అన్వేషించండి

zodiac signs: ఈ రాశులవారితో వాదన పెట్టుకుంటే మీపై మీకే విరక్తి వస్తుందట!

చిన్న కోపం వస్తే చాలు ఉగ్రరూపం దాల్చేస్తారు కొందరు. వాదనల సమయంలో ఎవ్వరి మాటా వినరు..తమది మాత్రమే రైట్ అందరిదీ తప్పు అనే ధోరణిలో వ్యవహరిస్తారు. ఈ స్వభావాన్ని కూడా రాశి డిసైడ్ చేస్తుందంటారు...

Zodiac Signs:  ఏదైనా వివాదం జరిగినా, మాట తేడా వచ్చినా కొందరు తగ్గుతారు కానీ మరికొందరు మాత్రం తగ్గేలే అన్నట్టు వ్యవహరిస్తారు. పైగా గొడవకు మరింత ఆజ్యం పోస్తారు. నోటికొచ్చినట్టు మాట్లాడతారు,ఎంతమాటంటే అంత మాట అనేస్తారు..కనీసం ఆగి ఎదుటివారు చెప్పింది కూడా పూర్తిగా వినరు, వాళ్లకు మాట్లాడే అవకాశం అస్సలు ఇవ్వరు. అలాంటి వారితో వాదన పెట్టుకోపోవడం ఎంతైనా మంచిది. అయితే ఈ స్వభావం కూడా మీ రాశి ఆధారంగా ఉంటుందని చెబుతారు. మీరున్నారేమో ఇందులో చెక్ చేసుకోండి...మీకు ఈ లక్షణాలు లేకుంటే సంతోషమే కానీ ఉంటే మాత్రం మార్చుకునేందుకు ప్రయత్నించండంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు

మేష రాశి
ఈ రాశివారికి చిని విషయానికే ఉగ్రరూపం దాల్చేస్తారు. హఠాత్తుగా స్వభావం మార్చేసుకుంటారు. ముఖ్యంగా వాదించే సమయంలో ఎవ్వరి మాటా వినరు. వీళ్లు తప్పుచేసినప్పటికీ ఎదుటివారిదే తప్పు అనే ధోరణిలో వాదిస్తారు. వాస్తవానికి తాము మిస్టేక్ చేశాం అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేరు...

వృషభ రాశి
వృషభ రాశివారిని కేరాఫ్ మొండితనంగా చెప్పొచ్చు. కొన్ని విషయాలు వారు అనుకున్నట్టే జరగాలి..అలా జరగకపోతే వీరు ఫ్రస్ట్రేట్ అయిపోతారు. తమ సొంత దృక్కోణంలో తప్ప మరో కోణంలో చూడలేరు. వారి ఆలోచన డిస్టబ్ అయినా కానీ ఉగ్రరూపం ఎత్తేస్తారు. తమకు ప్రయోజనం కలిగించకపోతే ఇతరుల అభిప్రాయాలు కూడా కొట్టిపడేస్తారు. 

Also Read: ఈ వారం ఈ రాశులవారికి స్థిరాస్తి వ్వవహారాలు కలిసొస్తాయి

సింహ రాశి
ఈ రాశివారు కొన్నిసార్లు నిజంగా కోపంగా ఉంటారు. వీరికి అంత తేలిగ్గా కోపం రాదు కానీ అలా చేసినప్పుడు వారికి దూరంగా ఉండటమే ఉత్తమం. వారు వాదన సమయంలో ఇతరులతో ఏమి చెప్పినా పరిగణనలోకి తీసుకోరు. ఆ సమయంలో గెలవడమే వారి ఉద్దేశం.

తులారాశి
ఈ రాశివారికి దూకుడు ఎక్కువ. ఇతరులు తమతో చెప్పిన వాటిని మరచిపోలేరు, ఏవరైనా తెలిసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు వీరి విషయంలో చేస్తే ఎప్పటికీ మరిచిపోలేరు. సమయం చూసి తిరగబడతారు. కాబట్టి ఈ రాశివారితో మీరు ఏం చెప్పారో మర్చిపోవద్దు..చెప్పకూడని విషయాలు చెప్పొద్దు.

Also Read:  జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

ధనుస్సు రాశి
ఈ రాశివారు ఊరికే అరుస్తారు, కేకలు వేస్తారు. వారు అనుకున్న పని అనుకున్నట్టు రాకపోతే నియమ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫీలైపోతారు. ఎదుటివారు చెప్పింది అస్సలు ప్రశాంతంగా వినరు. తాము తప్పు చేశాం అనే ఆలోచన కూడా చేయలేరు. ఈ రాశివారితో వాగ్వాదానికి దిగకపోవడమే మంచిది.

ఇక మిగిలిన రాశుల సంగతేంటి అంటారా... మిథునం, కర్కాటకం, కన్యారాశి, వృశ్చికం, మకరం, కుంభం, మీనం రాశులు వారు కూడా వాదించే టైపే కానీ కనీసం మధ్యలో ఆగి ఎదుటివారి మాట ప్రశాంతంగా వింటారు..తమవంతు వచ్చేవరకూ వేచిచూస్తారట.

నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి.  మీ  పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

11-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! ఏ రాశికి అదృష్టం? ఎవరికి సవాళ్లు?
11-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! ఏ రాశికి అదృష్టం? ఎవరికి సవాళ్లు?
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget