అన్వేషించండి

Hero Splendor Plus Flex Fuel:హీరో స్ప్లెండర్‌ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ వినియోగదారుడి జేబుకు ఎంత మేలు చేస్తుంది?

Hero Splendor Plus Flex Fuel:హీరో మోటోకార్ప్‌ తన ఐకానిక్‌ స్ప్లెండర్‌ ప్లస్‌, హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌లను ఫ్లెక్స్‌- ఫ్యూయల్‌ వెర్షన్‌లలో లాంచ్ చేసింది. వీటి వల్ల వినియోగదారుడికి ఎలాంటి మేలు జరుగుతుంది?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ప్లెండర్ బైక్‌లు ఢిల్లీలో ఆవిష్కృతం.
  • E85 ఇథనాల్‌తో ఇవి ఇంధన వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
  • పర్యావరణ కాలుష్యం తగ్గి, రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుంది.
  • జులై 26 నుంచి లభ్యత, బంకుల సంఖ్య పెరుగుతుంది.

Hero Splendor Plus Flex Fuel:భారత్‌ రవాణా రంగంలో కేవలం ఖరీదైన కార్లు లేదా ప్రయోగాత్మక వాహనాలకే పరిమితమైన ప్రత్యామ్నాయ ఇంధన టెక్నాలజీ ఇప్పుడు సామాన్యుడి ముంగిటకు చేరింది. దేశంలో ప్రతి ముగ్గురిలో ఒక వాడే అత్యంత ప్రజాదరణ పొందిన హీరోస్ప్లెండర్ ప్లస్‌, హెచ్‌ఎఫ్‌ డీల్స్‌ బైక్‌లు ఇప్పుడు ఫెక్స్‌ ఫ్యూయల్‌ అవతారమెత్తాయి. 

కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ సమక్షంలో జూన్ 3న న్యూఢిల్లీ వేదికగా ఈ వాహనాలను హీరో మోటోకార్ప్‌ ఆవిష్కరించింది. దేశీయ ఇంధన భారాన్ని తగ్గించి, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా పడిన ఈ అడుగు, ద్విచక్ర వాహన రంగంలో సరికొత్త శకానికి నాందిపలికింది. 

ఏంటీ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్‌

సాధారణంగా మనం వాడే పెట్రోల్‌లో ఇప్పుడు పది శాతం నుంచి ఇరవై శాతం వరకు ఇథనాల్‌ను కలుపుతారు. కానీ హీరో తీసుకువచ్చిన ఈ సరికొత్త స్ప్లెండర్‌ ప్లెస్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌, ఏకంగా 85 శాతం ఇథనాల్ మిశ్రమంతో నడుస్తుంది. 

ఇందులో వాడే ఇంధనం పెట్రోల్‌, ఇథనాల్‌ కలయిక. అంటే మీరు ట్యాంక్‌లో పెట్రోల్ పోసినా, లేదా ఎక్కువ ఇథనాల్ ఉన్న మిశ్రమాన్ని పోసినా, ఈ బైక్ ఇంజిన్ దానంతట అదే గ్రహించి సాఫీగా నడుస్తుంది. ఇది వినియోగదారులకు ఇంధన ఎంపికలో పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. 

మార్పునకు కారణం ఏంటీ?

ఈ మార్పు వెనుక బలమైన ఆర్థిక, పర్యావరణ కారణాలు ఉన్నాయి. భారత్ టా దాదాపు 120 బిలియన్ డాలర్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇథనాల్‌ వాడకం పెరిగితే, ఈ భారం తగ్గి దేశ ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ఈ85 ఇంధనంపై నడిచినప్పుడు, ఈ బైక్‌ కార్బన్ మోనాక్సైడ్‌ ఉద్గారాలను 77 శాతం వరకు తగ్గిస్తుంది. అలాగే హైడ్రోకార్బన్ల ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారు చేస్తారు. దీని వల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా, పొలాల్లో వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే కాలుష్యం కూడా తగ్గుతుంది. 

ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఎలా పని చేస్తుంది?

స్ప్లెండర్‌ ఇంజిన్ పాతదే కదా, కేవలం ఇంధనం మార్చితే సరిపోతుందా అంటే కాదనే చెప్పాలి. ఇథనాల్‌ స్వభావం పెట్రోల్‌ కంటే భిన్నంగా ఉంటుంది. ఇథనాల్‌ రసాయనపరంగా మెటల్‌, రబ్బర్‌ బాగాలను త్వరగా తుప్పుపట్టేలా చేస్తుంది. 

దీనిని అధిగమించడానికి హీరో ఇంజనీర్లు దాదాపు 36 విడిభాగాలను పూర్తిగా రీడిజైన్ చేశారు. ఇంధన పైపులు, సీల్స్‌ ట్యాంక్‌ కోటింగ్‌లను ఇథనాల్‌కు తట్టుకునేలా మార్చారు. ఇథనాల్‌లో పెట్రోల్‌ కంటే తక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఇంధనాన్ని ఇంజిన్‌లోకి పంపడానికి కొత్త పంపును అమర్చారు ఈ బైక్‌లోని కంప్యూటర్‌ ట్యాంక్‌లోని ఇంధన నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో గుర్తించి, దానికి తగ్గట్టుగా స్పార్క్‌ టైమింగ్‌ మారుస్తుంది. 

హీరో స్ప్లెండర్‌ ప్లస్‌ ఎప్పుడు ఎక్కడా లభిస్తుంది?

హీరో స్ప్లెండర్‌ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ డెలివరీలు జులై 26న నుంచి ప్రారంభంకానున్నాయి. మొదటి దశలో ఢిల్లీలో, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తారు. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని షోరూమ్‌లలో ఇవి లభించనున్నాయి. 

సామాన్యుడికి ఎంత లాభం 

సామాన్యుడికి అత్యంత ముఖ్యమైంది బైక్ ధర, మైలేజీ. ఢిల్లీలో దీని ఎక్స్‌షోరూమ్‌ ధర 82,810. ఇది సాధారణ మోడల్ కంటే సుమారు 2, 479 నుంచి 5200 వరకు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర 102.12 ఉండా, ఈ85 ఇంధనం ధర కేవలం 82.12రూపాయలు మాత్రమే. అంటే లీటర్‌్కు ఇరవై రూపాయలు ఆదా అవుతుంది. 

ఇథనాల్ శక్తి తక్కువ కాబట్టి మైలేజీ కొంచెం తగ్గుతుంది. పెట్రోల్‌పై 70కిలోమీటర్లు ఇచ్చే స్ప్లెండర్‌, ఈ85పై సుమారు 62కిలోమీటర్ మైలేజీ ఇస్తుంది. పెట్లోల్ వాహనం అయితే ప్రతి కిలోమీటర్‌కు 1.45 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఫ్లెక్స్ ఫ్యూయల్ అయితే కిలోమీటర్‌కు 1.32 రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకు 1500 కిలోమీటర్లు ప్రయాణించే వారికి సుమారు రెండు వందలు ఆదా అవుతుంది. 

ఫ్లెక్స్‌ఫ్యూల్ బైక్‌లో స్పెసిఫికేషన్స్‌ ఏంటీ?

ఈ బైక్‌ కేవలం టెక్నాలజీ పరంగానే కాకుండా, లుక్స్ పరంగా కూడా అప్‌గ్రేడ్ అయ్యింది. 97.2cc, సింగిల్ సిలిండర్‌, 4స్ట్రోక్‌ ఇంజిన్ కలిగి ఉంది. పెట్రోల్ కంటే ఇథనాల్‌పై నడిచినప్పుడు ఏడు శాతం ఎక్కువ పవర్ లభిస్తుంది. ఆల్‌ బ్లాక్‌ ఫినిష్‌తోపాటు కొత్త లైమ్‌ ఎల్లో గ్రాఫిక్స్‌ బైక్‌కు ప్రత్యేక గుర్తింపునిస్తాయి. డిజిఅనలాగ్‌ క్లస్టర్‌, సైడ్‌ స్టాండ్‌ ఇంజిన్ కట్‌-ఆఫ్‌, యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఐదేళ్ల లేదా 70కిలోమీటర్ల వరకు వారంటీ హీరో సంస్థ అందిస్తోంది. 

బంకుల లభ్యత సంగతి ఏంటీ?

బైక్ అయితే కొంటాం కానీ ఇథనాల్‌ బంకులు ఎక్కడ ఉన్నాయి అనే అనుమానం చాలా మందికి వస్తుంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో మొదటి ఈ85 బంక్ ప్రారంభించింది. 2026 నాటికి దేశవ్యాప్తంగా 500 బంకులు, 2027నాటికి ఐదువేల బంకులు, చివరికి దేశవ్యాప్తంగా యాభైవేల బంకులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా పాత బీఎస్‌6 బైక్‌లను కూడా ఇథనాల్‌తో నడిచేలా మార్చుకునేందుకు రెట్రోఫిట్ కిట్స్‌ను కూడా హీరో అభివృద్ధిచేస్తోంది. 

Frequently Asked Questions

ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏమిటి?

ఫ్లెక్స్ ఫ్యూయల్ అనేది 85 శాతం ఇథనాల్ మిశ్రమంతో నడిచే ఇంధనం. ఈ బైక్ ఇంజిన్ పెట్రోల్ లేదా ఎక్కువ ఇథనాల్ ఉన్న మిశ్రమాన్ని గ్రహించి, దానంతట అదే సర్దుబాటు చేసుకుని నడుస్తుంది. ఇది వినియోగదారులకు ఇంధన ఎంపికలో పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

దేశీయ ముడి చమురు దిగుమతి భారాన్ని తగ్గించి, వేల కోట్ల రూపాయలు ఆదా చేయడం ప్రధాన లక్ష్యం. అలాగే, కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలను 77% వరకు తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం అందించడం దీని ఉద్దేశ్యం.

హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ సాంకేతికంగా ఎలా పని చేస్తుంది?

ఇథనాల్‌కు తట్టుకునేలా 36 విడిభాగాలను రీడిజైన్ చేశారు. కొత్త పంపు ఎక్కువ ఇంధనాన్ని పంపుతుంది. బైక్‌లోని కంప్యూటర్ ఇంధన నాణ్యతను పర్యవేక్షించి, స్పార్క్ టైమింగ్‌ను సర్దుబాటు చేస్తుంది.

E85 ఇంధన బంకుల లభ్యత ప్రస్తుతం మరియు భవిష్యత్తులో ఎలా ఉంటుంది?

ప్రస్తుతం ఢిల్లీలో మొదటి E85 బంక్ ప్రారంభించారు. 2026 నాటికి 500 బంకులు, 2027 నాటికి 5 వేల బంకులు, చివరికి దేశవ్యాప్తంగా 50 వేల బంకులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

టాప్ హెడ్ లైన్స్

Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget