అన్వేషించండి

Flex Fuel Bike: ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బైక్స్‌తో ఇంధన కొరత లేకుండా కేంద్రం చర్యలు! దేశవ్యాప్తంగా 5200 ఇథనాల్‌ బంకులు!

Flex Fuel Bike:భారత్‌లో 5200 ఇథనాల్ బంకుల ఏర్పాటు దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బైక్స్ వచ్చిన తర్వాత బంకుల కొరత రాకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్రం 5200 E85 బంకులతో గ్రీన్ ఇంధనానికి పెద్దపీట వేస్తుంది.
  • హీరో స్ప్లెండర్ ఫ్లెక్స్ ఫ్యూయల్; లీటరుకు రూ.20 వరకు ఆదా.
  • ఇథనాల్ వాడకంతో కాలుష్యం 77% తగ్గుతుంది, దిగుమతులు తగ్గుతాయి.

Flex Fuel Bike:భారత్‌ ఇంధన మార్కెట్‌లో ఒక భారీ మార్పునకు రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వం మన వాడుతున్న పెట్రోల్‌ ధరలతో పోలిస్తే, ఇథనాల్ ధర సామాన్యుడికి ఎంతో ఊరటనిచ్చేలా ఉంది. అందుకే మౌలిక సదుపాయాల విస్తరణ వేగవంతమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 5200 E85 బంకులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వాహనదారుల ఖర్చును తగ్గించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. 

85 శాతం ఇథనాల్‌తో పెట్రోల్

ఇప్పటి వరకు మనం కేవలం పెట్రోల్ లేదా డీజిల్‌ వాహనాలపైనే ఆధారపడ్డాం. కానీ ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ కాలం మొదలైంది. ఫ్లెక్స్‌ ఫ్యూయల్ అంటే ఒకే ఇంజిన్‌తో పెట్రోల్, ఇథనాల్‌ మిశ్రమాలను వాడుకునే వెసులుబాటు, హీరో మోటోకార్ప్‌ దీనిని స్ప్లెండర్‌ ప్లస్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్ప్లెండర్‌ ప్లస్‌ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ మోడల్‌, 85 శాతం ఇథనాల్‌ కలిగిన ఇంధనంతో కూడా సునాయాసంగా నడుస్తోంది. 

లీటర్‌పై 20 రూపాయలు ఆదా

పెట్రోల్‌ ధరల సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ ఒక గొప్ప పరిష్కారంగా కనిపిస్తోంది. ఢిల్లీలో పెట్రోల్‌ ధర వంద దాటి ఉండగా, E85 ఇంధన ర కేవలం 82.12గా ఉంది. అంటే ప్రతి లీటరుకు రూ.20 వరకు ఆదా అవుతుంది. 

కాలుష్యం 77 శాతం తగ్గుదల

మరో ప్రధాన కారణం పర్యావరణం. ఇథనాల్‌ వాడకం వల్ల కాలుష్య కారకాలు దాదాపు 77 శాతం వరకు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. రైతుల నుంచి సేకరించిన వ్యవసాయ వ్యర్థాలతో ఈ ఇంధనం తయారవుతోంది. దీని వల్ల మన దేశ ముడి చమురు దిగుమతులు కూడా భారీగా తగ్గుతాయి.

జులై 26 నుంచి హీరో స్ప్లెండర్‌ ప్లస్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్

ఈ మార్పు ప్రక్రియ ఇప్పటికే వేగం పుంజుకుంది. హీరో స్ప్లెండర్‌ ప్లస్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌ జులై 26 నుంచి డెలివరీ కానుంది. దీనికి తగ్గట్టుగానే 5200 బంకుల ఏర్పాటు కార్యక్రమం త్వరలో వివిధ నగరాల్లో ప్రారంభకానుంది. ఢిల్లీలో ఇప్పటి వరకు మొదటి పంప్‌ అందుబాటులోకి వచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా వీటి విస్తరణ మొదట జరగనుంది. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ బలపడుతుంది. 

కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు తక్కువే 

సాధారణంగా బైక్‌లో కేవలం ఇథనాల్ పోస్తే ఇంజిన్ పాడవుతుంది. కానీ హీరో స్ప్లెండర్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ కోసం ప్రత్యేక మార్పులు చేసింది. ఇంజిన్ లోపల ఉండే 36 విడిభాగాలను ఇథనాల్‌కు తట్టుకునేలా రీ డిజైన్ చేశారు. ఇందులో స్మార్ట్ ఈసీయూ టెక్నాలజీ అమర్చారు. మీరు ట్యాంక్‌లో పెట్రోల్ పోసినా లేదా ఇథనాల్ పోసినా, ఈ ఈసీయూ ఇంధన నాణ్యతను గుర్తించి పవర్‌ను అడ్జస్ట్ చేస్తుంది. మైలేజీ విషయంలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, ఇంధనం ధర తక్కువ కాబట్టి కిలోమీటర్లకు అయ్యే ఖర్చు పెట్రోల్‌ కంటే తక్కువే ఉంటుంది. 

భారత్ ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2026 నాటికి 20 శాతం మిశ్రమం లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది. కానీ E85 టెక్నాలజీ అనేది దానికి ఒక మెట్టు పైస్థాయి. దీని కోసం హీరో మోటోకార్ప్‌ వంటి సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాయి. హీరో స్ప్లెండర్‌ ప్లస్‌ ధర సాధారణ మోడ్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఇది లాభదాయకం. భవిష్యత్‌లో కేవలం స్ప్లెండర్‌ మాత్రమే కాదు, ఇతర కమ్యూటర్‌ బైక్‌లు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.

సామాన్యుడికి ఎంత లాభం?

సామాన్యుడికి దీని వల్ల లాభమనే చెప్పాలి. పెట్రోల్ ధరలు అస్థిరంగా ఉన్న తరుణంలో, ఇథనాల్ స్థిరమైన ధరను అందిస్తుంది. ప్రతి రోజూ 50 కిలోమీటర్లు తిరిగే వ్యక్తికి కనీసం 300 రూపాయలు నుంచి 500 రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. 
 

Frequently Asked Questions

కొత్తగా వస్తున్న E85 ఇంధనం అంటే ఏమిటి?

ఇది 85 శాతం ఇథనాల్ కలిగిన ఇంధనం. పెట్రోల్‌తో పోలిస్తే ధర తక్కువగా ఉండటంతో పాటు, కాలుష్యాన్ని 77% తగ్గిస్తుంది.

E85 ఇంధనం వాడటం వల్ల వాహనదారులకు ఎంత ఆదా అవుతుంది?

ఢిల్లీలో లీటరుకు దాదాపు రూ.20 ఆదా అవుతుంది. రోజూ 50 కి.మీ. ప్రయాణించే వారికి నెలకు రూ.300-500 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.

E85 ఇంధనం కోసం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తాయి?

హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ జూలై 26 నుండి డెలివరీ కానుంది. దేశవ్యాప్తంగా 5200 E85 బంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

టాప్ హెడ్ లైన్స్

మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget