అన్వేషించండి

Ather 450 Apex రివ్యూ: పెర్ఫార్మెన్స్‌, ఫీచర్లు అద్భుతం - కానీ ఈ లోపాలను కూడా గుర్తుంచుకోండి

Ather 450 Apex ఎందుకు కొనాలి? ఎందుకు కొనకూడదు? పనితీరు, ఫీచర్లు, ధర, హైదరాబాద్‌-విజయవాడ ఆన్‌రోడ్‌ ధరలతో పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.

Ather 450 Apex review: ఏథర్‌ 450 అపెక్స్‌ అనేది 450X ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత అడ్వాన్స్‌డ్‌, మోస్ట్‌ పవర్‌ఫుల్‌ వెర్షన్‌. ఏథర్‌ తన టెక్నాలజీని ఎంత దూరం తీసుకెళ్లిందో చూపించే మోడల్‌ ఇది. 2025 అప్‌డేట్‌తో కొత్త ఫీచర్లు జోడించడంతో, ఇది సాధారణ వినియోగదారుల కంటే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను నడపాలన్న ఉత్సాహం ఉన్నవాళ్లనే లక్ష్యంగా చేసుకుంది. అయితే ఈ స్కూటర్‌ నిజంగా మీకు సరిపోతుందా? కొనాల్సిన కారణాలు ఏమిటి? వదిలేయాల్సిన అంశాలేంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Ather 450 Apex ఎందుకు కొనాలి? - 3 కారణాలు

1. ఉత్సాహాన్ని పెంచే పనితీరు

Ather 450 Apex‌కు మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చిన Warp+ మోడ్‌ ఈ స్కూటర్‌ను పూర్తిగా వేరే లెవెల్‌కు తీసుకెళ్తుంది. టార్క్‌ రెస్పాన్స్‌ చాలా వేగంగా ఉండటంతో పాటు టాప్‌ ఎండ్‌ కూడా షార్ప్‌గా అనిపిస్తుంది.

పెర్ఫార్మెన్స్‌ టెస్టుల్లో 0 నుంచి 40 కి.మీ, వేగాన్ని కేవలం 2.9 సెకన్లలో, 80 కి.మీ. వేగాన్ని 11.59 సెకన్లలో అందుకుంది. ఇది 450X Gen3తో పోలిస్తే దాదాపు 5 సెకన్లు ఎక్కువ వేగం. పవర్‌ డెలివరీ తక్షణమే ఇచ్చినా ఎక్కడా జర్క్‌ అనిపించదు. థ్రాటిల్‌ కాలిబ్రేషన్‌ చాలా శుభ్రంగా ఉండటం వల్ల ఓవర్‌టేక్‌ చేయాలన్నా, వేగంగా ముందుకు దూసుకెళ్లాలన్నా నమ్మకంగా అనిపిస్తుంది.

2. సిటీ రైడింగ్‌ను సులభం చేసే టెక్నాలజీ

Ather Stack 7.0 అప్‌డేట్‌లో భాగంగా Apex‌కు వచ్చిన Infinite Cruise ఫీచర్‌ నిజంగా గేమ్‌ ఛేంజర్‌. ఇది హైవే కంటే మన నగరాల్లో ఉండే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.

City Cruise ట్రాఫిక్‌లో ఒకే వేగాన్ని కొనసాగిస్తుంది. బ్రేక్‌ వేస్తే ఆటోమేటిక్‌గా ఆగి, మళ్లీ యాక్సిలరేటర్‌ తిప్పితే కొత్త వేగాన్ని లాక్‌ చేస్తుంది. Hill Control ఎత్తులు, దిగువల్లో రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌ సహాయంతో స్థిరమైన వేగాన్ని ఉంచుతుంది. Crawl Control అయితే కేవలం 10 కి.మీ. వేగంతో నెమ్మదిగా సాగేందుకు సహాయపడుతుంది. రోజూ ట్రాఫిక్‌లో నడిపేవారికి ఇది పెద్ద రిలీఫ్‌.

3. ప్రత్యేకమైన డిజైన్‌ & ప్రీమియం ఫీల్‌

450X లాగే కాంపాక్ట్‌, షార్ప్‌ డిజైన్‌ ఉన్నా, Apex‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆరెంజ్‌ కలర్‌ వీల్స్‌, ట్రాన్స్‌పరెంట్‌ సైడ్‌ ప్యానెల్స్‌ లోపల కనిపించే బ్రైట్‌ ఆరెంజ్‌ ట్రెలిస్‌ ఫ్రేమ్‌ ఈ స్కూటర్‌కు కాన్సెప్ట్‌ బైక్‌ లుక్‌ ఇస్తాయి.

ఈ ఏడాది ఏథర్‌ బ్రాండ్‌కు 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక 10వ వార్షికోత్సవ స్టిక్కర్లు ఇచ్చారు. Indium Blue కలర్‌ స్కీమ్‌ రోడ్డుపై ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Ather 450 Apex ఎందుకు కొనకూడదు? -  2 కారణాలు

1. ABS లేకపోవడం

ప్రీమియం, హై-పెర్ఫార్మెన్స్‌ స్కూటర్‌ అయినప్పటికీ Apex‌లో ABS లేదు. గట్టిగా బ్రేక్‌ వేస్తే వెనుక వీల్‌ సులభంగా లాక్‌ అవుతుంది. 100 కి.మీ. వేగాన్ని తాకే స్కూటర్‌కు ఇది ఒక 'పెద్ద మైనస్‌ పాయింట్‌'.

2. అధిక ధర

దాదాపు రూ.1,91 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) ధరతో Ather 450 Apex చాలా ఖరీదైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌. ఇది సాధారణ వినియోగదారుల కంటే ఔత్సాహికులకే ఎక్కువగా సరిపోతుంది. 450X ఇప్పటికే బాగా పెనితీరు ఇస్తుండగా, దాని కంటే ఎక్కువ ధర చెల్లించడానికి అందరూ సిద్ధంగా ఉండకపోవచ్చు.

Ather 450 Apex ఆన్‌రోడ్‌ ధరలు

హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర:
ఎక్స్‌-షోరూమ్‌: ₹ 1,90,419
RTO: ₹ 635
ఇన్సూరెన్స్‌: ₹ 8,128
మొత్తం: ₹ 1,99,182 ‍‌

విజయవాడలో ఆన్‌రోడ్‌ ధర:
ఎక్స్‌-షోరూమ్‌: ₹ 1,89,841
RTO: ₹ 485
ఇన్సూరెన్స్‌: ₹ 8,116
మొత్తం: ₹ 1,98,442

మొత్తంగా చూస్తే, అత్యంత వేగం, కొత్త టెక్నాలజీ, ప్రత్యేకమైన స్టైల్‌ కావాలంటే Ather 450 Apex ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. కానీ... అధిక ధర, ABS లేకపోవడం వంటి అంశాలను కచ్చితంగా ఆలోచించాల్సినవే. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget