అన్వేషించండి

Electric cars In India: భారత్‌ మార్కెట్లోకి టాటా సియెర్రా EV సహా 4 కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. మీకు ఏది బెస్ట్ తెలుసుకోండి

Four new Electric cars | మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తుంటే, త్వరలో భారత మార్కెట్లోకి రాబోయే EVల గురించి తెలుసుకోండి. ఫీచర్లు, రేంజ్ చేసి మీకు ఏది మంచిదో నిర్ణయించుకోండి.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలకు చెక్ పెట్టేందుకు, పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు చూస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు కొత్త EV మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది టాటా సియెర్రా EV తో పాటు, మొత్తం నాలుగు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు భారత మార్కెట్లోకి రానున్నాయా. ముఖ్యంగా మారుతి సుజుకి, టయోటా తమ మొదటి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుండటం మార్కెట్ వర్గాలను ఆకర్షిస్తోంది. టాటా మోటార్స్ దాని పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తుంది. ఈ వాహనాల రేంజ్, ఫీచర్లు, డిజైన్ పరంగా ఎలా ఉన్నాయో వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

మారుతి సుజుకి ఈ విటారా (Maruti Suzuki e Vitara )
మారుతి సుజుకి ఇ విటారా భారత్‌లో కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ SUV అవుతుంది. ఇది 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానుందని  భావిస్తున్నారు. ఈ కారు రెండు బ్యాటరీ 49 kWh, 61 kWh ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. పెద్ద బ్యాటరీతో ఈ EV ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ కారు దాదాపు 172 bhp శక్తిని జనరేట్ చేస్తుంది. డెల్టా, జీటా, ఆల్ఫా అనే మూడు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ కారు కోసం చాలా కాలం నుంచి మార్కెట్లో ఎదురుచూస్తున్నారు.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella)
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా మారుతి ఇ విటారా ఆధారంగా రూపొందించబడింది, అయితే దీని డిజైన్ పదునుగా మరియు మరింత ప్రీమియంగా ఉంటుంది. ఇది 48.8 kWh మరియు 61.1 kWh బ్యాటరీలతో కూడా అమర్చబడి ఉంటుంది, ఇది గరిష్టంగా 543 కిలోమీటర్ల పరిధిని అందించగలదు. ఇది టయోటా యొక్క మొదటి ఎలక్ట్రిక్ కారు అవుతుంది, ఇది కంపెనీ EV విభాగంలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది.

టాటా సియెర్రా EV (Tata Sierra EV), టియాగో EV ఫేస్‌లిఫ్ట్ (Tiago EV Facelift) 
టాటా తన ఐకానిక్ సియెర్రాను ఎలక్ట్రిక్ అవతార్‌లో భారత మార్కెట్లోకి తిరిగి తీసుకువస్తోంది. టాటా సియెర్రా EV AWD ఎంపికలను, 55 లేదా 65 kWh బ్యాటరీతో అందించవచ్చు. ఈ కారు సుమారు 500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. టాటా టియాగో EV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా 2026లోనే త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఇందులో కొత్త లుక్, డిజిటల్ డాష్‌బోర్డ్ ఉంటుంది. అయితే బ్యాటరీ, రేంజ్ అలాగే ఉంటాయని కంపెనీ తెలిపింది.

టాటా అవిన్యా స్పోర్ట్‌బ్యాక్ (Tata Avinya Sportback)
టాటా అవిన్యా స్పోర్ట్‌బ్యాక్ కంపెనీ నుంచి అత్యంత హై-టెక్, ప్రీమియం ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ఈ కారు 2026 చివరి నాటికి ప్రారంభించనున్నారు. త్వరగా టెస్టింగ్ కనుక పూర్తయితే కొన్ని నెలల్లో అవిన్యా స్పోర్ట్ బ్యాక్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది.  600 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ కలిగి ఉంటుందని వాహనదారులు భావిస్తున్నారు. కంపెనీ మాత్రం ఈ కారు గురించి ఎక్కువ వివరాలు అందుబాటులో ఉంచలేదు. టెస్టింగ్ పూర్తయ్యాక వివరాలు లీకయ్యే అవకాశం ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!
Vibration-Free Bikes: లాంగ్ రైడ్స్‌కు బెస్ట్ బైక్స్‌.. అతి తక్కువ వైబ్రేషన్లు ఇచ్చే స్మూత్ ఇంజిన్, మంచి కంఫర్ట్ ఇచ్చే 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హైవేపై గంటల తరబడి ప్రయాణించినా వైబ్రేషన్లు, అలసట తక్కువే.. 300cc విభాగంలో బెస్ట్ 5 బైక్స్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
Embed widget