అన్వేషించండి

What is Meant by Connected Car: మీది కనెక్టెడ్ కారేనా? ఈ వాహనాల్లో ఉండే ఫీచర్లు, సౌకర్యాలు ఏంటీ?

What is Meant by Connected Car:భారతీయ రోడ్లపై స్మార్ట్ విప్లవం జోరందుకుంది. కనెక్టెడ్‌ కార్ల యుగం మరో స్థాయికి చేరుకుంటోంది. ఫీచర్లు, సౌకర్యాలు, ప్రైవసీ రిస్క్‌ల గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కార్లు ఇప్పుడు కంప్యూటర్లలా మారి, కనెక్టెడ్ ఫీచర్లు బడ్జెట్ కార్లలోనూ వస్తున్నాయి.
  • స్మార్ట్ కార్లు ఇంటర్నెట్, 5G, టెలీమాటిక్స్ ద్వారా డేటా, నావిగేషన్ అందిస్తాయి.
  • భారత మార్కెట్లో కనెక్టెడ్ కార్ల అమ్మకాలు, వినియోగదారులు రిమోట్ ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
  • భద్రత, సౌకర్యం పెంచినా, డేటా భద్రత, బ్యాటరీ డ్రెయిన్పై నిపుణుల హెచ్చరికలున్నాయి.

What is Meant by Connected Car:గత కొన్ని దశాబ్దాలుగా కేవలం రవాణా సాధనంగా మాత్రమే పరిగణించే కార్లు ఇప్పుడు కంప్యూటర్ల మాదిరిగా మారిపోతున్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులు అలాంటి కార్ల కొనేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల భారత్ వాహన రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు లగ్జరీ కార్లకే పరిమితమైన కనెక్టెడ్‌ ఫీచర్లు ఇప్పుడు సామాన్యుడు కొనే బడ్జెట్‌ కార్లలో కూడా స్టాండర్డ్‌ ఫీచర్లుగా మారుతున్నాయి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, 5G టెక్నాలజీతో అనుసంధానించే ఈ స్మార్ట్‌ కార్లు మన ప్రయాణాన్ని ఎలా సౌకర్యమంతగా మారుస్తున్నాయో చూద్దాం. 

కనెక్టెడ్ కార్ అంటే ఎలా ఉంటుంది?

కనెక్టెడ్ కార్ లేదా స్మార్ట్ కార్ అంటే ఇంటర్నెట్‌కు నిరంతరం కనెక్ట్ అయి ఉండే వాహనం. ఇది కేవలం ఒక వైపు నుంచి మాత్రమే కాకుండా అన్ని వైపుల నుంచి సమాచార వ్యవస్థ కలిగి ఉంటాయి. ఇదంతా టెలీమాటిక్స్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ప్రతి కనెక్టెడ్‌ కార్‌లో ఒక 4G లేదా 5G మోడెమ్ ఎంబెడ్ అయి ఉంటుంది. ఇది డేటా షేరింగ్, నావిగేషన్, ఎంటర్‌టైన్మెంట్‌, సేఫ్టీ ఫీచర్లు అందిస్తుంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతోపాటు ఓవర్‌ ది ఎయిర్‌ అంటే ఓటీఏ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌వంటి ఫీచర్లు ఉంటాయి. 

ఈ వాహనాలు ప్రధానంగా సిమ్‌బేస్డ్ కనెక్టివిటీ ద్వారా పని చేస్తాయి. కార్ తయారీదారులు ఇందులో ఇ-సిమ్‌ లేదా ఫిజికల్‌ సిమ్‌కార్డును అమర్చుతారు. ఇది సెల్యూలార్ నెట్‌వర్క్ ద్వారా క్లౌడ్‌ సర్వర్‌లతో అనుసంధానించి ఉంటుంది. ఇది కారును ఒక వైఫై హాట్‌స్పాట్‌గా మార్చడమే కాకుండా, రియల్ టైమ‌ నావిగేషన్ రిమోట్‌ కంట్రోల్‌ల ఉంటుంది. అయితే ఈ ఫీచర్లను కంటిన్యూగా వాడాలంటే డేటా ప్లాన్ లేదా సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

భారత్ మార్కెట్‌లో కనెక్టెడ్‌ కార్ల హవా

భారత్‌లో కనెక్టెడ్‌ కార్ల పాపులారిటీ ఊహించని విధంగా పెరుగుతుంది. గత ఏడాది జరిగిన అమ్మకాల్లో 27 నుంచి 37 శాతం మోడల్స్‌లో eసిమ్‌ ఉంది. భారతీయ వినియోగదారులు రిమోట్ కంట్రోల్‌,లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్, జియో ఫెన్సింగ్‌ వంటి ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 

నిజంగా కార్లకు ఇవి అవసరమా? మార్కెట్ మాయాజాలమా?

కనెక్టెడ్ కార్ల విషయంలో ఒక చర్చ నిరంతరం జరుగుతూనే ఉంది. పది కొత్త కార్లలో 9 కార్లు ఇప్పుడు కనెక్టెడ్ కార్లు వస్తున్నాయి. డ్రైవర్ అసిస్ట్‌, రిమోట్‌ మానిటరింగ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను సులభతరం చేస్తున్నాయి. భద్రతను కూడా పెంచుతున్నాయి. ఉదాహరణకు రిమోట్‌ ఇంజిన్ స్టార్ట్ ఫీచర్ ద్వారా స్మార్ట్ ఫోన్ యాప్‌ ఉపయోగించి కారును దూరంగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయవచ్చు. ఎండలు ఎక్కువగా ఉండే మనలాంటి దేంలో కారు దగ్గరకు వెళ్లకముందే యాప్ ద్వారా ఏసీ ఆన్ చేసి లోపల కూల్ చేసుకోవడం అనేది చాలా మందికి లగ్జరీ కంటే కన్వీనియెన్స్‌గా అనిపిస్తుంది. 

అయితే ప్రతి ఫీచర్ అందరికీ అవసరం ఉండకపోవచ్చు. కొంతమంది దీనిని కేవలం కార్ల విక్రయాలు పెంచడానికి కంపెనీలు ఆడే మార్కెటింగ్‌ గిమ్మిక్‌గా భావిస్తారు. రిమోట్‌ ఫీచర్ల వల్ల బ్యాటరీ డ్రెయిన్ అయ్యే  అవకాశం ఉందని అలాగే సెక్యూరిటీ రిస్క్‌లు కూడా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అయినా సరే కనెక్టెడ్‌ కార్లు అనేది భవిష్యత్‌లో ఒక అనివార్యమైన మార్పు. ఇవి మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. భద్రతను పెంచుతాయి. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే వినియోగదారులు కేవలం ఫీచర్లును చూసి మురిసిపోకుండా తమ డేటా ఎలా షేర్ అవుతోందా లేదా అనే విషయాన్ని సెట్టింగ్స్‌ నిరంతరం చెక్ చేసుకోవడం చాలా అవసరం.  

Frequently Asked Questions

కనెక్టెడ్ కార్ అంటే ఏమిటి?

కనెక్టెడ్ కార్ అంటే ఇంటర్నెట్ కు నిరంతరం కనెక్ట్ అయి ఉండే వాహనం. ఇది టెలీమాటిక్స్ టెక్నాలజీపై ఆధారపడి, డేటా షేరింగ్, నావిగేషన్, వినోదం మరియు భద్రతా ఫీచర్లను అందిస్తుంది.

కనెక్టెడ్ కార్లు ఎలా పనిచేస్తాయి?

ఈ వాహనాలు సిమ్-ఆధారిత కనెక్టివిటీ ద్వారా పనిచేస్తాయి, ఇ-సిమ్ లేదా ఫిజికల్ సిమ్ కార్డును కలిగి ఉంటాయి. ఇది సెల్యులార్ నెట్వర్క్ ద్వారా క్లౌడ్ సర్వర్లతో అనుసంధానించబడి, కారును వైఫై హాట్ స్పాట్ గా మారుస్తుంది.

భారతదేశంలో కనెక్టెడ్ కార్ల ప్రాచుర్యం ఎలా ఉంది?

భారతదేశంలో కనెక్టెడ్ కార్ల ప్రాచుర్యం అనూహ్యంగా పెరుగుతోంది. గత ఏడాది అమ్మకాలలో 27-37% మోడళ్లలో ఇ-సిమ్ ఉంది, వినియోగదారులు రిమోట్ కంట్రోల్, లైవ్ ట్రాఫిక్ అప్డేట్స్ వంటి ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

కనెక్టెడ్ కార్లలోని ఫీచర్లు డ్రైవింగ్ ను ఎలా మెరుగుపరుస్తాయి?

డ్రైవర్ అసిస్ట్, రిమోట్ మానిటరింగ్, ట్రాఫిక్ అప్డేట్స్ వంటి ఫీచర్లు డ్రైవింగ్ ను సులభతరం చేస్తాయి మరియు భద్రతను పెంచుతాయి. ఉదాహరణకు, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ ద్వారా స్మార్ట్ ఫోన్ యాప్ ఉపయోగించి కారును స్టార్ట్ చేయవచ్చు.

కనెక్టెడ్ కార్ల వల్ల కలిగే భద్రతాపరమైన ఆందోళనలు ఏమిటి?

కొంతమంది నిపుణులు రిమోట్ ఫీచర్ల వల్ల బ్యాటరీ డ్రెయిన్ అయ్యే అవకాశం ఉందని మరియు భద్రతాపరమైన ప్రమాదాలు కూడా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు తమ డేటా షేరింగ్ సెట్టింగ్స్ ను నిరంతరం తనిఖీ చేసుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

Emraan Hashmi Car Collection: లగ్జరీ కారు కొన్న ఇమ్రాన్ హాష్మీ.. SUV ధర, ఫీచర్లు.. నటుడి కార్ కలెక్షన్ వివరాలు
లగ్జరీ కారు కొన్న ఇమ్రాన్ హాష్మీ.. SUV ధర, ఫీచర్లు.. నటుడి కార్ కలెక్షన్ వివరాలు
CNG పంప్ వద్ద పేలిన కారు సిలిండర్.. ప్రమాదాల బారిన పడకుండా ఈ విషయాలు తెలుసుకోండి
CNG పంప్ వద్ద పేలిన కారు సిలిండర్.. ప్రమాదాల బారిన పడకుండా ఈ విషయాలు తెలుసుకోండి
అద్భుతమైన స్పేస్, బెస్ట్ ఫీచర్లు ఉన్న Kia Sorento Hybrid SUV.. హైదరాబాద్‌లో ధరెంతో తెలుసా
అద్భుతమైన స్పేస్, బెస్ట్ ఫీచర్లు ఉన్న Kia Sorento Hybrid SUV.. హైదరాబాద్‌లో ధరెంతో తెలుసా
Long Range Car: ఏకంగా 1770 కి.మీ. లాంగ్ రేంజ్‌తో మార్కెట్లోకి వస్తున్న SUV.. 3.95 సెకన్లలో 100 కి.మీ వేగం
ఏకంగా 1770 కి.మీ. లాంగ్ రేంజ్‌తో మార్కెట్లోకి వస్తున్న SUV.. 3.95 సెకన్లలో 100 కి.మీ వేగం

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Rohit Century Quest:  రోహిత్ మ‌రిన్ని సెంచ‌రీలు సాధించాలని గావ‌స్క‌ర్ కోరిక‌.. చాలా బాధ్య‌త‌యుతంగా ఆడుతున్నాడని కితాబు, హిట్ మ్యాన్ సరికొత్త బ్యాటింగ్ టెంప్లేట్‌పై విశ్లేషణ
రోహిత్ మ‌రిన్ని సెంచ‌రీలు సాధించాలని గావ‌స్క‌ర్ కోరిక‌.. చాలా బాధ్య‌త‌యుతంగా ఆడుతున్నాడని కితాబు, హిట్ మ్యాన్ సరికొత్త బ్యాటింగ్ టెంప్లేట్‌పై విశ్లేషణ
Hyderabad Viral Video: ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
KBR Park Steel Bridges Project: కేబీఆర్‌ పార్కు స్టీల్‌ బ్రిడ్జీల ప్రాజెక్టు రద్దు.. పంజాగుట్ట- జూబ్లీ చెక్‌పోస్టు ఎలివేటెడ్‌ కారిడార్‌కు ఆమోదం
కేబీఆర్‌ పార్కు స్టీల్‌ బ్రిడ్జీల ప్రాజెక్టు రద్దు.. కొత్త ఎలివేటెడ్‌ కారిడార్‌‌కు ఆమోదం
Somnath Swabhiman Parv Special Train: విజయవాడ నుంచి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ప్రత్యేక రైలు యాత్ర ప్రారంభం, ఏపీ నుంచి 1060 మంది భక్తులు
విజయవాడ నుంచి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ప్రత్యేక రైలు యాత్ర ప్రారంభం, ఏపీ నుంచి 1060 మంది
Emraan Hashmi Car Collection: లగ్జరీ కారు కొన్న ఇమ్రాన్ హాష్మీ.. SUV ధర, ఫీచర్లు.. నటుడి కార్ కలెక్షన్ వివరాలు
లగ్జరీ కారు కొన్న ఇమ్రాన్ హాష్మీ.. SUV ధర, ఫీచర్లు.. నటుడి కార్ కలెక్షన్ వివరాలు
Telangana Woman Dies: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
Embed widget