అన్వేషించండి

Cheapest Automatic Car: దేశంలో అత్యంత చవకైన ఆటోమేటిక్ కారు ఏది? టాప్ 3 కార్ల ధర, ఫీచర్లు ఇవే

India Most Cheapest Automatic Car : సాధారణంగా ఏదైనా వస్తువు లేదా సర్వీసు తీసుకున్నా తక్కువ ధరలో బెస్ట్ ఉండేవి చూస్తాం. అయితే మీరు చవకైన ఆటోమేటిక్ కార్ కొనాలనుకుంటే ఈ వివరాలు తెలుసుకోండి.

 Automatic Cars Price |  భారత మార్కెట్లో కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అయితే తక్కువ ధరలో చిన్న ఫ్యామిలీ జర్నీ చేసేలా బడ్జెట్ ధరలో దొరికే కార్ల కోసం ఎక్కువగా చెక్ చేస్తుంటారు. కార్లు లాంటివి కొనాలంటే మనం బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. భారత మార్కెట్లో ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని కంపెనీలు చెబుతున్నాయి. అందుకు అనుగుణంగానే భారత మార్కెట్లో అనేక బడ్జెట్ ఆటోమేటిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మారుతి ఎస్-ప్రెస్సో (Maruti S Presso), మారుతి ఆల్టో కె10, టాటా పంచ్ (Tata Punch) అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ కార్లు మైలేజ్, ఫీచర్లు, ధర పరంగా విక్రయాల్లో దూసుకెళ్తున్నాయి. తక్కువ ధరలో లభించే ఆటోమెటిక్ కార్ల వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. 

మారుతి ఎస్-ప్రెస్సో (Maruti S Presso)
భారతదేశంలో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న ఆటోమేటిక్ కారు మారుతి ఎస్-ప్రెస్సో. దీని AGS (AMT) వేరియంట్ కేవలం ₹4.75 లక్షలకు లభిస్తుంది. ఈ కారు 68 bhp పవర్, 91.1 Nm టార్క్ ఉత్పత్తి చేసే 998cc పెట్రోల్ ఇంజిన్‌తో వర్క్ చేస్తుంది. ఇది 25.3 kmpl ARAI మైలేజీని ఇస్తుందని మారుతి ప్రతినిధులు చెబుతున్నారు. దాంతోపాటు ఈ కారు చాలా పొదుపుగా ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే 7 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ABS, EBD, ESP, హిల్-హోల్డ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

మారుతి ఆల్టో K10
AMT తో మారుతి ఆల్టో K10 ని కొనుగోలు చేయడం వలన మీకు ₹5.71 లక్షల నుండి ₹6 లక్షల వరకు కారు వేరియంట్లు లభిస్తాయి. 998cc, 3 సిలిండర్ ఇంజిన్ 65.7 bhp, 89 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 24.9 kmpl వరకు ఉంటుంది. ఇది చాలా మేరకు ఫ్యూయల్ సేవ్ చేస్తుంది. ఫ్రంట్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC, టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్త అప్‌డేట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి, ఇవి మీ భద్రతను మెరుగుపరుస్తాయి. ఆల్టో K10 కాంపాక్ట్ సైజ్ కారణంగా ఇరుకైన నగర వీధుల్లో డ్రైవింగ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. 

టాటా పంచ్ (Tata Punch)
టాటా పంచ్ 3 కార్లలో అత్యంత దృఢమైనది, ఫీచర్ రిచ్‌గా ఉంటుంది. దీని ఆటోమేటిక్ వేరియంట్ ₹7.11 లక్షలకు ప్రారంభమవుతుంది. టాటా పంచ్ 1199cc రెవోట్రాన్ ఇంజిన్‌తో వర్క్ చేస్తుంది. ఇది 86 bhp, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 18.8 నుండి 20.09 kmpl వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.

7 అంగుళాల టచ్‌స్క్రీన్, హర్మాన్ సౌండ్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, 360° కెమెరా కూడా ఉన్నాయి. భద్రత పరంగా, పంచ్ గ్లోబల్ NCAP నుండి 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఇది భారత మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో అత్యధికంగా కొంటున్న Top 5 Sedan Cars.. ఇందులో మీ కారు ఉందా
భారత్‌లో అత్యధికంగా కొంటున్న Top 5 Sedan Cars.. ఇందులో మీ కారు ఉందా
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Hero Xtreme 250R Standard - Carbon మధ్య తేడాలివే! కేవలం రూ.14,000 ఖర్చుకు దక్కే అదనపు ఫీచర్లు ఏంటి?
Hero Xtreme 250R లో కొత్త వేరియంట్‌.. ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget