By: RAMA | Updated at : 25 Sep 2022 08:57 AM (IST)
Edited By: RamaLakshmibai
Weekly Horoscope, 25 September to 1 October 2022
Weekly Horoscope 2022 September 25 to October 1
మేషం
ఈ వారం మీ పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితులు, సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఆస్తి వ్యవహారాలు కలిసొస్తాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు ఈ వారంలో ఉద్యోగం సంపాదించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మెరుగుపడతాయి. ఉద్యోగులకు ఒత్తిడి తొలగిపోతుంది. అనవసర విషయాలకోసం టైమ్ వేస్ట్ చేయకండి..వివాదాలకు దూరంగా ఉండాలి.
వృషభం
అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు కానీ చిన్న చిన్న అడ్డంకులను అధిగమించే పట్టుదల అవసరం. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఎప్పటినుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. ఓ వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి
మిథునం
ముఖ్యమైన పనులు ఓ కొలిక్కి వస్తాయి. వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులున్నా స్నేహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకంగా ఉంటాయి. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. విదేశీ పర్యటనలు ఉండవచ్చు.ఖర్చులు తగ్గించుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
Also Read: దసరాల్లో పిల్లలకు పూజ చేస్తుంటారు కదా - ఏ వయసు పిల్లల్ని పూజిస్తే ఎలాంటి ఫలితం!
కర్కాటకం
కర్కాటక రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. గౌరవం సంపాదిస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
సింహం
సింహరాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం. వారాంతంలో ఖర్చులు పెరుగుతాయి. అనుకోకుండా అందిన ఓ సమాచారం మీకు ఊరటనిస్తుంది.
కన్య
మీరు కష్టపడితేనే పనులు పూర్తవుతాయి. వ్యవాహారలన్నీ సాఫీగా సాగుతాయి. శుభకార్యాల్లో పాల్గొటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. మీ నిర్ణయాలను అంతా గౌరవిస్తారు. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు.ఉద్యోగులకు పదోన్నతులు ఉండొచ్చు..వ్యాపారాలు విస్తరిస్తారు. వారం ప్రారంభంలో అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
తుల
కొత్తగా చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. మీ గౌరవం పెరుగుతుంది. ఓ ముఖ్యమైన సమాచారం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూల సమయం. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించండి..కుటుంబంలో చికాకులు తగ్గించే విధంగా ప్రయత్నించండి.మీ పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు జాగ్రత్త.
Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారం రోజు ఏ నైవేద్యం సమర్పించాలి!
వృశ్చికం
వృశ్చిక రాశివారికి ఈ వారమంతా శుభఫలితాలే కనిపిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడుతుంది. అనుకున్న సమయానికి డబ్బు చేతికందుతుంది. ప్రముఖుల పరిచయాలు మీకు మంచిచేస్తుంది. భూ, గృహ యోగాలున్నాయి. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.వ్యాపారాలలో కొత్త భాగస్వాములనుచేర్చుకోవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలుంటాయి.కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి కారణంగా మనశ్సాంతి లోపిస్తుంది.
ధనుస్సు
కొన్ని పనులు నెమ్మదించినా సకాలంలోనే పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజకనంగా ఉంటుంది. శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు సక్సెస్ అవుతాయి. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో కలహాల సూచనలున్నాయి.
మకరం
ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పట్టుదలతో చేసే పనులు పూర్తవుతాయి. ఎన్ని సంఘటనలు ఎదురైనా మీలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఓ సమాచారం సంతోషాన్నిస్తుంది. పనులు విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కుంభం
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి కానీ పట్టుదలతో ముందుకు సాగితే పూర్తవుతాయి. ఓర్పు చాలా అవసరం. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది, కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. వారం మధ్యలో మానసిక అశాంతి, కుటుంబంలో సమస్యలుంటాయి.
మీనం
ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలిసొస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారులు, ఉద్యోగులు, కళాకారులు అందరికీ శుభసమయమే.
Horoscope Today 30th January 2023: రాబోయే రోజుల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది, జనవరి 30 రాశిఫలాలు
Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!
Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!
Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!
Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
Peerzadiguda: అర్ధరాత్రి పేకాటరాయుళ్ల హంగామా, మీడియాపై దాడి! తలుపులు మూసేసి, కరెంటు తీసేసి రచ్చ
Hindenburg on Adani: జాతీయవాదం పేరు చెప్పి మోసాల్ని కప్పి పుచ్చలేరు, అదానీకి హిండన్ బర్గ్ స్ట్రాంగ్ కౌంటర్
Pathaan movie: అమెరికాలో ‘పఠాన్’ జోరు, థియేటర్లో ఆ నోటీస్ చూసి ఫ్యాన్స్ షాక్ - బాలయ్య ఎఫెక్టేనా?