అన్వేషించండి

Bike Tuning Tips At Home:ఇంట్లోనే బైక్ సర్వీసింగ్!మెకానిక్ షాప్‌కు వెళ్లకుండా వేల రూపాయలు ఆదా చేసే చిట్కాలు!

Bike Tuning Tips At Home:మెకానిక్‌ అవసరం లేకుండా ఇంట్లోనే మీ బైక్‌ను ట్యూన్ చేసుకోవడం ద్వారా సర్వీసింగ్‌ ఖర్చులను 70 శాతం వరకు తగ్గించుకోవచ్చు. మైలేజ్‌, పర్ఫార్మెన్స్‌ పెంచే 5 చిట్కాలు ఇవే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్వయంగా బైక్ మెయింటెనెన్స్ ద్వారా ఖర్చులు తగ్గించుకోవచ్చు, జీవితకాలం పెరుగుతుంది.
  • స్పార్క్ ప్లగ్, ఎయిర్ ఫిల్టర్, చైన్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
  • ఇంజిన్ ఆయిల్, టైర్ ప్రెజర్, ఇతర కేబుల్స్ తనిఖీ ముఖ్యం.

Bike Tuning Tips At Home:ప్రతిసారీ మీబైక్‌ చిన్నగా మొరాయించినా లేదా మైలేజ్ తగ్గినట్టు అనిపించినా మెకానిక్‌ షాప్‌కు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. నేటి కాలంలో పెరుగుతున్న సర్వీసింగ్ ఛార్జీల, నుంచి తప్పించుకోవడానికి DIY బైక్‌ మెయింటెనెన్స్‌ ఒక అద్భుతమైన మర్గంగా మారుతోంది. ప్రతి రెండు లేదా 3 నెలలకు ఒకసారి షోరూమ్‌కు వెళ్లి వేల రూపాయలు బిల్లులు కట్టే బదులు మీరే స్వయంగా కొన్ని చిట్కాలు పాటించవచ్చు. ఇంట్లోనే మీ బైక్‌ పర్ఫార్మెన్స్‌, మైలేజీ పెంచుకోవడానికి అవసరమైన పూర్తి గైడ్ ఇక్కడ ఉంది. 

సర్వీస్‌ సెంటర్‌లో లేబర్ ఛార్జీలు, అనవసరమైన విడిభాగాల మార్పుల వల్ల మీ జేబుకు చిల్లుపడుతుంది. మీ వాహనంపై మీకు పూర్తి అవగాహన ఉండటం వల్ల, భవిష్యత్‌లో వచ్చే పెద్ద సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. సరైన సమయంలో చిన్న చిన్న ట్యూనింగ్‌ పనులు చేయడం వల్ల బైక్ ఇంజిన్ లైఫ్ 5 నుంచి పదేళ్లు అదనంగా పెరుగుతుంది.

ఎప్పుడు ట్యూనింగ్ చేయాలి?

ప్రతి ఐదు వందల కిలోమీటర్లకు ఒకసారి క్లీనింగ్, లూబ్రికేషన్ చేయడం తప్పనిసరి. స్పార్క్‌ ప్లగ్, ఎయిప్‌ఫిల్టర్‌లను ప్రతి 2000 నుంచి 3000 కిలోమీటర్ల వరకు ఒకసారి చెక్ చేయాలి. ఇంజిన్ ఆయిల్ మార్పు సాధారణంగా ప్రతి 2500కిలోమీటర్ల నుంచి 3000కిలోమీటర్లకు ఒకసారి చేయాలని నిపుణులు చెబుతుంటారు. 

స్పార్క్‌ ప్లగ్ మెయింటెనెన్స్‌ ఎలా చేయాలి?

బైక్ స్టార్టింగ్ సమస్యలు, పిక్‌ తగ్గడానికి ప్రధాన కారణం స్పార్క్‌ ప్లగ్‌పై కార్బొన్ పేరుకుపోవడమే. ప్లగ్ స్పానర్‌తో దానిని బయటకు తీసి సాండ్‌పేపర్ లేదా పాత టూత్‌బ్రష్‌, పెట్రోల్‌తో క్లీన్ చేయాలి. రెండు ఎలక్ట్రోడ్ల మధ్య గ్యాప్‌0.6-0.7mm ఉండేలా చూసుకోవడం వల్ల సింగిల్‌ కిక్‌లోనే బైక్ స్టార్ట్ అవుతుంది. 

ఎయిర్‌ ఫిల్టర్‌ క్లీనింగ్ ఎలా?

బైక్ ఇంజిన్‌కు గాలి సరిగా అందకపోతే పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది మైలేజీపై ప్రభావం చూపుతుంది. ఫోమ్ ఫిల్టర్ అయితే సోప్‌ వాటర్‌తో కడిగి ఆరబెట్టాలి. పేపర్‌ ఫిల్టర్ అయితే ఎయిర్‌ప్రెజర్‌తో దుమ్ము దులపాలి. ఇది ఇంజిన్‌లోకి స్వచ్ఛమైన గాలిని పంపి, బైక్ స్మూత్‌గా వెళ్లేలా చేస్తుంది. 

చైన్ లూబ్రికేషన్ ఎలా చేయాలి?

చైన్ లూజ్‌ అయిన లేదా డ్రైగా మారినా ఇంజిన్‌పై లోడ్ పడి చైన్ తెగిపోయే ప్రమాదం ఉంది. చైన్ 20-30mm ప్లే ఉండేలా అడ్జెస్ట్ చేసి, క్రమం తప్పకుండా చైన్ లూబ్ లేదా ఇంజిన్ ఆయిల్ అప్లై చేయాలి. ముఖ్యంగా వర్షంలో బైక్ నడిపిన తర్వాత చైన్ లూబ్రికేషన్ చేయడం చాలా ముఖ్యం. 

టైర్‌ ప్రెజ్‌, ఆయిల్‌ చెక్

వారానికి ఒకసారి టైర్ ప్రెజర్‌ చెక్ చేయడం వల్ల మైలేజ్ తగ్గకుండా ఉంటుంది. టైర్లు త్వరగా అరిగిపోవు ఇంజిన్ ఆయిల్ లెవెల్‌ను డిప్‌స్టిక్ ద్వారా తరచుగా చెక్ చేస్తూ ఉండాలి. ఆయిల్ నల్లగా మారితే వెంటనే మార్చాలి. ఆయిల్ లెవెల్‌ ఎప్పుడూ మాక్సిమమ్‌ మార్క్ వద్ద ఉండేలా జాగ్రత్త పడాలి. 

ఐడిల్‌స్పీడ్

ట్రాఫిక్‌లో బైక్ పదే పదే ఆఫ్ అవుతుంటే, కార్బ్యురేటర్ వద్ద ఉండే ఆర్‌పీఎం స్క్రూను స్వల్పంగా అడ్జస్ట్ చేయాలి. బ్రేక్స్, క్లచ్‌, థ్రాటిల్‌కేబుల్స్ టైట్‌గా ఉన్నాయో లేదో చూసుకొని అవసరమైతే ఆయిలింగ్ చేయాలి. బ్యాటరీ టెర్మినల్స్ క్లీన్ చేయం, లైట్లు, హార్న్‌ పని తీరును కూడా నెలకోసారి చెక్ చేయాలి. హీరోస్ప్లెండర్‌ నుంచి బజాజ్‌, టీవీఎస్‌ వరకు అన్ని రకాల సాధారణ బైక్‌లకు ఈ టిప్స్‌ యూజ్ అవుతాయి. 

Frequently Asked Questions

DIY బైక్ మెయింటెనెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఇది సర్వీసింగ్ ఖర్చులు తగ్గిస్తుంది, వాహనంపై మీకు పూర్తి అవగాహన పెంచుతుంది. సరైన ట్యూనింగ్ వల్ల బైక్ ఇంజిన్ లైఫ్ 5-10 సంవత్సరాలు అదనంగా పెరుగుతుంది.

బైక్ నిర్వహణ పనులు ఎంత తరచుగా చేయాలి?

ప్రతి 500 కి.మీ.కు క్లీనింగ్, లూబ్రికేషన్ చేయాలి. స్పార్క్ ప్లగ్, ఎయిర్ ఫిల్టర్‌ను 2000-3000 కి.మీ.కు ఒకసారి తనిఖీ చేయాలి. ఇంజిన్ ఆయిల్ 2500-3000 కి.మీ.కు మార్చాలి.

ఎయిర్ ఫిల్టర్ శుభ్రత బైక్ మైలేజీపై ఎలా ప్రభావం చూపుతుంది?

ఇంజిన్‌కు గాలి సరిగా అందకపోతే పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, మైలేజీ తగ్గుతుంది. ఫోమ్ ఫిల్టర్‌ను సోప్‌వాటర్‌తో, పేపర్ ఫిల్టర్‌ను ఎయిర్‌ప్రెజర్‌తో శుభ్రం చేయాలి.

టైర్ ప్రెజర్‌ను తరచుగా తనిఖీ చేయడం ఎందుకు ముఖ్యం?

వారానికి ఒకసారి టైర్ ప్రెజర్‌ను తనిఖీ చేయడం వల్ల మైలేజ్ తగ్గకుండా ఉంటుంది. ఇది టైర్లు త్వరగా అరిగిపోకుండా కూడా సహాయపడుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 765 RS vs డుకాటి మాన్‌స్టర్‌ V2 - రేటు రూ.1 లక్ష తక్కువైనా 'పవర్‌'లో అదరగొడుతోంది!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget