎంథూజియాస్ట్‌గా చెప్పుకునే అజయ్‌ దేవ్‌గణ్‌ కలెక్షన్‌లో ఈ ఇటాలియన్‌ లగ్జరీ సెడాన్‌ కీలకం. శక్తిమంతమైన ఇంజిన్‌, ప్రీమియం ఇంటీరియర్‌ దీనికి బలం.

కరీనా కపూర్‌ ఖాన్‌ - BMW X7
స్టైల్‌ విషయంలో రాజీ లేని కరీనా గ్యారేజ్‌లో BMW X7 ప్రత్యేకంగా నిలుస్తుంది. ఏడు సీట్లతో వచ్చే ఈ SUV కంఫర్ట్‌, పవర్‌, ప్రెస్టీజ్‌కు సరైన ఉదాహరణ.

ఓరీ - మెర్సిడెస్‌ బెంజ్‌ G-Wagon G350d
బార్బీ పింక్‌ కలర్‌లో కనిపించే ఈ G-Wagon సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌. ఆఫ్‌ రోడ్‌ సామర్థ్యంతో పాటు స్టైల్‌కు ఇది ఫేమస్‌.

అల్లు అర్జున్‌ - జాగ్వార్‌ XJL
స్టైలిష్‌ స్టార్‌ కార్‌ టేస్ట్‌ కూడా అంతే స్టైలిష్‌. జాగ్వార్‌ ఫ్లాగ్‌షిప్‌ సెడాన్‌ XJL ఆయన కలెక్షన్‌లో క్రౌన్‌లా ఉంటుంది.

హృతిక్‌ రోషన్‌ - రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌
ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ సెడాన్‌లలో ఒకటైన రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ హృతిక్‌ స్టైల్‌కు పర్ఫెక్ట్‌ మ్యాచ్‌.

స్పోర్ట్స్‌ కార్లు

రణ్‌బీర్‌ కపూర్‌ - ఆడి R8
ఫాస్ట్‌, అగ్రెసివ్‌, టెక్నాలజీతో నిండిన ఆడి R8 రణ్‌బీర్‌ గ్యారేజ్‌లో స్పెషల్‌.

శ్రద్ధా కపూర్‌ - లాంబోర్గినీ హురాకాన్‌ టెక్నికా
ఎరుపు రంగులో వచ్చే ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ కార్‌ ముంబయి రోడ్లపై అందరి చూపులు తనవైపు తిప్పుకోగలదు.

నటాషా పూనావాల్లా - మెక్‌లారెన్‌ 720S
ఫ్యాషన్‌లో ఎంత పర్‌ఫెక్ట్‌ టేస్ట్‌ ఉంటుందో, కార్లలోనూ అంతే. ఇండియాలో ఏకైక రైట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ మెక్‌లారెన్‌ 720S ఆమెదే.


ప్రభాస్‌ - లాంబోర్గినీ అవెంటడార్‌
భారీ పవర్‌, వేగానికి కేరాఫ్‌ అయిన ఈ ఇటాలియన్‌ సూపర్‌కార్‌ ప్రభాస్‌ ఇమేజ్‌కు అద్దం పడుతుంది.

విన్టేజ్‌ కార్లు

ఎంఎస్‌ ధోనీ - పాంటియాక్‌ ఫైర్‌బర్డ్‌
బైక్‌లతో పాటు విన్టేజ్‌ కార్లపై ప్రేమ ఉన్న ధోనీ, క్రికెట్‌ రిటైర్మెంట్‌ తర్వాత ఈ అమెరికన్‌ క్లాసిక్‌ను కొనుగోలు చేశారు.

జాకీ ష్రాఫ్‌ - SS జాగ్వార్‌ 100
1930ల కాలానికి చెందిన ఈ అరుదైన కారు ఆయన క్లాసిక్‌ టేస్ట్‌ను చూపిస్తుంది.

అమితాబ్‌ బచ్చన్‌ - ఫోర్డ్‌ ప్రిఫెక్ట్‌
తన బాల్య జ్ఞాపకాలతో ముడిపడిన ఈ కారు తిరిగి జీవితంలోకి రావడం బిగ్‌బీకి ఎమోషనల్‌ మోమెంట్‌.

అదార్‌ పూనావాల్లా - రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ సిరీస్‌ I
1920ల నాటి ఈ విన్టేజ్‌ రోల్స్‌ రాయిస్‌ టైమ్‌లెస్‌ క్రాఫ్ట్‌స్మన్‌షిప్‌కు నిదర్శనం.

మొత్తం మీద, ఇండియన్‌ సెలబ్రిటీల కార్లు వారి స్టేటస్‌కే కాదు, వారి వ్యక్తిత్వానికి కూడా స్పష్టమైన ప్రతిబింబంగా నిలుస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

EV Driving Range Tips: EV రేంజ్‌ పెంచే టిప్స్ ఇవే! పదే పదే ఛార్జింగ్ చేయాల్సిన పని లేదు! 
EV రేంజ్‌ పెంచే టిప్స్ ఇవే! పదే పదే ఛార్జింగ్ చేయాల్సిన పని లేదు! 
33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget