అన్వేషించండి

Flex Fuel Cars: భారత్‌లో ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ల జోరు.. 100% ఇథనాల్‌తో తగ్గనున్న ఇంధన ఖర్చులు!

భారత ఆటోమొబైల్ రంగంలో ఇథనాల్ ఇంధన విప్లవం రాబోతోంది. మారుతి వ్యాగన్ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ రాగా, త్వరలోనే హ్యుందాయ్ క్రెటా, టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్, టొయోటా కార్లు ఇథనాల్‌తో నడవనున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఫ్రాంక్స్, టొయోటా కార్లు కూడా చేరి, వినియోగదారుల ఖర్చులు తగ్గిస్తాయి.

5 Upcoming Flex Fuel Cars | పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల ఖర్చుల పరంగా వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తోంది. దాంతో భారత మార్కెట్లోకి కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఒక కొత్త, పెద్ద విప్లవాత్మక మార్పునకు ప్లాట్ ఫాం రెడీ అవుతోంది. భారత రోడ్లపై త్వరలోనే పెట్రోల్‌కు బదులుగా పూర్తిగా చెరకు, మొక్కజొన్నతో తయారు చేసిన ఇథనాల్‌ (Ethanol)తో నడిచే వాహనాలు పరుగులు తీయనున్నాయి. 

మారుతి సుజుకి ఇప్పటికే తన వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (WagonR Flex Fuel) ను రూ.7.24 లక్షల ధరతో లాంచ్ చేసి ఈ విభాగంలో ఈ రేసును ప్రారంభించింది. అయితే మిగతా ప్రముఖ కంపెనీలు సైతం రేసులోకి వస్తున్నాయి. చాలా మందికి ఎంతో ఇష్టమైన ఎస్‌యూవీలు (SUVs) అయిన క్రెటా,  టాటా పంచ్ కూడా త్వరలోనే తమ కొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ అవతారంలో మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

త్వరలో హ్యుందాయ్ క్రెటా లాంచ్
దేశంలో అత్యంత పాపులర్, అద్భుతమైన ఎస్‌యూవీ అయిన హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు సరికొత్త అవతారంలో రాబోతోంది. కంపెనీ ఇటీవల దీని ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్ ప్రదర్శించింది. ఇది E100 అంటే 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్‌పై వెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ మోడల్‌లో రెగ్యులర్ క్రెటాలో ఉండే 1.5 లీటర్ ఇంజిన్‌కు బదులుగా 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 

Also Read: Flex Fuel Bike: ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బైక్స్‌తో ఇంధన కొరత లేకుండా కేంద్రం చర్యలు! దేశవ్యాప్తంగా 5200 ఇథనాల్‌ బంకులు!

ఇది 118 bhp పవర్‌ క్రియేట్ చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ చిన్న, పవర్‌ఫుల్ ఇంజిన్‌ను 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింక్ చేస్తున్నారు. ఇది మీకు స్మూత్ డ్రైవింగ్‌తో పాటు, పెట్రోల్ కోసం అధిక ఖర్చుల నుండి ఊరట కలిగిస్తుంది. 

ఇథనాల్‌పై నడవనున్న టాటా పంచ్ 
మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కింగ్‌గా పేరుగాంచిన టాటా పంచ్ (Tata Punch) కూడా ఇప్పుడు ఈ రేసులో దూసుకెళ్లేందుకు రెడీ అవుతోంది. భారత్ మొబిలిటీ షోలో టాటా కంపెనీ తన 'టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్' కాన్సెప్ట్ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ వాహనంలో పాత, నమ్మకమైన 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది. దీనిని పూర్తిగా అప్‌గ్రేడ్ చేశారు.

టాటా కంపెనీ దీని ఫ్యూయల్ ఇంజెక్టర్, ఫ్యూయల్ పంప్, ఈసీయూ (ECU) సాఫ్ట్‌వేర్‌ను ఎంతగా మార్చిందంటే, ఈ ఇంజిన్ పెట్రోల్‌లో 85 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉన్న ఇంధనాన్ని (E85) సులభంగా ఉపయోగిస్తుంది. పెట్రోల్, సీఎన్‌జీ (CNG), ఈవీ తర్వాత పంచ్ మోడల్‌లో రాబోతున్న నాల్గవ, అత్యంత పొదుపైన వేరియంట్  కానుంది.

మారుతి ఫ్రాంక్స్, టొయోటా కార్లు 
ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ల ఈ జాబితాలో కేవలం హ్యుందాయ్ క్రెటా, టాటా పంచ్ మాత్రమే కాకుండా, మారుతి సుజుకికి చెందిన స్టైలిష్ క్రాస్‌ఓవర్ ఫ్రాంక్స్ (Maruti Fronx) కూడా చేరబోతోంది. మారుతి ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్‌ను కూడా చాలా త్వరలోనే ప్రొడక్షన్ రెడీ చేసి మార్కెట్లోకి తీసుకురానుంది. 

Also Read: Monsoon Bike Care: వర్షాలు పడకముందే మీ బైకులో ఈ 5 విషయాలను తప్పకుండా చెక్ చేయండి

టొయోటా కూడా ఈ రేసులో వెనుకబడి లేదు. టొయోటా తన కోరల్లా హైబ్రిడ్, దేశంలో ఎంతో ఆదరణ పొందిన ఎంపీవీ (MPV) ఇన్నోవా హైక్రాస్‌ల ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్స్ రానున్నాయి.  ఇవి 100 శాతం ఇథనాల్‌ (E100)పై నడవగలవు. ఈ కార్లన్నీ మార్కెట్లోకి వస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ పోటీ పెరగడమే కాకుండా, మధ్యతరగతి వారికి ఇంధన ఖర్చు కొంతమేర తగ్గనున్నాయి. 

Frequently Asked Questions

ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వాహనాలు ఇథనాల్‌తో నడవడం ద్వారా ఇంధన ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. ఇది మధ్యతరగతి వారికి ఆర్థిక ఊరటనిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
హీరో విడా VX2 Go FB లాంచ్.. 128km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, రేటు మీకు అందుబాటులోనే!
మహీంద్రా విజన్ S నుంచి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వరకు.. ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లు ఇవే
ఆగస్టులో కొత్త కార్ల సందడి.. మహీంద్రా, స్కోడా, ఎంజీ నుంచి న్యూ లాంచ్‌లు, మీ లైఫ్‌స్టైల్‌ పెంచే కారు ఉండొచ్చు!
కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే
కియా సెల్టోస్ HTX IVT లేదా టాటా సఫారి అడ్వెంచర్ X ప్లస్? రూ.2.5 లక్షల తేడాలో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget