క్యాబ్ డ్రైవర్లు మిమ్మల్ని పార్కింగ్ డబ్బులు అడగవచ్చా

Published by: Shankar Dukanam

మీరు బుక్ క్యాబ్ చేస్తే డ్రైవర్లు తరచుగా మీ నుండి పార్కింగ్ డబ్బులు అడుగుతుంటారు

దీనిపై తరచుగా డ్రైవర్, ప్రయాణికుల మధ్య గొడవలు కూడా జరుగుతాయి

మరి క్యాబ్ డ్రైవర్ పార్కింగ్ డబ్బులు చెల్లించాలా.. లేదా ఇక్కడ తెలుసుకోండి

డ్రైవర్ పిక్ అప్ లొకేషన్ కు వచ్చే ముందు ఎక్కడైనా కారు పార్క్ చేస్తే అది వారి వ్యక్తిగత ఖర్చుగా భావించాలి

క్యాబ్ ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్, ఆసుపత్రి వద్ద నిలిపినప్పుడు పార్కింగ్ ఫీజు చెల్లించాలి

ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులే పార్కింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది, డ్రైవర్లు ఈ మనీ అడగవచ్చు

చాలా సార్లు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా కొందరు డ్రైవర్లు టోల్ లేదా పార్కింగ్ ఛార్జీలు మిమ్మల్ని అడుగుతారు

పార్కింగ్ స్లిప్ చూడకుండా ఏ ప్యాసింజర్ కూడా అడిగినంత పార్కింగ్ ఛార్జీ చెల్లించకూడదు

ఇలాంటి సందర్భాల్లో మీరు పార్కింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు