Diwali Discounts On Cars: దద్దరిల్లుతున్న దీపావళి ఆఫర్లు - పాపులర్ కార్లపై టాప్ డిస్కౌంట్లు, ₹3 లక్షల వరకు బెనిఫిట్స్
Diwali Top Car Deals 2025: ఈ దీపావళికి కార్ కొనాలనుకునేవారికి గోల్డెన్ ఛాన్స్. మారుతి, హోండా, కియా, స్కోడా కంపెనీలు తమ టాప్ మోడళ్ల మీద దాదాపు ₹3 లక్షల వరకు డిస్కౌంట్లు అందిస్తున్నాయి.

2025 Diwali Top Offers Discounts On Cars: దీపావళి దగ్గర పడుతుండటంతో కార్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ తగ్గింపులు ప్రకటించాయి. SUVల నుంచి సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్‌ల వరకు అన్ని సెగ్మెంట్లలో ఆఫర్లు దూసుకొస్తున్నాయి. ఈసారి కొన్ని మోడళ్లపై ₹3 లక్షల వరకు డిస్కౌంట్లు అందుతున్నాయి.
1. Mahindra Marazzo - ₹3 లక్షల వరకు తగ్గింపు
ఈ లిస్టులో టాప్ ప్లేస్‌లో ఉన్నది మహీంద్రా మరాజ్జో MPV. 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో 120 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. 7, 8 సీటర్ ఆప్షన్లలో వస్తున్న ఈ MPV ధరలు ₹14.05 లక్షల నుంచి ₹16.37 లక్షల వరకు ఉన్నాయి. దీపావళి సీజన్‌లో దీనిపై ₹3 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది.
2. Skoda Kushaq - ₹2.5 లక్షల వరకు తగ్గింపు
మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో స్కోడా కుషాక్‌పై భారీ ఆఫర్ ఉంది. 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో ఇది వస్తుంది. మోంటే కార్లో ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. ధర ₹10.61 లక్షల నుంచి ₹18.43 లక్షల వరకు ఉండగా, తగ్గింపు ₹2.5 లక్షల వరకు ఉంది.
3. Mahindra XUV400 - ₹2.5 లక్షల వరకు తగ్గింపు
ఈ లిస్టులో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ SUV ఇదే. 34.5kWh, 39.5kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. సింగిల్ చార్జ్‌తో గరిష్టంగా 456 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ధర ₹15.49-₹17.49 లక్షల మధ్య ఉండగా, ₹2.5 లక్షల వరకు తగ్గింపు అందుతోంది.
4. Skoda Slavia - ₹2.25 లక్షల వరకు తగ్గింపు
మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో స్లావియా హాట్ డీల్. 1.0 & 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. మోంటే కార్లో ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. ధర ₹9.99-₹17.69 లక్షల మధ్య ఉండగా, తగ్గింపు ₹2.25 లక్షల వరకు ఉంది.
5. Maruti Grand Vitara - ₹1.8 లక్షల వరకు తగ్గింపు
ఈ మిడ్-సైజ్ SUV మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లలో వస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్, e-CVT ట్రాన్స్‌మిషన్‌ల ఆప్షన్లు ఉన్నాయి. ధర ₹10.76-₹19.57 లక్షల మధ్య ఉండగా, ఈ దీపావళి వరకు ₹1.8 లక్షల తగ్గింపు అందుతోంది.
6. Volkswagen Taigun - ₹1.8 లక్షల వరకు తగ్గింపు
టైగన్ SUV 1.0 & 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ప్రైస్ ₹11.39-₹19.14 లక్షల మధ్య ఉంది. ఈసారి దీపావళి ఆఫర్‌గా ₹1.8 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
7. Kia Syros - ₹1.6 లక్షల వరకు తగ్గింపు
కంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో సైరోస్ మంచి ఆఫర్ ఇస్తోంది. 1.0 టర్బో పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజిన్‌లతో ఈ కారు లభిస్తుంది. ప్రత్యేకంగా రియర్ వెంటిలేటెడ్ సీట్లు కూడా ఉన్నాయి. ధర ₹9.82-₹15.93 లక్షల మధ్య ఉండగా, తగ్గింపు ₹1.6 లక్షల వరకు ఉంది.
8. Honda Elevate - ₹1.51 లక్షల వరకు తగ్గింపు
హోండా సిటీ ఇంజిన్‌తో వస్తున్న ఈ SUVలో ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర ₹10.99-₹16.15 లక్షల మధ్య ఉండగా, ₹1.51 లక్షల వరకు ఆఫర్ ఉంది.
9. Volkswagen Virtus - ₹1.5 లక్షల వరకు తగ్గింపు
విర్టస్ సెడాన్ 1.0 & 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లతో లభిస్తుంది. ధర ₹11.16-₹18.73 లక్షల మధ్య ఉంది. ఈ దీపావళి సీజన్‌లో ₹1.5 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది.
10. Kia Seltos - ₹1.47 లక్షల వరకు తగ్గింపు
సెల్టోస్ SUV 1.5 పెట్రోల్, 1.5 డీజిల్, 1.5 టర్బో పెట్రోల్ ఇంజిన్‌లతో వస్తుంది. ధర ₹10.79-₹19.8 లక్షల మధ్య ఉండగా, ₹1.47 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
11. Kia Carens Clavis - ₹1.41 లక్షల వరకు తగ్గింపు
ఈ MPV 1.5 పెట్రోల్, 1.5 టర్బో పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజిన్‌లతో లభిస్తుంది. ధర ₹11.07-₹20.71 లక్షల మధ్య ఉంది. దీపావళి ఆఫర్‌గా ₹1.41 లక్షల వరకు తగ్గింపు ఉంది.
12. Maruti Invicto - ₹1.4 లక్షల వరకు తగ్గింపు
మారుతి ఖరీదైన MPV ఇది. 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తుంది. ధర ₹24.97-₹28.69 లక్షల మధ్య ఉండగా, ₹1.4 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
13. Honda City - ₹1.27 లక్షల వరకు తగ్గింపు
1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్, హైబ్రిడ్ వేరియంట్‌తో వస్తుంది. ధర ₹11.95-₹19.48 లక్షల మధ్య ఉంది. దీపావళి సీజన్‌లో ₹1.27 లక్షల వరకు తగ్గింపు ఉంది.
14. Maruti Suzuki Baleno - ₹1.05 లక్షల వరకు తగ్గింపు
బాలెనో 1.2 లీటర్ పెట్రోల్, CNG ఆప్షన్లలో లభిస్తుంది. ధర ₹5.99-₹9.10 లక్షల మధ్య ఉండగా, ₹1.05 లక్షల వరకు తగ్గింపు ఉంది.
15. Kia Sonet - ₹1.02 లక్షల వరకు తగ్గింపు
సబ్‌కంపాక్ట్ SUV అయిన సోనెట్ 1.2 పెట్రోల్, 1.0 టర్బో పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజిన్‌లతో లభిస్తుంది. ధర ₹7.3-₹14 లక్షల మధ్య ఉంది. దీపావళి స్పెషల్‌గా ₹1.02 లక్షల వరకు ఆఫర్ ఉంది.
హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఇప్పటికే ఈ ఆఫర్లు ప్రారంభమయ్యాయి. ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలనుకునేవారికి ఇది గోల్డెన్ ఛాన్స్. మారుతి నుంచి మహీంద్రా వరకు, కియా నుంచి స్కోడా వరకు... ఈ దీపావళికి ఆటో మార్కెట్ మొత్తం డిస్కౌంట్‌లతో దద్దరిల్లుతోంది.





















