అన్వేషించండి

Most Affordable ADAS Cars: 10 లక్షల బడ్జెట్‌లోనే టాప్‌ ADAS ఫీచర్‌ కార్లు! పూర్తి వివరాలు ఇవే!

ADAS Cars: భారత్ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్‌ సిస్టమ్ ఇప్పుడు సామాన్యులకు చేరువవుతోంది. గతంలో లగ్జరీ కార్లకే పరిమితమైన టెక్నాలజీ లో బడ్జెట్ కార్లలో లభిస్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కారు భద్రతకు ప్రాధాన్యత పెరిగింది, ADAS ఫీచర్లు ఇప్పుడు సరసమైన కార్లలోనూ అందుబాటులోకి వచ్చాయి.
  • ADAS అనేది ప్రమాదాలను గుర్తించి, డ్రైవర్‌కు సహాయపడే సెన్సార్ ఆధారిత వ్యవస్థ.
  • హోండా అమేజ్, మహీంద్రా XUV 3XO, హోండా సిటీ ADAS కలిగిన ముఖ్య కార్లు.
  • మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడంలో ADAS కీలక పాత్ర పోషిస్తుంది.

Most Affordable ADAS Cars: ఒకప్పుడు కారు కొనాలంటే కేవలం మైలేజీ, ధర మాత్రమే చూసే వినియోగదారులు ఇప్పుడు భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఈ మార్పును గమనించిన వాహన తయారీ సంస్థలు ఈ మార్పును గమనించిన వాహన తయారీ సంస్థలు అత్యాధునికమైన అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ను సామాన్యులు కొనే కార్లలోనూ ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం భారత్ మార్కెట్లో హ్యుందాయ్, హోండా, మహీంద్రా వంటి కంపెనీలు అత్యంత సరసమైన ధరలకే ADAS ఫీచర్లు అందిస్తున్నాయి. 

ADAS అనేది డ్రైవర్‌కు సహాయపడే ఒక సెన్సార్‌ ఆధారిత వ్యవస్థ. ఇది రోడ్డుపై ప్రమాదాలను ముందుగానే గుర్తించి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. అత్యవసరం సమయంలో ఆటోమేటిక్‌గా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో ప్రధానంగా రెండు స్థాయిలు ఉన్నాయి. 

లెవల్ 1 ADAS ప్రాథమిక హెచ్చరికలను అందిస్తుంది. ఉదాహరణకు ముందున్న వాహనాన్ని ఢీ కొనే ప్రమాదం ఉంటే హెచ్చరించడం, కారు లైన్ దాటుతుంటే సరిచేయడం వంటివి ఇందులో ఉంటాయి. 

లెవల్ 2 ADAS మరింత అధునాతనమైంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్‌ కంట్రోల్, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. 

భారత్‌లో అత్యంత సరసమైన టాప్‌ 10 ADAS కార్లు

ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతున్న పెట్రోల్‌/డీజిల్‌ కార్లలో ADAS సౌకర్యం ఉన్న టాప్ 10 మోడల్స్‌ వివరాలు ఉన్నాయి. 

హోండా అమేజ్‌(3rd జనరేషన్): భారత్‌లో ADAS కలిగిన అత్యంత చౌకైన కారుగా హోండా అమేజ్ సరికొత్త రికార్డు సృష్టించింది. దీని ధర 9.29 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంది. నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండి, ADAS ఫీచర్లు కలిగిన ఏకైక సెడాన్ ఇదే దీని టాప్‌- స్పెక్‌ ZX వేరియంట్‌లో ఈ సేఫ్టీ సూట్ లభిస్తుంది. 

మహీంద్రా XUV 3XO: మహీంద్రా నుంచి వచ్చిన ఈ ఎస్‌యూవీ రూ. 11.91 లక్షల నుంచి 14. 89 లక్షల ధరకు లభిస్తోంది. దీనిలోని AX5, AX7L వేరియంట్లలో లెవల్ 2ADAS సౌకర్యం ఉంది. ఇది పెట్రోల్‌, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లలో  లభిస్తుంది. 

హోండా సిటీ

హోండా సిటీ తన బేస్ మోడల్‌ మినహా మిగిలిన అన్ని వేరియంట్లలో (V,VX,ZX)ADAS ఫీచర్లను అందిస్తోంది. దీని ధర రూ. 12.4 లక్షల నుంచి రూ. 16.17 లక్షల వరకు ఉంది. ఇది లెవల్‌ 2 ADAS సాంకేతికతతో వస్తుంది. 

Also Read: విద్యార్థులకు యూజ్ అయ్యే మధ్యతరగతి బడ్జెట్‌ ఎలక్ట్రిక్‌ సైకిళ్లు! స్కూల్‌ వెహికల్స్‌కు కట్టే డబ్బులతో కొనేయొచ్చు!

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ ఫియర్‌లెస్‌+పీఎస్ ట్రిమ్‌లో లెవ్‌ 2 ADASను అందిస్తోంది. దీని ధర రూ. 13. 45 లక్షల నుంచి 13.92లక్షల వరకు ఉంది. అయితే, ఈ ఫీచర్ కేవలం పెట్రోల్- డిసిటి కాంబినేషన్‌లో మాత్రమే లభిస్తుంది. డీజిల్ వేరియంట్లలో లేదు. 

కియా సోనెట్‌ 

కియా సోనెట్‌ లెవల్‌ 1 ADAS సిస్టమ్‌తో వస్తుంది. దీని GTX+, X-Line వేరియంట్లలో ఈ ఫీచర్ ఉంది. వీటి ధర రూ. 13.56 లక్షల నుంచి 14. 17 లక్షల వరకు ఉంది. 2027లో రాబోయే కొత్త తరం సోనెట్‌లో లెవల్‌2 ADAS వచ్చే వరకు అవకాశం ఉంది. 

హ్యుందాయ్‌ వెన్యూ

హ్యుందాయ్‌ వెన్యూ గతంలో లెవల్ 1 సిస్టమ్‌ను కలిగి ఉండగా, ఇప్పుడు కొత్తగా లెవల్‌ -2ADASనుప్రవేశ పెట్టింది. దీని టాప్ స్పెక్‌HX10 వేరియంట్‌ ధర రూ.  14. 64 లక్షల నుంచి 15. 82 లక్షల వరకు ఉంది. 

Also Read:  హైవేలపై ఇక దూసుకెళ్లడమే - టోల్ గేట్ల వద్ద బారియర్లు మాయం.. డిసెంబర్ 2026 నుండి కొత్త వ్యవస్థ అమలు..

హోండా ఎలివేట్‌

హోండా ఎలివేట్‌ తన ZX వేరియంట్‌లో ADAS ఫీచర్లను అందిస్తోంది. దీని ధర 14. 92 లక్షల నుంచి 16. 67 లక్షల వరకు ఉంది. 

ఎంజీ ఆస్టర్‌ 

2021లో మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో తొలిసారి ADASనుు పరిచయం చేసింది ఎంజీ ఆస్టర్. దీని సావీ ప్రో ట్రిమ్ ర 15. 3 లక్షల నుంచి 15.5 లక్షల మధ్యలో ఉంది. 

Also Read: మహీంద్రా నుండి ఫస్ట్ సీఎన్జీ ఎస్‌యూవీ.. మార్కెట్లోకి ఎక్స్‌యూవీ 3XO సరికొత్త మోడల్! టాటా, మారుతి కార్లకు గట్టి పోటీ

రెనాల్ట్ డస్టర్

మూడో తరం రెనాల్ట్ డస్టర్‌ ఇప్పుడు భారత్‌లో లెవల్‌ 2 ADASతో సిద్ధమైంది. దీని ఐకానికి వేరియంట్‌ ధర రూ. 16.99 లక్షల నుంచి 18.69 లక్షల వరకు ఉంది. 

హ్యుందాయ్‌ వెర్నా

ఈ జాబితాలో చివరిగా ఉన్న హ్యుందాయ్‌ వెర్నా HX8, HX 10 ట్రిమ్స్‌ో లెవల్‌ 2ADASను అందిస్తోంది. దీని ధర 17.15 లక్షల నుంచి 18.4 లక్షల వరకు ఉంది. 

భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడంలో ADAS కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్పుడు కేవలం ధనికులకే పరిమితమైన ఇటువంటి ఫీచర్లు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి రావడాన్ని డెమోక్రటైజేషన్ ఆఫ్‌ సేఫ్టీగా అభివర్ణించారు. రాబోయే రోజుల్లో భారత్‌్ ఎన్‌క్యాప్‌ వంటి ప్రమాణాలు పెరగడం వల్ల ప్రతి కారులో ADAS ఒక సాధారణ ఫీచర్‌గా మారే ఛాన్స్ ఉంది.  

Frequently Asked Questions

ADAS అంటే ఏమిటి?

ADAS అనేది డ్రైవర్‌కు సహాయపడే ఒక సెన్సార్‌ ఆధారిత వ్యవస్థ. ఇది రోడ్డుపై ప్రమాదాలను ముందుగానే గుర్తించి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది.

ADAS లో ఎన్ని స్థాయిలు ఉన్నాయి?

ADAS లో ప్రధానంగా రెండు స్థాయిలు ఉన్నాయి. లెవల్ 1 ప్రాథమిక హెచ్చరికలను అందిస్తుంది, లెవల్ 2 మరింత అధునాతనమైంది.

భారత్‌లో ADAS కలిగిన అత్యంత చౌకైన కారు ఏది?

భారత్‌లో ADAS కలిగిన అత్యంత చౌకైన కారుగా హోండా అమేజ్ సరికొత్త రికార్డు సృష్టించింది. దీని ధర 9.29 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంది.

ADAS ఫీచర్లు అందించే కొన్ని కార్ల పేర్లు ఏమిటి?

హోండా అమేజ్, మహీంద్రా XUV 3XO, హోండా సిటీ, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్‌ వెన్యూ వంటి కార్లు ADAS ఫీచర్లను అందిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
హీరో విడా VX2 Go FB లాంచ్.. 128km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, రేటు మీకు అందుబాటులోనే!
మహీంద్రా విజన్ S నుంచి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వరకు.. ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లు ఇవే
ఆగస్టులో కొత్త కార్ల సందడి.. మహీంద్రా, స్కోడా, ఎంజీ నుంచి న్యూ లాంచ్‌లు, మీ లైఫ్‌స్టైల్‌ పెంచే కారు ఉండొచ్చు!
కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే
కియా సెల్టోస్ HTX IVT లేదా టాటా సఫారి అడ్వెంచర్ X ప్లస్? రూ.2.5 లక్షల తేడాలో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Sri Lanka Death Sentence: శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Embed widget