అన్వేషించండి

Anant Ambani Car: కారుకు కోటి రూపాయల పెయింట్ వేయించిన అనంత్ అంబానీ - పిచ్చెక్కించే ఫీచర్లు ఈ కార్‌ సొంతం

Anant Ambani Rolls Royce: రోల్స్ రాయిస్‌ను సంపన్నులు మాత్రమే కొనగలరు, ఆ కారును ఫ్యాక్టరీలోనే తమ అభిరుచికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయించుకుంటారు.

Anant Ambani Customized Rolls Royce Cullinan: భారతదేశంలోనే కాదు, ప్రపంచ ధనికుల్లో ఒకటైన అంబానీ కుటుంబం విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ను ఎంజాయ్‌ చేస్తుంది. అంబానీ కుటుంబ సభ్యుల ఒంటిపై కనిపించే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇంకా.. ఈ కుటుంబ సభ్యుల ప్రయాణాల కోసం Antilia (ముకేష్‌ అంబానీ 27 అంతస్తుల నివాసం భవనం పేరు) గరాజ్‌లో చాలా లగ్జరీ కార్లు (Ambani family luxury car collection) రెడీగా ఉంటాయి. ఈ కుటుంబానికి రోల్స్ రాయిస్‌ కల్లినన్ కార్లు అంటే ఎంత క్రేజ్‌ అంటే, ఈ ఫ్యామిలీ వద్ద 10 రోల్స్ రాయిస్ కల్లినన్లు ఉన్నాయి, అవన్నీ దేనికదే ప్రత్యేకమైనవి.

కార్టోక్ రిపోర్ట్‌ ప్రకారం, అంబానీ ఇంటి గరాజ్‌లో ఒక రోల్స్ రాయిస్ కల్లినన్ కారుకు ఇటీవల పెయింట్‌ చేయించారు, దీనికోసం కోటి రూపాయలు ఖర్చు చేశారు. ఈ రోల్స్ రాయిస్ కారు, ముఖేష్ అంబానీ కుమారుడు ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ సొంతం.   

కస్టమైజ్డ్‌ కార్లను ఉపయోగిస్తున్న అంబానీ కుటుంబం
మీకు రోల్స్ రాయిస్ కార్ల గురించి మీకు ఒక విషయం తెలియాలి. ఈ కార్లు కస్టమైజ్డ్‌ మోడల్స్‌గా వస్తాయి. అంటే, కారు కొనే వ్యక్తి తన అభిరుచి & అవసరాలకు అనుగుణంగా ఈ కారులో మార్పులు చేయించుకుంటాడు. కారు తయారయ్యే సమయంలోనే, ఫ్యాక్టరీలోనే ఈ మార్పులు జరుగుతాయి, కస్టమైజ్డ్‌ మోడల్‌గా కారు ఉత్పత్తి జరుగుతుంది. అంటే, ప్రతి రోల్స్‌ రాయిస్‌ కారు దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. అంబానీ కుటుంబ సభ్యులు, తమ రోల్స్ రాయిస్ కార్లలో కస్టమైజ్డ్‌ ఫీచర్ల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తుంటారు, ఇది ఎప్పుడూ కనిపిస్తుంది. ఈ కస్టమైజ్డ్‌ ఫీచర్లలో ఒకటి పెయింట్ జాబ్, దీనిని రూ. 1 కోటి ఖర్చుతో పూర్తి చేశారు.     

గత ఏడాది (2024) జులై 12న, అనంత్‌ అంబానీ - రాధిక మర్చంట్‌ వివాహం జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఆ సమయంలో, అనంత్ అంబానీ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నప్పుడు అందరి దృష్టి అతని రోల్స్ రాయిస్ కారుపైనే ఉంది. రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోవడానికి అనంత్ అంబానీ రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్‌లో వచ్చారు.     

రోల్స్ రాయిస్ కల్లినన్ వేగం & ఇంజిన్ పవర్‌
రోల్స్ రాయిస్ కల్లినన్ 5 సీట్ల లగ్జరీ SUV కారు, ఇది దేశంలో మొత్తం 11 రంగులలో లభిస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. కంపెనీ లెక్క ప్రకారం, ఈ కారు లీటరుకు కేవలం 6.6 కి.మీ. మైలేజీ మాత్రమే అందిస్తుంది. అలాగే, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే ఈ కారు లభిస్తుంది.         

రోల్స్ రాయల్ కల్లినన్ ఇంజిన్ విషయానికి వస్తే.. కంపెనీ ఈ అల్ట్రా లగ్జరీ కారులో 6,749 cc శక్తిమంతమైన ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 563 bhp పవర్‌ను & 850 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget