అన్వేషించండి

Monsoon Bike Safety Tips: వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!

Monsoon Bike Safety Tips: వర్షకాలంలో తడి రోడ్లపై బైక్ స్కిడ్ అవ్వకుండా ఉండాలంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? మీ ప్రాణాలను కాపాడే కీలకమైన టైర్ ప్రెజర్ టిప్స్, రైడింగ్‌ జాగ్రత్తలు ఈ స్టోరీలో చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వర్షంలో బైక్ టైర్లలో గాలి 1-2 PSI తగ్గించాలి.
  • అరిగిపోయిన టైర్లు మార్చి, సురక్షిత బ్రేకింగ్ విధానం వాడాలి.
  • అధిక వేగం తగ్గించి, రోడ్డు ప్రమాదకర వస్తువులను గుర్తించండి.

Monsoon Bike Safety Tips: జూన్ నెల వచ్చిందంటే చాలు, భానుడి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తూ వర్షాలు పలకరిస్తాయి. ప్రకృతిపరంగా ఇది ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, టూ-వీలర్‌ నడిపేవారికి మాత్రం ఇది పరీక్షా కాలం. వర్షాకాలంలో బైకర్లు ఎదుర్కొనే అత్యంత భయంకరమైన సమస్య స్కిడ్డింగ్. రోడ్లపై నీరు చేరడం, వాహనాలు నుంచి లీకైన ఆయిల్ వర్షపు నీటితో కలవడం వల్ల తారు రోడ్లు అద్దంలా మారిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బైక్ టైర్లకు, రోడ్లకు మధ్య ఉండాల్సిన గ్రిప్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కేవలం టైర్లలో ఉండే గాలి మార్చడం ద్వారా ఈ ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు.  

టైర్‌ ప్రెజర్‌ నియమం-1-2 PSI సూత్రం ఎందుకు పాటించాలి?

సాధారణంగా మనం వేసవి కాలంలో టైర్లలో గాలిని కొంత తక్కువగా ఉంచుతాం, కానీ వర్షాకాలంలో వచ్చే సరికి నియమాలు పూర్తిగా మారుతాయి. వర్షాకాలంలో మీ బైక్ టైర్లలో గాలి ఎప్పుడూ కంపెనీ సూచించిన సాధారణ బ్రెజర్‌ కంటే 1 నుంచి 2 PSI తక్కువగా ఉండాలి. 

టైర్‌లో గాలి తక్కువగా ఉన్నప్పుడు, టైర్ రోడ్డుపై కొద్దిగా వెడల్పుగా వెళ్తుంది. దీనిని టెక్నికల్‌ భాషలో కాంటాక్ట్‌ ప్యాచ్ అంటారు. గాలి తక్కువగా ఉండటం వల్ల టైర్ ఎక్కువ భాగం రోడ్డును తాకుతుంది. ఇది తడి రోడ్లపై బైక్‌కు అదనపు పట్టును అందిస్తుంది. ఒక వేళ మీరు టైర్‌లో ఎక్కువ గాలిని నింపితే టైర్ మధ్య భాగం మాత్రమే రోడ్డుకు ఆనుతుంది. దీని వల్ల బ్రేక్‌ వేయగానే బైక్ వేగంగా స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. 

సాధారణంగా 25-28 PSI ఉంటుంది. వర్షంలో దీనిని 26PSIకి పరిమితం చేయడం ఉత్తమం. సాధారణంగా 32-36 PSI ఉంటుంది. వర్షకాలంలో దీనిని 32 లేదా 33 PSIకి తగ్గించి ఉంచడం వల్ల రోడ్డుపై పట్టు లభిస్తుంది. 

టైర్ గ్రిప్, థ్రెడ్‌ డెప్త్‌

కేవలం గాలి మాత్రమే కాదు, టైర్ కండిషన్ కూడా ముఖ్యం. మీ బైక్ టైర్లు అరిగిపోయి గుండుగా మారాయా అయితే వెంటనే జాగ్రత్త పడాలి. టైర్లపై ఉండే గీతలు లేదా థ్రెడ్స్‌ కేవలం డిజైన్ కోసం కాదు, అవి రోడ్డుపై ఉన్న నీటిని పక్కకు నెట్టివేసి, టైర్‌ నేరుగా రోడ్డును తాకేలా చేస్తాయి. టైర్‌ థ్రెడ్‌ డెప్త్‌ కనీసం 1.5mm నుంచి 2mm ఉండేలా చూసుకోండి. అంతకంటే తక్కువ ఉంటే ఆ టైరు వర్షంలో ప్రయాణానికి సురక్షితం కావు. అరిగిపోయిన టైర్లను వెంటనే మార్చుకోవడం మంచిది. 

బ్రేకింగ్‌ టెక్నిక్‌ 

తడి రోడ్లపై సడెన్ బ్రేకింగ్‌ వేయడం అంటే ప్రమాదాన్ని ఆహ్వానించడమే. ఎప్పుడూ ముందు, వెనుక బ్రేకులను ఒకేసారి వేయాలి. మీ బైక్‌లో ఏబీఎస్‌ లేకపోతే, బ్రేక్‌ను ఒకేసారి గట్టిగా నొక్కకుండా, మెల్లిమెల్లిగా నొక్కుతూ వదులుతూ బ్రేక్స్ వేయాలి. దీని వల్ల టైర్లు లాక్ అవ్వకుండా బైక్ అదుపులో ఉంటుంది.  యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ ఉన్న బైక్‌లలో స్కిడ్‌ అయ్యే ప్రమాదం చాలా తక్కువ. 

వర్షంలో రోడ్డుపై కనిపించే కొన్ని భాగాలు పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. రోడ్లపై వేసే తెల్లటి, పసుపు రంగు పెయింట్ లైన్లు వర్షపు నీరు పడగానే సోపు నీళ్లలా జారుతాయి. వాటిపై బ్రేక్‌ వేయడం లేదా బైక్ టర్న్ చేయడం ప్రమాదకరం. ఇనుప మ్యాన్‌హోల్‌ మూతలు వర్షంలో అత్యంత ప్రమాదకరంగా మారుతాయి. వాటిపై నుంచి వెళ్లేటప్పుడు బైక్ స్ట్రెయిట్‌గా ఉండేలా చూసుకోవాలి. 

ఆక్వాప్లానింగ్ అంటే ఏంటీ?

వర్షంలో బైక్ నడిపేటప్పుడు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదు. వేగం పెరిగే కొద్దీ టైర్ రోడ్‌పై ఆనకుండా నీటి పొరపై తేలుతూ వెళ్తుంది. దీనినే ఆక్వాప్లానింగ్ అంటారు. ఈ స్థితిలో బైక్‌పై మీకు ఎలాంటి కంట్రోల్ ఉండదు. వేగం తక్కువగా ఉంటే ప్రమాదం జరిగినా కంట్రోల్ చేసుకోవడం సులభం అవుతుంది. 

వర్షాకాలంలో బైక్ చెకప్ లిస్ట్‌ 

మీ రైడ్ సురక్షితం చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

టైర్ ప్రెజర్‌‌ కంపెనీ సూచన కంటే 1-2 PSI తక్కువగా ఉంచండి.
బ్రేక్‌ ప్యాడ్స్ వర్షంలో బ్రేక్ లైనర్స్‌ త్వరగా అరుగుతాయి. అరిగిపోతే వెంటనే మార్చండి
చైన్ లూబ్రికేష్ వర్షపు నీటికి చైన్ గ్రీస్‌ పోతుంది. కాబట్టి వరానికి ఒకసారి చైన్ లూబ్ వాడండి. 
లైట్లు, ఇండికేటర్లు   వర్షంలో విజిబిలిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి పక్కాగా పనిచేయాలి. 

వర్షాకాలంలో ప్రయాణమనేది కేవలం రైడింగ్‌ నైపుణ్యంపైనే కాకుండా, బైక్ మెయింటెనెన్స్‌పై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రతివారం డిజిటల్ మీటర్ ఉన్న బంకుల్లో టైర్ ప్రెజర్ చెక్ చేయించుకోవడం, వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవడం వంటి చిన్న జాగ్రత్తలు మీ ప్రాణాలను కాపాడుతాయి.

Frequently Asked Questions

వర్షాకాలంలో బైక్ టైర్లలో ఎంత గాలి ఉండాలి?

వర్షాకాలంలో మీ బైక్ టైర్లలో గాలి కంపెనీ సూచించిన సాధారణ ప్రెజర్‌ కంటే 1 నుంచి 2 PSI తక్కువగా ఉండాలి. ఇది తడి రోడ్లపై బైక్‌కు అదనపు పట్టును అందిస్తుంది.

టైర్లలో గాలి తక్కువగా ఉంచడం వల్ల ప్రయోజనం ఏమిటి?

గాలి తక్కువగా ఉన్నప్పుడు, టైర్ రోడ్డుపై వెడల్పుగా తాకుతుంది, దీనిని కాంటాక్ట్ ప్యాచ్ అంటారు. దీనివల్ల తడి రోడ్లపై బైక్‌కు మెరుగైన పట్టు లభిస్తుంది.

అరిగిపోయిన టైర్లను వర్షాకాలంలో ఉపయోగించవచ్చా?

లేదు, టైర్ల థ్రెడ్ డెప్త్ కనీసం 1.5mm నుంచి 2mm ఉండాలి. అరిగిపోయిన టైర్లకు రోడ్డుపై పట్టు ఉండదు, అవి ప్రమాదాలకు దారితీయవచ్చు.

ఆక్వాప్లానింగ్ అంటే ఏమిటి, అది ఎందుకు ప్రమాదకరం?

బైక్ వేగం పెరిగినప్పుడు టైర్ రోడ్‌పై ఆనకుండా నీటి పొరపై తేలుతూ వెళ్తుంది. దీనినే ఆక్వాప్లానింగ్ అంటారు. ఈ స్థితిలో బైక్‌పై నియంత్రణ ఉండదు.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget