Tata Nexon నుంచి Hyundai Venue వరకు: 24 Km మైలేజ్ & ADAS సూట్ ఉన్న ఈ SUVలకు హై డిమాండ్
Sub 4m SUV Sales 2025: ఆగస్టు 2025 లో కొన్ని SUVలను దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా కొన్నారు. ఏ SUVలకు డిమాండ్ పెరిగింది, వేటికి తగ్గిందో తెలుసుకుందాం.

High Mileage ADAS Feature SUVs India 2025: కాంపాక్ట్ SUVలు లేదా సబ్-4m SUVలకు ఇప్పుడు మన దేశంలో ఫుల్ డిమాండ్ ఉంది. అందుబాటు ధర, మంచి ఫీచర్లు & అద్భుతమైన మైలేజ్ కారణంగా ఈ కార్లకు కస్టమర్లు ఎగబడి కొంటున్నారు. ఈ విభాగంలో, టాటా నెక్సాన్ నుంచి హ్యుందాయ్ వెన్యూ వరకు చాలా పాపులర్ వెహికల్స్ ఉన్నాయి. అయితే, ఆగస్టు 2025 డేటా ప్రకారం, ఈ విభాగంలో కొన్ని వాహనాల అమ్మకాలు పెరిగాయి, మరికొన్ని గణనీయంగా తగ్గాయి.
అగ్రస్థానంలో Tata Nexon
ఆగస్టు 2025లో, టాటా నెక్సాన్, దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడైన SUV. గత నెలలో ఈ కారును 14,004 మంది కొత్త కస్టమర్లు కొనుగోలు చేశారు. ఏడాది క్రితంతో, అంటే ఆగస్టు 2024తో పోలిస్తే ఇది 14% ఎక్కువ అమ్మకాలు. తెలుగు రాష్ట్రాల్లో, టాటా నెక్సాన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹7,32,000. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా & ADAS ఫీచర్లు దీనిలో ఉన్నాయి. బేస్ మోడల్‌లో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తున్నారు. ముఖ్యంగా, CNG వేరియంట్ కిలోకు 24 km వరకు మైలేజీ అందిస్తుంది.
రెండో స్థానంలో Maruti Brezza
ఆగస్టు 2025 అమ్మకాల పరంగా మారుతి బ్రెజ్జా రెండో స్థానంలో నిలిచింది, ఆ నెలలో 13,620 మంది కొత్త కస్టమర్లు ఈ కారుకు ఓనర్లు అయ్యారు. అయితే, ఏడాది ప్రాతిపదికన (ఆగస్టు 2024తో పోలిస్తే) ఈ సంఖ్య 19,190 యూనిట్ల నుంచి తగ్గింది. ఇది ఈ సంవత్సరం 29% తగ్గుదలను సూచిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మారుతి బ్రెజ్జా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹8,25,900.
మూడో స్థానంలో Maruti Fronx
మారుతి ఫ్రాంక్స్ కూపే-స్టైల్ డిజైన్ ఆగస్టు 2025లో 12,422 కస్టమర్ కొనుగోళ్లను చూసింది. ఆగస్టు 2024లో దీని అమ్మకాలు 12,387 యూనిట్లు, ఈ ఏడాది స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో మారుతి ఫ్రాంక్స్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹6,84,900.
Tata Punch & Punch EV
గత నెలలో టాటా పంచ్ & పంచ్ EV అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఆగస్టు 2025లో మొత్తం 10,704 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఆగస్టు 2024లో 15,643 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది ఈ ఏడాది 31% తగ్గుదలను సూచిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹5,49,990 & పంచ్ EV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹9,99,000.
టాప్ 5లో Hyundai Venue
హ్యుందాయ్ వెన్యూ అమ్మకాలు తగ్గాయి, కానీ అది ఇప్పటికీ టాప్ 5 లోనే ఉంది. ఆగస్టు 2025లో 8,109 మంది కస్టమర్లు దీనిని కొనుగోలు చేశారు, ఆగస్టు 2024లో 9,085 యూనిట్లను సొంతం చేసుకున్నారు. ఇది 10% తగ్గుదలను సూచిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మారుతి బ్రెజ్జా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹7,26,381.
ఆగస్టు 2025 SUV అమ్మకాలు, మరిన్ని వివరాలు:
7,741 యూనిట్లు Kia Sonet
5,521 యూనిట్లు Mahindra XUV 3XO
5,061 యూనిట్లు Hyundai Exter
3,099 యూనిట్లు Skoda Kylaq
2,683 యూనిట్లు Toyota Taisor
1,384 యూనిట్లు Nissan Magnite
910 యూనిట్లు Renault Kiger
603 యూనిట్లు Maruti Jimny
308 యూనిట్లు Kia Syros
మీరు కొత్త కారు కొనాలని భావిస్తుంది, ప్రస్తుతం ఇండియాలో క్రేజ్ ఉన్న ఈ కాంపాక్ట్ SUVల నుంచి ఒకదానిని ఎంచుకోవచ్చు.





















