అన్వేషించండి

Monsoon Bike Care: వర్షాలు పడకముందే మీ బైకులో ఈ 5 విషయాలను తప్పకుండా చెక్ చేయండి

Monsoon Bike Care: వర్షాకాలం ముందు బైక్ టైర్లు బ్రేకులతో పాటు బ్యాటరీ లైట్లు చైన్ చెక్ చేయాలి. మీరు చేసే చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారితీయవచ్చు.

Monsoon Bike Care | వర్షాకాలం మొదలైంది. ఎండ వేడి నుండి మనకు ఉపశమనం లభిస్తుంది. అయితే బైక్ నడిపే వారికి అనేక సమస్యలు కూడా తెస్తుంది. వర్షంలో రోడ్లు జారుడుగా మారతాయి. బైక్ పలు భాగాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో సకాలంలో బైక్‌ను తనిఖీ చేయకపోతే, మార్గమధ్యంలో బ్రేక్‌డౌన్ కావడం, స్కిడ్ అవ్వడం లేదా ప్రమాదం వంటి సమస్యలు తలెత్తవచ్చు. వర్షాలు ప్రారంభమయ్యే ముందు బైక్‌లోని ముఖ్యమైన పార్ట్స్ చెక్ చేయడం తెలివైన పని అని నిపుణులు సూచిస్తున్నారు. ఇది బైక్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, రైడర్ భద్రతను సైతం పెంచుతుంది. చాలా మంది ఇంజిన్‌పై మాత్రమే ఫోకస్ చేస్తారు. కానీ వర్షాకాలంలో టైర్లు, బ్రేక్‌లు, బ్యాటరీ, ఎలక్ట్రికల్ సిస్టమ్ కండీషన్ కూడా అంతే ముఖ్యం. చిన్న చిన్న జాగ్రత్తలే మీ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చుతాయి.  

వర్షంలో టైర్లు, బ్రేక్‌ల పని చాలా ఎక్కువగా ఉంటుంది. టైర్ల గ్రిప్ తగ్గిపోయినా లేదా ట్రెడ్ అరిగిపోయినా తడిగా ఉన్న రోడ్డుపై బైక్ స్కిడ్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల వర్షాకాలం ప్రారంభానికి ముందు టైర్ల కండీషన్ తప్పకుండా చెక్ చేయాలి. సరైన ఎయిర్ ప్రెజర్ నిర్వహించడం చాలా అవసరం. మరోవైపు బ్రేక్ సిస్టమ్ పూర్తిగా సరిగ్గా ఉండాలి. బ్రేక్ ప్యాడ్‌లు అరిగిపోయి ఉంటే, వాటిని మార్పించుకోవడానికి ఇదే సరైన సమయం. 

టైర్లు, బ్రేక్‌ల కండీషన్ చెక్ చేయండి

వర్షంలో అకస్మాత్తుగా బ్రేక్ వేయవలసి రావచ్చు, లేక బలహీనమైన బ్రేక్‌లు అకస్మాత్తుగా మిమ్మల్ని ప్రమాదాలకు గురిచేయవచ్చు. బైక్‌లో డిస్క్ బ్రేక్‌లు ఉంటే కనుక వాటిని కూడా చెక్ చేయించాలి. ఒక చిన్న సర్వీసింగ్ మిమ్మల్ని పెద్ద ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుంది. వర్షంలో ఏ బెరుకు లేకుండా బైక్ నడపడానికి హెల్ప్ చేస్తుంది. 

Also Read: Best Scooters: రోజూ ఆఫీసుకు వెళ్లే వారికి ఈ 4 స్కూటర్లు బెస్ట్, మీకు ఏది సెట్ అవుతుంది

బ్యాటరీ, లైట్లు, చైన్‌పై ఫోకస్ చేయాలి 

వర్షాకాలంలో బైక్ బ్యాటరీ, ఎలక్ట్రికల్ సిస్టమ్ సరిగ్గా ఉండటం కూడా ముఖ్యమే. బ్యాటరీ వీక్‌గా ఉంటే, వర్షంలో స్టార్ట్ చేయడంలో సమస్యలు రావచ్చు. హెడ్‌లైట్, టెయిల్‌లైట్, ఇండికేటర్లు సరిగ్గా పనిచేయాలి. బ్యాడ్ వెదర్‌లో దృశ్యమానత తగ్గుతుంది. అదనంగా, బైక్ చైన్‌ను శుభ్రంగా మరియు బాగా లూబ్రికేట్ చేసి ఉంచడం కూడా అవసరం. వర్షం, బురద కారణంగా చైన్ త్వరగా పాడైపోవచ్చు. 

క్రమం తప్పకుండా క్లీన్ చేయడం, లూబ్రికేట్ చేయడం వల్ల దాని జీవితకాలం పెరుగుతుంది. బైక్ చాలా సాఫ్ట్‌గా వెళ్తుంది. బైక్ పార్ట్స్, ఎలక్ట్రికల్ కనెక్షన్‌లను కూడా చెక్ చేయాలి. తద్వారా వర్షం నీటి కారణంగా ఏ సమస్యలు రావు. వర్షాకాలం ముందు చేసిన ఈ సన్నాహాలు మీ ప్రయాణాన్ని మరింత సేఫ్‌గా, ఇబ్బంది లేకుండా చేస్తుంది. 

Also Read: మారుతి ఫ్రాంక్స్‌ జోరు మామూలుగా లేదుగా.. కేవలం 3 సంవత్సరాల్లోనే 5 లక్షల అమ్మకాలు!

Frequently Asked Questions

వర్షాకాలంలో బైక్ తనిఖీ ఎందుకు ముఖ్యం?

వర్షంలో రోడ్లు జారుడుగా మారతాయి, బైక్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది. సకాలంలో తనిఖీ చేయకపోతే బ్రేక్‌డౌన్, ప్రమాదాలు జరగొచ్చు. ఇది బైక్ పనితీరును మెరుగుపరిచి, రైడర్ భద్రతను పెంచుతుంది.

వర్షాకాలంలో బైక్ టైర్లు, బ్రేక్‌లను ఎలా చూసుకోవాలి?

తడిగా ఉన్న రోడ్డుపై బైక్ స్కిడ్ అవ్వకుండా ఉండేందుకు టైర్ల గ్రిప్, ట్రెడ్ చెక్ చేసి సరైన ఎయిర్ ప్రెజర్ మెయింటైన్ చేయాలి. అరిగిపోయిన బ్రేక్ ప్యాడ్‌లను మార్పించాలి, డిస్క్ బ్రేక్‌లను కూడా తనిఖీ చేయించాలి.

వర్షాకాలంలో బ్యాటరీ, లైట్లు, చైన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బైక్ బ్యాటరీ వీక్‌గా ఉండకుండా చూసుకోవాలి. హెడ్‌లైట్, టెయిల్‌లైట్, ఇండికేటర్లు సరిగ్గా పనిచేయాలి. చైన్‌ను శుభ్రంగా ఉంచి, క్రమం తప్పకుండా లూబ్రికేట్ చేయాలి. ఎలక్ట్రికల్ కనెక్షన్లు కూడా చెక్ చేయాలి.

వర్షాకాలంలో బైక్ నిర్వహణ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి?

వర్షాకాలానికి ముందు బైక్‌ను తనిఖీ చేయడం వల్ల బైక్ పనితీరు మెరుగుపడుతుంది. రైడర్ భద్రత పెరుగుతుంది, తద్వారా మీ ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుతుంది. ప్రమాదాలను నివారించవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget