News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Zodiac Signs:ఈ 5 రాశులవారు లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు

Zodiac Signs: ఏ విషయం ఎంతవరకో అంతవరకే..అతిగా ఆలోచించకూడదంటారు. కానీ కొంతమంది మాత్రం జీవితం గురించి చాలా సీరియస్ గా ఆలోచించేస్తుంటారు. ఇది కూడా మీ రాశిపైనే ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్యులు

FOLLOW US: 
Share:

ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్
ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదు
ఇది ఇంతే అనుకుంటే వందేళ్ళు నేడే జీవించే వీలుందే....
ఇది ఓ సినిమాలో పాట...కానీ ఇదే నిజం అని చాలామంది అంగీకరిస్తారు. ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం. అవకాశం ఉన్నంతలో ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలి...ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. కానీ కొందరు కొంపలు మునిగిపోయినట్టు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. దానివల్ల టెన్షన్ పెరుగుతుంది,సమస్య మరింత జఠిలం అవుతుంది. ఈ ఐదు రాశులవారు ఈ కోవకే చెందుతారని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు...

మేషం
ఈ రాశివారికి బలమైన అభిప్రాయాలుంటాయి. వాటినుంచి అస్సలు బయటకు రారు. దానివల్ల చిన్న సమస్య వచ్చినా వారిలో వారు మధన పడిపోయి..ఏదో జరిగిందనే ఫీలింగ్ లో ఉండిపోతారు. మంచికైనా, చెడుకైనా ఒక్కసారి కట్టుబడి ఉంటే వీళ్లని ఆ దృష్టినుంచి, ఆ ఆలోచన నుంచి బయటకు తీసుకురావడం చాలా చాలా కష్టం.

Also Read: ఎంగిలిపూల బతుకమ్మ అని ఎందుకంటారు, బతుకమ్మలకు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి

వృషభం
వృషభ రాశి  వారు తమ జీవితం,వృత్తి -ఉద్యోగాల గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. జీవితంలో డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తారు. సంపాదించేందుకు కూడా చాలా సీరియస్ గా ఆలోచిస్తారు.  జీవితంలో ఏ విషయాన్నీ సరదాగా తీసుకోరు..మహా మొండివారు. ఎవరైనా జోక్ చేసినా తట్టుకోలేరు..

కన్య
ఈ రాశికి చెందిన వారు చిన్న విషయాలను చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ పరిస్థితిలో వారికి తెలియకుండానే ఒత్తిడి ఫీలవుతారు. ఎప్పుడు చూసినా బిజీబిజీగా కనిపిస్తారు...ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతి విషయంలోనూ అవసరమైన దానికంటే ఎక్కువ చేస్తారు. ఈరాశివారు గంభీరంగా కనిపిస్తారు.

Also Read: ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ, ప్రకృతిని ఆటపాటలతో పూజించే 'బతుకమ్మ' వెనుక ఎన్ని కథలో!

వృశ్చికం
ఈ రాశివారు ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు..కానీ ఆ ఆలోచనల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ భావోద్వేగాలను బయటపెట్టరు. బయటకు కూల్ గా కనిపిస్తారు కానీ అన్ని విషయాలనూ చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఎదుటివారిపై జోక్స్ వేస్తారు కానీ వీళ్లపై జోక్స్ ని అస్సలు ఎంజాయ్ చేయలేరు..

మకరం
మకర రాశివారు ఫ్యూచర్ పై చాలా సీరియస్ గా ఉంటారు. ఆర్థిక విషయాల గురించి చాలా లోతుగా ఆలోచిస్తారు. డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తుంటారు. వారు తమను..తమ ప్రియమైన వారిని ఎలా సురక్షితంగా ఉంచాలా అని తాపత్రయపడుతూ ఉంటారు.ఈ రాశివారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి జీవితంలో ముందుకు ఎదగడానికి ఒంటరిగా ఉండటానికి కూడా వెనకాడరు.

మిగిలిన రాశులైన కర్కాటకం, మిథునం, సింహం, ధనుస్సు, కుంభం, సింహం , మీన రాశివారికి ఎప్పుడు తీవ్రంగా ఆలోచించాలో, ఎప్పుడు వదిలేయాలో తెలుసుంటారట.ఈ రాశులవారు కూడా జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటారు కానీ కొన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు.

Note: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Published at : 20 Sep 2022 02:58 PM (IST) Tags: zodiac signs life too seriously astrological signs is Aries Taurus Gemini Cancer Leo Virgo Libra Scorpio Sagittarius Capricorn Aquarius and Pisces

ఇవి కూడా చూడండి

Astrology : ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!

Astrology : ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

Chanakya Niti In Telugu : భర్త అనుమ‌తి లేకుండా భార్య వెళ్ల‌కూడ‌ని 4 ప్రదేశాలు ఇవే!

Chanakya Niti In Telugu : భర్త అనుమ‌తి లేకుండా భార్య వెళ్ల‌కూడ‌ని 4 ప్రదేశాలు ఇవే!

Spirituality: రంగనాథుడు కొలువైన ఈ 5 క్షేత్రాలు చాలా ప్రత్యేకం- మీరెన్ని దర్శించుకున్నారు!

Spirituality:  రంగనాథుడు కొలువైన ఈ 5 క్షేత్రాలు చాలా ప్రత్యేకం- మీరెన్ని దర్శించుకున్నారు!

Horoscope Today: ఈ రాశులవారికి అభివృద్ధి - ఆదాయం, సెప్టెంబరు 21 రాశిఫలాలు

Horoscope Today:  ఈ రాశులవారికి అభివృద్ధి - ఆదాయం, సెప్టెంబరు 21 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్