అన్వేషించండి

Car Cleaning Tips: కారు క్లీనింగ్‌లో ఈ తప్పులు చేస్తే భారీ నష్టం - పెయింట్‌, ఇంటీరియర్‌ పాడవుతాయ్!

కారును శుభ్రం చేసే సమయంలో చేసే చిన్న తప్పులు పెయింట్‌, ఇంటీరియర్‌, ఎలక్ట్రానిక్‌ భాగాలకు నష్టం కలిగిస్తాయి. సరైన క్లీనింగ్‌ టిప్స్‌, చేయాల్సినవి-చేయకూడనివి తెలుసుకోండి.

Car Cleaning Tips: కారును శుభ్రంగా ఉంచడం అనేది కేవలం అందం కోసమే కాదు. వాహనం పనితీరు, పెయింట్‌ నాణ్యత, ఇంటీరియర్‌ జీవితకాలం పెరగడానికి కూడా ఇది ఎంతో కీలకం. చాలా మంది కారును తరచూ కడిగినా, సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల తెలియకుండానే వాహనానికి నష్టం కలిగిస్తుంటారు. ముఖ్యంగా తప్పు క్లీనింగ్‌ టూల్స్‌, హార్ష్‌ కెమికల్స్‌ వాడటం వల్ల పెయింట్‌, ప్లాస్టిక్‌ భాగాలు, టచ్‌స్క్రీన్‌లు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

మీ ఇష్టం వచ్చిన క్లీనింగ్‌ క్లాత్‌లు వాడొద్దు

చాలామంది పాత బట్టలు, గుడ్డలు లేదా సాధారణ టవల్స్‌తో కారును తుడుస్తుంటారు. అయితే ఇవి పెయింట్‌పై సూక్ష్మ గీతలు (మైక్రో స్క్రాచ్‌లు) పడేలా చేస్తాయి. అలాగే చక్రాలను శుభ్రం చేసిన మైక్రోఫైబర్‌ క్లాత్‌ను బాడీపై మళ్లీ ఉపయోగించకూడదు. ఎందుకంటే అందులో ఉండే దుమ్ము, ఇసుక కణాలు పెయింట్‌ను దెబ్బతీస్తాయి.

ప్రతి భాగానికి ప్రత్యేక టూల్స్‌ ఉపయోగించాలి

కారు బాడీ, గ్లాస్‌, వీల్స్‌, ఇంటీరియర్‌ భాగాలకు వేర్వేరు క్లీనింగ్‌ టూల్స్‌ వాడటం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ఒక భాగంలోని మురికి మరో భాగానికి చేరకుండా ఉంటుంది. దీంతో కారును మరింత సమర్థవంతంగా శుభ్రం చేయవచ్చు.

ఇంటి డిటర్జెంట్లు ఉపయోగించడం ప్రమాదకరం

కారు కడగడానికి డిష్‌వాష్‌ లిక్విడ్‌, బాత్‌రూమ్‌ క్లీనర్లు లేదా ఇతర గృహ వినియోగ డిటర్జెంట్లు వాడకూడదు. ఇవి పెయింట్‌పై ఉండే రక్షణ పొరను దెబ్బతీస్తాయి. అలాగే ప్లాస్టిక్‌, రబ్బరు భాగాలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా కార్ల కోసం తయారైన కార్‌ షాంపూలనే ఉపయోగించాలి.

ఎండలో కారు కడగడం మంచిది కాదు

నేరుగా ఎండలో కారును కడిగితే నీటి బిందువులు త్వరగా ఆవిరై మచ్చలు ఏర్పడతాయి. దీంతో మళ్లీ శుభ్రం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ప్రెజర్‌ వాషర్‌ను చాలా దగ్గరగా ఉపయోగిస్తే పెయింట్‌, సెన్సర్లు, రబ్బరు సీల్స్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది.

సరైన విధంగా కడగడం ఎలా?

మొదట కారుపై ఉన్న దుమ్మును నీటితో తొలగించాలి. అనంతరం ‘టూ బకెట్‌ మెథడ్‌’ పాటించడం ఉత్తమం. ఒక బకెట్‌లో శుభ్రమైన నీరు, మరో బకెట్‌లో షాంపూ మిశ్రమం ఉంచాలి. కారు పైభాగం నుంచి కిందికి కడగాలి. ఇలా చేయడం వల్ల దిగువ భాగంలోని మురికి మళ్లీ పైభాగానికి చేరదు.

పక్షుల విసర్జనలను నిర్లక్ష్యం చేయొద్దు

కారుపై పడిన పక్షుల విసర్జనలు, పురుగుల అవశేషాలు లేదా చెట్ల నుంచి పడిన పదార్థాలను వెంటనే తొలగించాలి. వీటిలో ఉండే యూరిక్‌ యాసిడ్‌, ఇతర రసాయనాలు పెయింట్‌ను శాశ్వతంగా దెబ్బతీయగలవు.

టచ్‌స్క్రీన్‌లపై నేరుగా స్ప్రే చేయవద్దు

ఆధునిక కార్లలో డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్లు, టచ్‌స్క్రీన్‌లు ఎక్కువగా ఉంటాయి. వీటిపై నేరుగా క్లీనింగ్‌ లిక్విడ్‌ స్ప్రే చేయడం వల్ల ఎలక్ట్రానిక్‌ భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముందుగా మైక్రోఫైబర్‌ క్లాత్‌పై క్లీనర్‌ వేసి, తర్వాత స్క్రీన్‌ను శుభ్రం చేయాలి.

కనిపించని ప్రాంతాలను కూడా శుభ్రం చేయాలి

డోర్‌ హింజ్‌లు, డోర్‌ సిల్స్‌, ఫ్యూయల్‌ ఫిల్లర్‌ ప్రాంతం, వీల్‌ ఆర్చ్‌లు, మడ్‌ఫ్లాప్స్‌, బంపర్ల వెనుక భాగాల్లో మురికి ఎక్కువగా పేరుకుపోతుంది. వీటిని తరచూ శుభ్రం చేయకపోతే తుప్పు, దుర్వాసన, పదార్థాల క్షీణత వంటి సమస్యలు తలెత్తుతాయి.

కారు క్లీనింగ్‌ అనేది కేవలం నీళ్లు పోసి కడగడం మాత్రమే కాదు. సరైన టూల్స్‌, సరైన కెమికల్స్‌, సరైన పద్ధతులు ఉపయోగిస్తేనే వాహనం ఎక్కువకాలం కొత్తదానిలా కనిపిస్తుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా పెయింట్‌, ఇంటీరియర్‌, ఎలక్ట్రానిక్‌ భాగాలను రక్షించడంతో పాటు కార్‌ విలువను కూడా నిలబెట్టుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget