అన్వేషించండి

Hero Splendor Plus Flex Fuel vs Hero HF Deluxe Flex Fuel: స్ప్లెండర్‌ ప్లస్‌ vs హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ ఫ్లెక్స్‌ ప్యూయల్‌! రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటీ?

హీరో మోటోకార్ప్‌ దేశీయంగా తొలి 100సీసీ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైకులను విడుదల చేసింది. స్ప్లెండర్‌ ఫ్లస్‌ , హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ మోడళ్ల ధర, ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యాల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు తెలుసుకోండి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు కాలుష్యం, ఇంధన ఖర్చులు తగ్గిస్తాయి.
  • స్ప్లెండర్ ప్లస్ i3S, USB ఛార్జింగ్ అదనపు ఫీచర్లు అందిస్తుంది.
  • E85 ఇంధనంతో ఎక్కువ శక్తి, మొదట కొన్ని ప్రాంతాల్లో విడుదల.

Hero Splendor Plus Flex Fuel vs Hero HF Deluxe Flex Fuel: భారతీయ రోడ్లపై అత్యధికంగా కనిపించే హీరో బైకులు ఇప్పుడు సరికొత్త రూపంలో వచ్చాయి. పర్యావరణహితమైన ఇంధనంతో నడిచే తొలి 100సీసీ బైకులను హీరో మోటోకార్ప్‌ పరిచయం చేసింది. స్ప్లెండర్‌ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌, హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ పేర్లతో వచ్చిన ఈ బైకులు, సాంకేతికంగా దేశంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. చూడటానికి ఇవి పాత బైకుల్లాగే అనిపించినా, వీటి ఇంజిన్ లోపల భారీ మార్పులు జరిగాయి. ముఖ్యంగా ఇవి ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌తో నడుస్తాయి. 

కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, ఇంధన ఖర్చులను ఆదా చేయడం ఈ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌బైకుల ప్రధాన ఉద్దేశం. భారత్‌ ఇంధన స్వయంగా సమృద్ధి దిశగా వేస్తున్న అడుగులో ఇది భాగం. సాధారణ పెట్రోల్‌ ధరతో పోలిస్తే ఇథనాల్‌ ధర తక్కువగా ఉండటం వల్ల సామాన్యులకు ఇది దీర్ఘకాలంలో లాభదాయకంగా మారుతుంది. అందుకే హీరో ఈ వినూత్న ప్రయత్నం చేసింది.

ధర వియానికి వస్తే హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ ఫ్లెక్స్‌ ఫ్యూల్ హైదరాబాద్‌ ఎక్స్ షోరూమ్‌ ధర 88,296రూపాయలుగా ఉఁది. ప్రతిష్టాత్మకమైన స్ప్లెండర్‌ ప్లస్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ధర 98,584 రూపాయలుగా నిర్ణయించారు అంటే దాదాపు పదివేల రూపాయలు తేడా ఉంది. బడ్జెట్ ముఖ్యం అనుకునే వారికి హెచ్‌ఎఫ్‌డీలక్స్‌ సరైన ఎంపిక అవుతుంది. అయితే అదనపు ఫీచర్లు కోరుకునే వారు స్ప్లెండర్‌ వైపు చూడవచ్చు. 

డిజైన్‌లో తేడాలు 

ఈ రెండు బైకులు ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమయ్యాయి. కానీ స్ప్లెండర్‌ ప్లస్‌ పొడవు హెచ్‌ఎఫ్‌డీలక్సక్ కంటే కొంచెం ఎక్కువ. సీటు ఎత్తులో ప్రధాన వ్యత్యాసం కనిపిస్తుంది. స్ప్లెండర్‌ సీటు ఎత్తువ 785mm కాగా, హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ 805mmగా ఉంది.  పొట్టిగా ఉన్న  రైడర్లకు స్ప్లెండర్‌ ప్లస్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎత్తు ఉన్నవారు హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ను ఎంచుకోవచ్చు. లుక్స్ పరంగా స్ప్లెండర్‌ ప్లస్ దాని ఐకానిక్‌ బాక్సీ షేప్‌తో ప్రీమియంగా కనిపిస్తుంది. హెచ్‌ఎఫ్‌ డీల్స్‌ కొంచెం యాంగ్యులర్‌, సింపుల్‌ డిజైన్‌తో ఉంటుంది. రెండు బైకులు కూడా  బ్లాక్‌విత్ లైమ్‌ ఎల్లో గ్రాఫిక్స్‌తో కొత్త కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. 

స్ప్లెండ్‌ ప్లస్‌ ఎందుకు ప్రత్యేకం?

ఫీచర్ల విషయంలో స్ప్లెండ్‌ ప్లస్ పైచేయి సాధిస్తుంది. ఇందులో హీరో పేటెంట్‌ కలిగిన ఐ3ఎస్‌  టెక్నాలజీ ఉంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద బైక్ ఆగిపోయినప్పుడు ఇంజిన్ దానంతట అదే ఆగిపోతుంది. మళ్లీ క్లచ్‌ నొక్కగానే స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్యూయల్‌ను ఆదా చేస్తుంది. అంతేకాకుండా, స్ప్లెండర్‌ ప్లస్‌లో యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌ కూడా ఇచ్చారు. దీని వల్ల ప్రయాణంలో మొబైల్‌ ఫోన్ ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌లో ఈ రెండు ఫీచర్లు లేవు. బడ్జెట్‌ను తగ్గించడానికి హీరో ఈ నిర్ణయం తీసుకున్నట్టు  కనిపిస్తోంది. 

ఇంజిన్ సామర్థ్యం

ఈ రెండు బైకుల్లో 97.2సిసి, 4-స్ట్రోక్‌, సింగిల్ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ అమర్చారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇవి ఈ-85 ఇంధనంపై నడుస్తున్నప్పుడు సాధారణ పెట్రోల్‌ బైకుల కంటే ఎక్కువ శక్తినిస్తాయి. పవర్‌ 7 శాతం పెరిగి 8.5పీఎస్‌కు చేరగా, టార్క్‌ 3 శాతం పెరిగి 8.3Nmకు చేరుకుంది. దీని వల్ల సిటీ ట్రాఫిక్‌లో బైక్ నడపడం మరింత సులభంగా, వేగంగా మారుతుంది. 4-స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఎప్పటిలాగే స్మూత్‌గా ఉంటుంది. 

హ్యాండ్లింగ్‌, సేఫ్టీ

రెండు మోడళ్లలో ట్యూబ్యులర్‌ డబుల్‌ క్రాడిల్‌ ఫ్రేమ్‌ ఉపయోగించారు. దీని వల్ల బైక్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్‌ ఫోర్స్‌, వెనుక భాగంలో ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ఇవి గుంతల రోడ్లపై కూడా సుఖవంతమైన ప్రయాణాన్నిస్తాయి. వెనుక  బ్రేక్ వేసినప్పుడు ఆటోమేటిక్‌గా ముందు బ్రేక్‌ కూడా కొంత అప్లై అవుతుంది. ఇది జారిపోకుండా అదనపు భద్రతను ఇస్తుంది. రెండు బైకులకు 18-అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు అందించడం మరో విశేషం.

ప్రస్తుతానికి ఇథనాల్ ఇంధనం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనే ఈ బైకులు మొదట విడుదలకానున్నాయి. తొలి విడతగా ఢిల్లీ, మహారాష్ట్రలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇవి అమ్మకానికి వస్తాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఇథనాల్‌ బంకులు పెరిగే కొద్దీ ఈ బైకులు అన్ని చోట్లా అందుబాటులోకి వస్తాయి. హీరో మోటోకార్ప్‌ ఈ బైకులపై ఐదేళ్లు లేదా 70వేల కిలోమీటర్ల వరకు వారంటీని అందిస్తోంది. మీకు బడ్జెట్‌ చాలా ముఖ్యం. తక్కువ ధరలో ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ టెక్నాలజీ కావాలనుకుంటే హెచ్‌ఎఫ్‌ డీలక్స్ బెస్ట్ ఆప్షన్. ఒక వేళ మీరు 10 వేలు అదనంగా ఖర్చు చేయగలిగితే, ఐ3ఎస్‌ టెక్నాలజీ, యూఎస్‌బీ ఛార్జింగ్‌, స్ప్లెండర్‌ అనే బ్రాండ్ ఇమేజ్‌ లభిస్తాయి.

Frequently Asked Questions

హీరో విడుదల చేసిన కొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ల ప్రత్యేకత ఏమిటి?

ఇవి పర్యావరణహితమైన ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E85) తో నడిచే తొలి 100సీసీ బైక్‌లు. ఇవి కాలుష్యాన్ని తగ్గించి ఇంధన ఖర్చులను ఆదా చేస్తాయి.

స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హెచ్‌ఎఫ్‌ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మధ్య ధరల తేడా ఎంత?

హెచ్‌ఎఫ్‌ డీలక్స్ ధర సుమారు 88,296 రూపాయలు కాగా, స్ప్లెండర్ ప్లస్ ధర 98,584 రూపాయలు. రెండిటి మధ్య దాదాపు పదివేల రూపాయల తేడా ఉంది.

స్ప్లెండర్‌ ప్లస్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లోని అదనపు ఫీచర్లు ఏమిటి?

స్ప్లెండర్‌ ప్లస్‌లో హీరో పేటెంట్‌ కలిగిన ఐ3ఎస్‌ టెక్నాలజీ, యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌ ఉన్నాయి. ఇవి ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు సౌలభ్యాన్ని అందిస్తాయి.

ఇథనాల్‌తో నడిచే ఈ బైకుల ఇంజిన్‌ సామర్థ్యం ఎలా ఉంటుంది?

ఈ-85 ఇంధనంపై నడుస్తున్నప్పుడు, ఇంజిన్ పవర్ 7% పెరిగి 8.5పీఎస్‌కు, టార్క్ 3% పెరిగి 8.3Nmకు చేరుకుంటుంది. ఇది సిటీ ట్రాఫిక్‌లో వేగంగా, సులభంగా నడపడానికి తోడ్పడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Triumph నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్! అక్టోబర్‌ 6న ఏం జరగబోతోంది?
అక్టోబర్‌ 6.. కుర్రాళ్ల కోసం దసరా ముందే వస్తోంది, వెయిట్‌ అండ్‌ వాచ్‌!
EV మార్కెట్‌లో మరోసారి సత్తా చాటిన Tata Motors.. Kia దెబ్బకు Marutiకి భారీ షాక్!
జనం ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్‌ కార్లు ఈ కంపెనీవే.. ఇతర బ్రాండ్ల వైపు కన్నెత్తి చూడడం లేదు!
Skoda Slavia Facelift EMI: నెలకు సుమారు రూ.14 వేలు కట్టి ఈ ప్రీమియం సెడాన్‌ను సొంతం చేసుకోండి!
Skoda Slavia Facelift ఆన్‌రోడ్‌ రేటు ఎంత పడుతుంది? కార్‌ లోన్‌ ఎంత వస్తుంది?
కొత్త గేర్‌బాక్స్, 360 డిగ్రీ కెమెరా, రియర్ సీట్ మసాజ్.. Skoda Slavia Faceliftలో ఇంకా ఏం మారిందంటే?
Skoda Slavia Facelift: చిన్న మార్పులు, పెద్ద ప్రభావం.. ఇప్పుడు మరింత మోడ్రన్‌గా!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget