By: ABP Desam | Updated at : 14 Jul 2022 10:02 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
హ్యుండాయ్ కొత్త టక్సన్‌ను కంపెనీ రివీల్ చేసింది.
హ్యుండాయ్ మనదేశంలో కొత్త టక్సన్ కారును తీసుకువచ్చింది. క్రెటా, అల్కజార్‌లను మించే స్థాయిలో ఫ్లాగ్ షిప్ ఫీచర్లతో ఈ కారు లాంచ్ కానుంది. మనదేశంలో హ్యుండాయ్ విక్రయించే వెర్షన్ పెద్ద వీల్ బేస్‌ను అందించనున్నారు.
ఈ టక్సన్ కొత్త తరం డిజైన్‌తో రానుంది. ఇందులో 18 అంగుళాల అలోయ్ వీల్స్‌ను కూడా కంపెనీ అందించింది. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ కారులో ఉంది. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఎన్నో లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ టోన్ క్లైమెట్ కంట్రోల్, ఫుల్లీ డిజిటల్ డయల్స్, 360 డిగ్రీ కెమెరా, బోస్ ఆడియో సిస్టం, రెండో వరుస సీట్లకు రిక్లెయినర్ లాంటి టాప్ క్లాస్ ఫీచర్లను హ్యుండాయ్ లేటెస్ట్ ఎస్‌యూవీలో పొందవచ్చు.
ఏడీఏఎస్ లెవల్ 3 ఫీచర్లు ఉన్న మొదటి హ్యుండాయ్ కారు ఇదే. ఇక ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే... ఇందులో 2.0 లీటర్ డీజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్లు ఉండనున్నాయి. ఈ రెండు ఇంజిన్లలోనూ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వెర్షన్లే ఉండనున్నాయి. ఏడబ్ల్యూడీ/టెర్రెయిన్ మోడ్స్ కూడా అందించనున్నారు. ఈ కారు మనదేశంలో ఆగస్టులో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
ఎలక్ట్రిక్ కార్లకు వర్షంలో చార్జింగ్ పెట్టవచ్చా?
Royal Enfield Hunter 350: రూ.లక్షన్నర లోపే కొత్త ఎన్ఫీల్డ్ బైక్ - 350 సీసీ ఇంజిన్ కూడా!
Electric Vehicles: వర్షాల్లోనూ ఈవీలు నడపొచ్చు, బ్యాటరీతో ఏ సమస్యా ఉండదంటున్న నిపుణులు
Mahindra Eletric SUVs: ఒకేసారి ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు - మహీంద్రా ప్లాన్ మామూలుగా లేదుగా!
Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా మాన్యువల్ ఎలా ఉందంటే?
TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?
Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!
Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!
Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్‌లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్