₹8 లక్షల లోపు మినీ SUV ఫీల్ కావాలా? - Nissan Magnite & Renault Kiger, ఈ రెండు కార్లు మీకోసమే!
₹8 లక్షల్లో SUV మాదిరి ఫీల్ ఇచ్చే కారు కావాలా? Nissan Magnite & Renault Kiger మోడల్స్ స్పేస్, కంఫర్ట్, SUV స్టైల్ — అన్నీ కలిపి అందిస్తాయి. యువ బయ్యర్స్‌కి పర్ఫెక్ట్ ఆప్షన్స్!

Best Cars Under 8 Lakh With Mini SUV Feel: మార్కెట్లో SUVల ట్రెండ్ రోజురోజుకీ పెరుగుతోంది. కొత్త కారు కొనేవాళ్లలో ఎక్కువ మంది SUVల వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ, ప్రతి ఒక్కరూ రూ.15-20 లక్షల రేట్లతో SUV కొనలేరు. అలాంటప్పుడు కలల కారు విషయంలో కాంప్రమైజ్ కావాలి. కానీ, మీరు కాంప్రమైజ్ కాకుండానే, SUV ఫీల్ ఇచ్చే కార్లు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, అది కేవలం ₹8 లక్షల బడ్జెట్‌లో. మీ బడ్జెట్‌లో SUV ఫీల్ ఇచ్చే కారు కావాలంటే, రెండు మోడల్స్ మీ లిస్ట్‌లో తప్పక ఉండాలి - Nissan Magnite & Renault Kiger. ఇవి రెండు కూడా SUV లుక్స్, కంఫర్ట్ ఫీల్ & బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ కలిపిన కాంబినేషన్.
Nissan Magnite - స్టైలిష్ డిజైన్, స్మార్ట్ ఫీచర్లు
Nissan Magnite లుక్స్ చూస్తేనే ఒక పెద్ద SUV లా కనిపిస్తుంది. షార్ప్ హెడ్ ల్యాంప్స్, డైనమిక్ గ్రిల్, రూఫ్ రైల్స్ - ఇవన్నీ SUV తరహా అటిట్యూడ్ ఇస్తాయి.
కారు ఇంటీరియర్‌లో 8 ఇంచ్ టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ స్టార్ట్, రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
డ్రైవింగ్ పొజిషన్ ఎలివేటెడ్‌గా ఉండటంతో SUV నడుపుతున్న ఫీల్ వస్తుంది.
1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మీ యాక్షన్స్‌కు చక్కగా రెస్పాండ్ అవుతుంది. సిటీ డ్రైవ్ అయినా లేదా లాంగ్ రైడ్ అయినా స్మూత్‌గా ఉంటుంది.
ధర విషయానికి వస్తే, Nissan Magnite బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం ₹5.61 లక్షల నుంచి (Nissan Magnite ex-showroom price, Hyderabad Vijayawada) ప్రారంభమవుతుంది. ఫీచర్ రిచ్ వేరియంట్ ₹8 లక్షల లోపే లభిస్తుంది.
Renault Kiger - SUV స్టైల్‌లో స్పోర్టీ ఫీల్
Renault Kiger కూడా Nissan Magnite లాగే CMF-A+ ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. అంటే, ఈ రెండు కార్లలో ఇంజిన్, బిల్డ్ క్వాలిటీ చాలా దగ్గరగా ఉంటాయి.
కానీ Renault Kiger కు స్పోర్టీ డిజైన్ ప్రత్యేకంగా వచ్చింది. బలమైన బాడీ లైన్స్, రూఫ్ కలర్ ఆప్షన్స్, LED హెడ్ ల్యాంప్స్ దీనిని స్టైలిష్‌గా చూపిస్తాయి.
కారు ఇంటీరియర్‌లో రెండు లేయర్‌ల డాష్‌బోర్డ్, 405 లీటర్ల బూట్ స్పేస్, వైడ్ రియర్ సీట్స్ - ఇవన్నీ కంఫర్ట్‌ను పెంచుతాయి.
1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఈ వెహికల్‌ను తగినంత శక్తిమంతం చేస్తుంది. సిటీ డ్రైవింగ్‌కి గానీ, హైవే రైడ్స్‌కి గానీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
Renault Kiger ఎక్స్-షోరూమ్ ధర కేవలం ₹5.76 లక్షల నుంచి (Nissan Magnite ex-showroom price, Hyderabad Vijayawada) మొదలవుతుంది.
ఎందుకు వీటినే ఎంచుకోవాలి?
SUV తరహా ఎలివేటెడ్ డ్రైవింగ్ పొజిషన్
పెద్ద కారు నడుపుతున్న ఫీల్‌తో పాటు చిన్న కారులో ఉండే సౌలభ్యం
మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ
₹8 లక్షల్లో ప్రాక్టికల్ & స్టైలిష్ ఆప్షన్స్
ఫస్ట్‌టైమ్ బయ్యర్స్‌కి SUV తరహా ఫీల్ ఇచ్చే కారు కావాలంటే Nissan Magnite లేదా Renault Kigerలో ఏదైనా ఎంచుకోవచ్చు. ఈ రెండు కార్లు కూడా యువత కోసం డిజైన్ చేసినట్లే ఉన్నాయి. స్పోర్టీ లుక్స్, కంఫర్ట్ డ్రైవ్ తో పాటు మీ బడ్జెట్‌లోనే వస్తాయి.





















