అన్వేషించండి

Mahindra XUV 3XO CNG Variant: మహీంద్రా నుండి ఫస్ట్ సీఎన్జీ ఎస్‌యూవీ.. మార్కెట్లోకి ఎక్స్‌యూవీ 3XO సరికొత్త మోడల్! టాటా, మారుతి కార్లకు గట్టి పోటీ

మహీంద్రా తన పాపులర్ ఎక్స్‌యూవీ 3XO మోడల్‌లో సీఎన్జీ వేరియంట్‌ను తీసుకురాబోతోంది. ఇది 2026 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉండటంతో వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది.

Mahindra XUV 3XO CNG Variant Launch Expected by Late 2026 ఇండియ‌న్ ఆటోమొబైల్ మార్కెట్లో బడ్జెట్ ధరలో లభించే గ్రీన్ ఫ్యూయల్ ఆప్షన్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ దేశీయ తయారీ సంస్థ మహీంద్రా తన మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 3XO (XUV 3XO) లో సీఎన్జీ వేరియంట్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో ఇతర కంపెనీలు తమ సీఎన్జీ మోడళ్లతో దూసుకుపోతుండగా, మహీంద్రా కొంచెం ఆలస్యంగానైనా పక్కా ప్లాన్ తో ఈ బరిలోకి దిగుతోంది. పర్యావరణ హితమైన ఇంధనం వైపు మళ్లుతున్న కస్టమర్లను ఆకర్షించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

ఇంజిన్ సామర్థ్యం ఎలా ఉంటుంది?
ప్రస్తుతం ఎక్స్‌యూవీ 3XO మోడల్ 1.2 లీటర్ ఎంపీఎఫ్ఐ (MPFi) టర్బో పెట్రోల్ ఇంజిన్ తో లభిస్తోంది. ఇది 111 హెచ్‌పీ పవర్, 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో 1.2 లీటర్ టీజీడీఐ (TGDi) పెట్రోల్ ఇంజిన్ తో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అయితే రాబోయే సీఎన్జీ కిట్ ను బేస్ వేరియంట్ అయిన 111 హెచ్‌పీ ఎంపీఎఫ్ఐ పెట్రోల్ యూనిట్ కు జత చేసే అవకాశం కనిపిస్తోంది. ఇది టాటా నెక్సాన్ ఐసీఎన్జీ (Nexon iCNG) వంటి ప్రత్యర్థుల పద్ధతిలోనే ఉండబోతోంది అని అటో మొబైల్ నిపుణుల వర్గాల అంచనాగా తెలుస్తోంది. 

లాంచ్ ఎప్పుడు? అంచనా ధర ఎంత?
తాజా నివేదిక ప్రకారం, ఎక్స్‌యూవీ 3XO సీఎన్జీ వేరియంట్ 2026 చివరిలో లేదా 2027 ఆరంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మహీంద్రా నుండి వస్తున్న మొట్టమొదటి ప్యాసింజర్ సీఎన్జీ ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. ఇది మార్కెట్లోకి వస్తే టాటా నెక్సాన్ సీఎన్జీ, మారుతి బ్రెజా వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. ప్రస్తుతం పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.54 లక్షలు (ఎక్స్‌షోరూమ్) ఉండగా, సీఎన్జీ వేరియంట్ ధర రూ. 9 లక్షల నుండి రూ. 12 లక్షల మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఫీచర్ల విషయంలో తగ్గేదే లే..
సీఎన్జీ వేరియంట్ అయినప్పటికీ, ఫీచర్ల విషయంలో మహీంద్రా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇందులో డ్యూయల్ 10.25-ఇంచ్ స్క్రీన్లు, లెవల్-2 అడాస్ (ADAS), పనోరమిక్ సన్‌రూఫ్, ఆరు ఎయిర్ బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఫీచర్లు అలాగే ఉండబోతున్నాయి. సీఎన్జీ ట్యాంక్ కోసం బూట్ స్పేస్ లో చిన్నపాటి మార్పులు జరిగినా, ప్రీమియం లుక్ లో ఎటువంటి తేడా ఉండదు. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతున్న ఈ కారు, మహీంద్రా గ్రీన్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయనుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఈ కారు ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏదేమైనా సీఎన్జీ వేరియంట్ ద్వారా ఆ రంగంలో పోటీకి మహీంద్ర తెర లేపిందని ఆటో మోబైల్ రంగ నిఫుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

రూ.1.27 లక్షలకే Hero Xtreme 160R 4V అప్‌డేటెడ్‌ వెర్షన్‌.. కొత్త డిజైన్, మూడు వేరియంట్లు, పవర్‌ఫుల్ ఫీచర్లు!
కొత్త లుక్‌లో Hero Xtreme 160R 4V లాంచ్‌.. క్రూయిజ్ కంట్రోల్, TFT డిస్‌ప్లేతో నయా అప్‌డేట్స్
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget