అన్వేషించండి

India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 

India Monsoon Delay 2026:జూన్1న కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల ఇవి ఎప్పుడు వస్తాయో చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని ఆలస్యంగా తాకనున్నాయి.
  • అనుకూల పరిస్థితులు లేకపోవడంతో రుతుపవనాలు మార్గమధ్యంలో స్తంభించాయి.
  • కొన్ని రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశాలున్నాయి.
  • వర్షాలపై ఆధారపడిన వ్యవసాయంపై రుతుపవనాల ఆలస్యం ప్రభావం చూపుతుంది.

India Monsoon Delay 2026:దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. నైరుతి రుతుపవన కాలం.జూన్ 1వ తేదీ వచ్చింది అంటే చాలు, కేరళ తీరాన్ని వర్షాలు పలకరిస్తాయి. తద్వారా దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకుంటాయని అందరూ ఆశిస్తారు. అయితే 2026 సీజన్‌లో నైరుతి రుతుపవనాల రాక కోసం కొంత జాప్యం చోటు చేసుకుంది. ముందుగా అంచనా వేసినట్టుగా జూన్ 1న ఇవి కేరళను తాకలేకపోయాయి. వాతావరణ పరిస్థితుల అనుకూలించకపోవడంతో ఇవి ప్రస్తుతం ఉన్నచోటే స్తబ్ధుగా నిలిచిపోయాయి. 

సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకాల్సిన రుతుపవనాలు, ఈ సారి ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాయి. ప్రస్తుతం ఇవి మార్గమధ్యలో నిలిచిపోయాయని భారత్ వాతావరణ శాఖ, ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌  ధ్రువీకరించాయి. రుతుపవనాల ద్రోణి కదలికలు మందగించడమే దీనికి ప్రధాన కారణం. 


  
రుతుపవనాల రాకకు అవసరమైన అనుకూల పరిస్థితులు ప్రస్తుతం లేవని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఈ జాప్యాన్ని ప్రధాన కారణం ఏంటంటే... అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులే. ఈ రెండు కూడా రుతుపవనాల పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాయి. పశ్చిమ దిశ నుంచి వీచే గాలులు రుతుపవనాలను కేరళ తీరం వైపు నెట్టడంలో సహయపడాలి కానీ ప్రస్తుతం గాలి దిశ, వేగం ఇందుకు అనుకూలంగా లేవు. అయితే ఈ ఆలస్యానికి రాబోయే ఎల్‌నినో ప్రభావానికి ఎలాంటి సంబంధం లేదని స్కైమెట్‌‌ వాతావరణ, వాతావరణ మార్పుల విభాగంలో వైఎస్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ స్పష్టం చేశారు. రుతుపవనాలు కేవలం భారత్‌ పరిసరాల్లోని వాతావరణ వ్యవస్థలపైనే ఆధారపడి కేవలం భారత్ పరిసరాల్లోని వాతావరణ వ్యవస్థపైనే ఆధారపడి ఉంటాయని ఆయన వివరించారు. 

రుతుపవనాల రాకను ఎలా నిర్ణయిస్తారు?

కేరళలోని రుతుపవనాలు ప్రవేశించాయని చెప్పడానికి కొన్ని కచ్చితమైన నియమాలు ఉన్నాయి. అవి పూర్తి  అయితేనే అధికారికంగా రుతుపవనాల రాకను ప్రకటిస్తారు. కేరళ, కర్ణాటక, లక్ష్యద్వీప్‌లోని సుమారు 60 శాతం వాతావరణ కేంద్రాల్లో వరుసగా రెండు రోజులపాటు కనీసం 2.5 మి.మి. వర్షపాతం నమోదు కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిమితి ఇంకా నెరవేరలేదు. అందుకే అధికారిక ప్రకటన వెలువడలేదు. 

నైరుతి రుతుపవనాలు ఎప్పుడు రావచ్చు?

ప్రస్తుతానికి రుతుపవనాలు ఆగిపోయినప్పటికీ , ఆశాజనకమైన వార్త కూడా ఉంది. స్కైమెట్‌ అంచనాల ప్రకారం రాబోయే గురువారం లేదా శుక్రవారం నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. వచ్చే 3-4 రోజుల్లో అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, బంగళాఖాతంలోని మెజారిటీ ప్రాంతాలు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. పరిస్థితిని సమీక్షిస్తున్న ఐఎండీ త్వరలోనే రుతుపవనాల రాకపై సవరించిన తేదీని ప్రకటించే అవకాశం ఉంది. 

ఎక్కువ మంది చదివిన ఈ వార్తలు మిస్ అవ్వొద్దు

1 కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
2 ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
3 రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ
4 ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే
5 ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్

భారత్‌లో రుతుపవనాలకు కేరళ ప్రవేశ ద్వార లాంటిది. ఇక్కడికి రుతుపవనాలు చేరిన తర్వాతే దేశవ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తాయి.  వర్షాలపైనే దేశంలోని సుమారు 70 శాతం సాగు భూమి ఆధారపడి ఉంది. రుతుపవనాలు ఆలస్యమైతే విత్తనాలు వేయడం ఆలస్యమవుతుంది. అది ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రోజుల జాప్యం సర్వసాధారణమేనని, రుతుపవనాలు పుంజుకుంటే ఆ తర్వాత వర్షపాతం సాధారణంగానే ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

Frequently Asked Questions

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతుందా?

అవును, ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల రాకలో కొంత జాప్యం చోటు చేసుకుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అవి మార్గమధ్యంలో నిలిచిపోయాయి.

రుతుపవనాల రాకను అధికారికంగా ఎలా ప్రకటిస్తారు?

కేరళ, కర్ణాటక, లక్ష్యద్వీప్‌లోని 60% వాతావరణ కేంద్రాలలో రెండు రోజులు వరుసగా కనీసం 2.5 మి.మి. వర్షపాతం నమోదైతే అధికారికంగా ప్రకటిస్తారు.

నైరుతి రుతుపవనాలు ఎప్పుడు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది?

స్కైమెట్ అంచనాల ప్రకారం, రాబోయే గురువారం లేదా శుక్రవారం నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది.

రుతుపవనాలు ఆలస్యం అయితే పంటలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

రుతుపవనాలు ఆలస్యమైతే విత్తనాలు వేయడం ఆలస్యమవుతుంది. ఇది ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
ABP Desam Top 10, 17 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 17 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget