అన్వేషించండి

Electric Scooter Battery Life Tips: ఎలక్ట్రిక్ స్కూటర్‌ బ్యాటరీ మెయింటెనెన్స్‌ టిప్స్‌! మీ వాహనం లైఫ్‌ పెంచే గోల్డెన్‌ రూల్స్‌!

Electric Scooter Battery Life Tips: ఎలక్ట్రిక్ వాహనం కొనడంతోనే సరిపోదు, దాని నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలు ఖరీదైనవి, సరైన సంరక్షణ అవసరం.
  • బ్యాటరీని 20-80% మధ్య ఛార్జ్ చేయండి, అధిక వేడిని నివారించండి.
  • వాడిన వెంటనే ఛార్జ్ చేయకండి; అధికారిక ఛార్జర్ వాడండి.
  • చల్లని ప్రదేశంలో ఛార్జ్ చేసి, 50-60% వద్ద నిల్వ చేయండి.

Electric Scooter Battery Life Tips: భారతీయ రహదారులపై నేడు ఎలక్ట్రిక్ స్కూటర్ల సందడి పెరిగింది. ఓలా, ఏథర్‌, టీవీఎస్‌, హీరో విదా వంటి బ్రాండ్లు మార్కెట్‌లో పోటీపడుతున్నాయి. అయితే ఈ వాహనాల్లో ఉండే లిథియం- అయాన్‌ బ్యాటరీలు అత్యంత ఖరీదైనవి, సున్నితమైనవి. వీటిని సరిగా నిర్వహించకపోతే 3-5 ఏళ్లలో రావాల్సిన బ్యాటరీ సామర్థ్యం అంతకంటే ముందే పడిపోయే ప్రమాదం ఉంది. అసలు బ్యాటరీని ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి పద్దతులు అనుసరించాలో చూద్దాం. 

బ్యాటరీ లైఫ్ ఎలా దెబ్బతింటుంది?

మనం వాడే స్మార్ట్‌లాగానే, ఈవీ బ్యాటరీలకు కూడా నిర్దిష్టమైన ఛార్జింగ్ సైకిల్ ఉంటుంది. బ్యాటరీని పూర్తిగా జీరోకి తీసుకురావడం లేదా ప్రతిసారీ వంద శాతం ఛార్జ్ చేయడం వల్ల లోపలి సెల్స్‌ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. లిథియం-అయాన్ బ్యాటరీలకు వేడి అనేది అతి పెద్ద శత్రువు, అధిక ఉష్ణోగ్రతల వద్ద ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ లోపలి భాగం పాడవుతుంది. 

20-80 శాతం మ్యాజిక్ ఏంటీ?

నిపుణులు, తయారీదారులు సూచించే అత్యంత ప్రభావవంతమైన సూత్రం 20-80 శాతం రూల్. మీ స్కూటర్‌ బ్యాటరీ 20 శాతం కంటే తక్కువకు పడిపోకుండా చూసుకోవాలి. లో బ్యాటరీ అలారం వచ్చిన వెంటనే ఛార్జింగ్‌ పెట్టడం ఉత్తమం. రోజువారీ అవసరాల కోసం బ్యాటరీని 80 శాతం నుంచి 85 వరకు మాత్రమే ఛార్జ్ చేయాలి. దీని వల్ల బ్యాటరీ సెల్స్‌పై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. బ్యాటరీ సెల్స్‌ అన్నీ సమానంగా ఉండటానికి వారానికి లేదా పది రోజులకు ఒకసారి మాత్రమే వంద శాతం ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. 

ఛార్జింగ్ చేయడానికి సరైన సమయం ఏదీ?

సమయం, వాతావరణం బ్యాటరీ పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సుదీర్ఘ ప్రయాణం లేదా వేగంగా డ్రైవ్ చేసిన వెంటనే బ్యాటరీ వేడిగా ఉంటుంది. ఆ స్థితిలో వెంటనే చార్జర్ పెట్టకూడదు. కనీసం ఇరవై నుంచి 30 నిమిషాలు ఆగి బ్యాటరీ చల్లబడిన తర్వాతే ఛార్జింగ్ ప్రారంభించాలి. ఛార్జింగ్ పూర్తి అయిన వెంటనే స్కూటర్ స్టార్ట్ చేయకుండా ఒక పది నిమిషాలు వేచి ఉండటం వల్ల బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. లేటెస్ట్ స్కూటర్లలో ఆటో కట్‌ ఫీచర్ ఉన్నప్పటికీ, రాత్రంతా ప్లగ్‌లోనే ఉంచడం వల్ల కాలక్రమేణా బ్యాటరీ ఉబ్బే అవకాశం ఉంది. 

సరైన ఛార్జింగ్‌ పద్ధతులు ఏంటీ?

బ్యాటరీని ఎలా ఛార్జ్‌ చేస్తున్నామనేది దాని లైఫ్‌ను నిర్ణయిస్తుంది. కంపెనీ ఇచ్చిన అఫిషియల్‌ ఛార్జర్‌ను మాత్రమే వాడాలి. థర్డ్‌ పార్టీ లేదా చౌకగా దొరికే ఛార్జర్లు వోల్టేజ్‌ హెచ్చుతగ్గుల వల్ల బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను పాడుచేస్తాయి. ఎల్లప్పుడూ చల్లని, నీడ ఉన్న, గాలి ఆడే ప్రదేశంలోనే ఛార్జ్‌ చేయాలి. గది ఉష్ణోగ్రత 20-30 డిగ్రీల సెల్సియస్‌ ఉండటం బ్యాటరీకి ఎంతో మేలు చేస్తుంది. ఒక వేళ వారం కంటే ఎక్కువ రోజులు స్కూటర్‌ వాడకపోతే, బ్యాటరీని 50 శాతం నుంచి 60 శాతం మధ్య ఉంచి పార్క్ చేయాలి. పూర్తిగా నిండుగా లేదా పూర్తిగా ఖాళీగా వదిలేయడం వల్ల బ్యాటరీ డెడ్‌ అయ్యే ప్రమాదం ఉంది. 

బ్యాటరీ లైఫ్‌ ఎంత?

సాధారణంగా నాణ్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ 3 నుంచి ఐదు సంవత్సరాలు లేదా 40 వేల నుంచి 80 వేల కిలోమీటర్ల వరకు మంచి పని తీరును కనబరుస్తుంది. పార్శియల్‌ ఛార్జింగ్‌ బ్యాటరీకి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీరు ఏ బ్రాండ్ స్కూటర్‌ వాడుతున్నా, ఈ ప్రాథమిక సూత్రాలు అన్నీ ఒకేలా వర్తిస్తాయి. క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించడం,బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేయించుకోవడం ద్వారా మీ ఈవీ ప్రయాణాన్ని మరింత కాలం సురక్షితంగా కొనసాగించవచ్చు. 

Frequently Asked Questions

ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ జీవితకాలాన్ని దేని వల్ల తగ్గించవచ్చు?

బ్యాటరీని పూర్తిగా డిశ్చార్జ్ చేయడం లేదా వంద శాతం ఛార్జ్ చేయడం, అలాగే అధిక ఉష్ణోగ్రతలలో ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ సెల్స్‌పై ఒత్తిడి పెరిగి జీవితకాలం తగ్గుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయాలి?

నిపుణులు సూచించే 20-80% రూల్ పాటించాలి. బ్యాటరీని 20% కంటే తగ్గకుండా, రోజువారీ అవసరాలకు 80-85% వరకు మాత్రమే ఛార్జ్ చేయాలి.

బ్యాటరీ ఛార్జింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కంపెనీ ఇచ్చిన అధికారిక ఛార్జర్‌ను మాత్రమే ఉపయోగించాలి. చల్లని, నీడ ఉన్న, గాలి ఆడే ప్రదేశంలో 20-30°C గది ఉష్ణోగ్రత వద్ద ఛార్జ్ చేయాలి.

ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ సగటు జీవితకాలం ఎంత?

సాధారణంగా, నాణ్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ 3 నుండి 5 సంవత్సరాలు లేదా 40,000 నుండి 80,000 కిలోమీటర్ల వరకు మంచి పనితీరును కనబరుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

బ్రేక్ వేయడం నుంచి లేన్ మార్చే వరకు.. కారులో ADAS ఉంటే భద్రత మరింత పెరుగుతుందా?
కార్లలో ADAS ఉంటే ప్రమాదాల ముప్పు తగ్గుతుందా? అసలు ADAS అంటే ఏంటి?
OTT లాగే కొత్త కార్లనీ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు, కొనకుండానే దర్జాగా తిరగొచ్చు, బోర్‌ కొడితే మార్చేయొచ్చు
కారు కొనాల్సిన పని లేదు.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే చాలు, కొత్త మోడల్‌ మీ ఇంటి ముందు ఉంటుంది
నెలకు రూ.12,000 EMIతోనూ మారుతి బ్రెజ్జా మీ ఇంటికొస్తుంది, లోన్‌ ఎంత తీసుకోవాలంటే?
కేవలం రూ.లక్షన్నరతో Maruti Brezzaను మీ ఇంటికి తెచ్చుకోవచ్చు! నెలకు ఎంత చెల్లించాలంటే?
Top Automatic Cars: ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
OTT లాగే కొత్త కార్లనీ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు, కొనకుండానే దర్జాగా తిరగొచ్చు, బోర్‌ కొడితే మార్చేయొచ్చు
కారు కొనాల్సిన పని లేదు.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే చాలు, కొత్త మోడల్‌ మీ ఇంటి ముందు ఉంటుంది
AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
Top Automatic Cars: ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
Embed widget