News
News
X

Zodiac signs: ఈ రాశులవారికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!

Zodiac signs: ఏంటో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే అనే డైలాగ్ వినే ఉంటారు. జరగబోయే విషయాలు నిజంగానే కొందరికి ముందే తెలిసిపోతాయి. అదెలా అంటే మీ రాశిని బట్టి అలా తెలిసిపోతాయట..

FOLLOW US: 

Zodiac signs:  మొత్తం 12 రాశులుంటాయి. వీటిలో ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే రాశులవారికి సిక్స్త్ సెన్స్ ఎక్కువ. అందుకే వీళ్లకి సమస్యలు, సమస్యాత్మక వ్యక్తులు ఎదురైనప్పటికీ వారిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.

'చెప్పాకదా ముందే చెప్పాను కదా అలా జరుగుతుందని కానీ నువ్వే వినలేదు' ఇలా మీ స్నేహితులు,సన్నిహితుల్లో ఎవరో ఒకరి నుంచి ఈ మాట వినే ఉంటారు. ఒకటి రెండు కాదు చాలా సందర్భాల్లో వారి మాట నిజమవుతుంది కూడా. అందుకే నీ నోటితో ఏమీ అనొద్దు ఏం అంటే అది జరిగిపోతుంది అంటారు కొందరు. అదే సిక్త్ సెన్స్ అన్నమాట. మంచైనా చెడైనా జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింద రాశుల వారు జరగబోయేది ముందే గుర్తిస్తారట..ఆ రాశులేంటో చూద్దాం..

మిథున రాశి
ఈ రాశి వ్యక్తులు సాంఘికవాదులు. తమ జీవితంలోని వివిధ వ్యక్తులతో సన్నిహితంగా మాట్లాడే ధోరణి కలిగి ఉంటారు. ఈ కారణంగా వీళ్లు తెరిచిన పుస్తకంలా ఉంటారు..ఎదుటివారిని కూడా ఈజీగా చదివేస్తారు. వీరిని కలవకముందు వాళ్ల గురించి విన్నవి పట్టించుకోరు కానీ కలిసిన తర్వాత మాత్రం వారిని చదివేయడంలో ఈ రాశివారు నిష్ణాతులు.

కర్కాటక రాశి
కర్కాటక రాశిని భావోద్వేగ రాశిగా పరిగణిస్తారు. మనిషిని గుర్తించే అత్యుత్తమ సామర్థ్యం వీళ్లకి ఉంటుంది. ఏ వ్యక్తి ప్రత్యేకత ఏంటో వీళ్లు ఇట్టే పసిగట్టేస్తారు. నిశ్శబ్ధంగానే ఉంటూ తమకు సమీపంలో ఉన్న వారిని గమనిస్తారు. వీరితో మాట్లాడిన వారిని ఈజీగా అంచనా వేసేస్తారు.

News Reels

Also Read: ఈ వారం ఈ రాశులవారికి స్థిరాస్తి వ్వవహారాలు కలిసొస్తాయి

తులా రాశి
తులా రాశివారికి నిశిత పరిశీలన చాలా ఎక్కువ. ఈ రాశివారిని మోసం చేయడం అంత సులభం కాదు. వీరికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువగా పని చేస్తుంది. తమ చుట్టూ ఉన్న అన్ని పరిస్థితుల విషయంలోనూ వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. తర్వాత ఏం జరగబోతోంది అనే విషయాన్ని వీరు కాస్త తొందరగా అందరికన్నా ముందే పసిగట్టగలరు.

వృశ్చిక రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారు చాలా తెలివైనవారు, కష్టపడి పనిచేసేవారు. ఎవరైనా వారికి అబద్ధం చెబితే వెంటనే పసిగట్టేస్తారు. ఎవరి నుంచి జాగ్రత్తగా ఉండాలో ముందే పసిగట్టేస్తారు...అందుకే ఈ రాశివారిని అంత ఈజీగా మోసం చేయలేరు. వృశ్చిక రాశివారు తమ జీవితంలో సమస్యలకు వెంటవెంటనే పరిష్కారించుకోగలరు

Also Read: ఈ రాశులవారితో వాదన పెట్టుకుంటే మీపై మీకే విరక్తి వస్తుందట!

ధనుస్సు రాశి
ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. సిక్త్స్ సెన్స్ ఉండడం వల్ల భవిష్యత్ లో జరగబోయే లాభనష్టాలను ముందే అంచనా వేసేస్తారు. ఈ రాశి వారు తమతో మాట్లాడే వారి మనసులో ఏముందో చాలా త్వరగా తెలుసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశుల వారికి బృహస్పతి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.

మీన రాశి
మీన రాశి వారి బుర్ర చాలా పదునుగా ఉంటుంది. ఏ పని మొదలెట్టినా కచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉంటారు. ఫ్యూచర్లో ఏది మంచో ఏది చెడో ముందే గ్రహించుకోగలుగుతారు. ఒకవేళ సమస్య వస్తుందంటే ముందుకానే అప్రమత్తం అయి అక్కడి నుంచి తప్పుకుంటారు. అందుకే ఈ రాశివారికి వైఫల్యం చాలా తక్కువ.

Published at : 28 Sep 2022 08:11 PM (IST) Tags: zodiac signs Aquarius Pisces Gemini Cancer Leo Virgo Libra Scorpio Sagittarius Capricorn

సంబంధిత కథనాలు

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Kaal Bhairav Astami 2022: డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Kaal Bhairav Astami 2022:  డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది,  మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

27 November to 3rd December 2022 Weekly Horoscope: ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు

27 November to 3rd December 2022 Weekly Horoscope:  ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు

టాప్ స్టోరీస్

Sajjala On Supreme Court : సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం - మూడు రాజధానులకు ప్రజామోదం ఉందన్న సజ్జల !

Sajjala On Supreme Court :   సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం  - మూడు రాజధానులకు ప్రజామోదం ఉందన్న సజ్జల !

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Sharmila Arrest : షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Sharmila Arrest :   షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్