అన్వేషించండి

2022 Maruti Suzuki WagonR Tour H3: 25.4 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కారు - రూ.6 లక్షలలోపే - మారుతి సుజుకి సూపర్ కారు వచ్చేసిందిగా!

ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి 2022 వాగన్ఆర్ టూర్ హెచ్3ని మనదేశంలో లాంచ్ చేసింది.

2022 మారుతి సుజుకి వాగన్ఆర్ టూర్ హెచ్3 మనదేశంలో లాంచ్ అయింది. ఈ కొత్త మోడల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఒకటి పెట్రోల్ వేరియంట్ కాగా... మరోటి సీఎన్‌జీ వేరియంట్. మారుతి వాగన్ఆర్ టూర్ హెచ్3 పెట్రోల్ వేరియంట్ ధరను రూ.5.39 లక్షలుగా నిర్ణయించారు. ఇక సీఎన్‌జీ వెర్షన్ ధర రూ.6.34 లక్షలుగా ఉంది. ఇవి రెండూ ఢిల్లీ ఎక్స్-షోరూం ధరలే.

ఈ కారు రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. సిల్కీ సిల్వర్, సుపీరియర్ వైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి ఈ కారును స్టైలిష్‌గా డిజైన్ చేసింది. ఇందులో బాడీ కలర్డ్ బంపర్లు, బ్లాక్డ్ ఔట్ ఓఆర్వీఎమ్‌లు, వీల్ సెంటర్ క్యాప్ వంటివి ఉన్నాయి.

కారు లోపల కంపెనీ పూర్తిగా కొత్త ఇంటీరియర్‌ను అందించింది. డ్యూయల్ కోర్ ఇంటీరియర్లు, ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్స్, డ్రైవర్ వైపు సన్ విజర్, టికెట్ హోల్డర్, రెండు వరుసల్లోనూ హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి. దీంతోపాటు ముందువైపు పవర్ విండోస్, సైడ్ ఆటో డౌన్ ఫంక్షన్, మాన్యువల్ ఏసీ, రిక్లైనింగ్, ఫ్రంట్ స్లైడింగ్ సీట్లు, వెనకవైపు పార్సిల్ ట్రే కూడా అందించారు.

ఇక సేఫ్టీ విషయానికి వస్తే... 2022 మారుతి సుజుకి టూర్ హెచ్3లో సెంట్రల్ డోర్ లాకింగ్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్పీడ్ లిమిటింగ్ ఫంక్షన్, వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఈ కారులో 1.0 లీటర్ కే10సీ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది 5,500 ఆర్‌పీఎం వద్ద 64 బీహెచ్‌పీని, 3,500 ఆర్‌పీఎం వద్ద 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది.

దీని సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా ఇదే ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 5,300 ఆర్‌పీఎం వద్ద 56 బీహెచ్‌పీని, 3,400 ఆర్‌పీఎం వద్ద 82 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉండనుంది. ఈ మారుతి సుజుకి వాగన్ఆర్ టూర్ హెచ్3 పెట్రోల్ వేరియంట్ 25.4 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. ఇక సీఎన్‌జీ మోడల్ కేజీకి 34.73 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

టాప్ హెడ్ లైన్స్

Toyota Innova Hycross Faceliftలో ఏ వేరియంట్ కొనాలి? E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్‌, రూ.19.59 లక్షల నుంచి ధరలు
2026 Toyota Innova Hycrossలో 4 వేరియంట్లు.. ఏ వేరియంట్‌ కొంటే 'పైసా వసూల్‌'?
2026 Toyota Innova Hycross ఫేస్‌లిఫ్ట్‌లో భారీ మార్పులు.. 12.3 అంగుళాల స్క్రీన్లు, కొత్త లుక్, హైబ్రిడ్ మోడల్‌
Toyota Innova Hycross ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ, 22.58km మైలేజీ!
Ultraviolette X-47 Venom డెలివరీలు ప్రారంభం.. 17 కిలోల తక్కువ బరువు, 20km అదనపు రేంజ్!
Ultraviolette X-47 Venom డెలివెరీలు స్టార్ట్‌.. ప్రత్యేకతలు చాలా! మీరు బుక్‌ చేశారా?
Driving Licence Renewal: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోందా? ఇంట్లోనే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోండి.. కేవలం 12 స్టెప్స్‌లో!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget