అన్వేషించండి

Yearly Horoscope 2024 : మేషరాశి నుంచి మీనరాశి వరకూ నూతన సంవత్సరం 2024 వార్షిక ఫలితాలు!

Yearly Horoscope 2024: ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కోటి ఆశలతో కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న సందర్భంగా మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకుందాం...

Horoscope 2024 Yearly Astrology Prediction: 2024 లో 12 రాశుల వార్షిక ఫలితాలు. 2024 లో మీ రాశిప్రకారం వృత్తి, విద్య, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, కెరీర్ విషయాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..

మేష రాశి వార్షిక ఫలితాలు 2024 ( Aries Yearly Horoscope 2024)

2024 సంవత్సరంలో మేష రాశివారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అయితే ఏదో అయోమయ స్థితిలో ఉడండం వల్ల ఏ నిర్ణయాన్ని త్వరగా తీసుకోలేరు.  దేవగురువు బృహస్పతి సంచారం ఏడాది ప్రారంభంలో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంటా బయటా గౌరవం పొందుతారు. అనుకున్న కార్యాలు నెరవేరతాయి. పన్నెండో స్థానంలో రాహువు సంచారం వల్ల ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు ఈ ఏడాది శుభఫలితాలున్నాయి. ప్రజల నుంచి మంచి మద్దతు పొందుతారు. ఇక 2024 జనవరి నుంచి డిసెంబరు వరకూ మీ మేషరాశి ఫలితం ఇక్కడ తెలుసుకోవచ్చు...

వృషభ రాశి వార్షిక ఫలితాలు 2024 (Taurus Yearly Horoscope 2024)

వృషభ రాశి వారికి 2024 మంచి ఫలితాలే ఉన్నాయి. శుక్రుడు సప్తమంలో ఉండడం వల్ల అదృష్టం కలిసొస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.  అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. తల్లిదండ్రులతో వాదనలకు దూరంగా ఉండండ మంచిది. భూమికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. 2024 లో జనవరి నుంచి డిసెంబరు వరకు  వృషభ రాశి ఫలితాలు...

మిథున రాశి వార్షిక ఫలితాలు 2024 (Gemini Yearly Horoscope 2024)

మిథునరాశి వారికి 2023 తో పోలిస్తే 2024 బాగానే ఉంటుంది కానీ ..ఏడాది ఆరంభంలో వైవాహిక జీవితంలో రకరకాల ఇబ్బందులు వచ్చినా ఆ తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కొన్ని బాధాకరమైన పరిస్థితుసు ఎదుర్కోవాల్సి ఉంటుంద. వివాదాల్లో చిక్కుకుంటారు. ఆ తర్వాత నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకూ మిథునరాశి వారికి జాతకం..

కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2024 ( Cancer Yearly Horoscope 2024)

2024 సంవత్సరం కర్కాటక రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. శని ప్రభావంతో ఈ ఏడాది ఆరంభంలో ఏవో చింతలు, అనవసరమైన ఖర్చులు , వివాదాలు  ఇబ్బంది పెడతాయి.  శుభ కార్యాలలో ఆటంకాలు ఎదురవుతాయి, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది . వృత్తి జీవితంలో వృద్ధి ఉంటుంది. నూతన పెట్టుబడులు పెడతారు. జనవరి నుంచి డిసెంబరు వరకూ సంవత్సర ఫలితాలు ఇలా ఉన్నాయి

సింహ రాశి వార్షిక ఫలితాలు 2024  (Leo Yearly Horoscope 2024)

2024 సంవత్సరం సింహరాశి వ్యాపారులు, విద్యార్థులకు మంచి జరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన ముందుకు సాగుతుంది. అయితే మానసిక ఒత్తిడి వెంటాడుతుంది. గొంతు , ఉదర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు ఆకస్మిక ఆర్థిక నష్టం కలుగుతుంది. తొమ్మిదో స్థానంలో బృహస్పతి సంచారం ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుతుంది. ఉన్నత విద్యలో మంచి ఫలితాలను పొందుతారు. 2024 జనవరి నుంచి డిసెంబరు వరకూ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..

కన్యా రాశి వార్షిక ఫలితాలు 2024  (Virgo Yearly Horoscope 2024)

కన్యా రాశి వారిపై 2024 లో కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా చర్మవ్యాధులు ఇబ్బందిపెడతాయి. ఏడో స్థానంలో రాహువు సంచారం వైవాహిక జీవితంలో సమస్యలను సూచిస్తోంది. ఎనిమిదో స్థానంలో బృహస్పతి కూడా వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఆర్థికంగా ఈ ఏడాది మంచి ఫలితాలనే ఇస్తోంది. అయితే ఆస్తులకు సంబంధించి కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. 2024 జనవరి నుంచి డిసెంబరు వరకూ ఏ నెలలో ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ చూసుకోవచ్చు.

తులా రాశి వార్షిక ఫలితాలు 2024 (Libra Yearly Horoscope 2024)

 తులారాశి వారు 2024వ సంవత్సరంలో గొప్ప విజయాలు సాధిస్తారు. ప్రారంభంలో కొన్ని సమస్యలున్నా ఆ తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి. కానీ మహాపురుషుడు రాజయోగం ఐదవ ఇంట్లో ఉండడం వల్ల  గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరో ఇంట్లో రాహువు శత్రువులను నాశనం చేస్తాడు. వైవాహిక జీవతం బావుంటుంది. చిన్న చిన్న వివాదాలున్నా అవి పరిష్కారం అయిపోతాయి. జనవరి 2024 నుంచి డిసెంబరు వరకూ తులారాశివారి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి. 

వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు 2024 (Scorpio Yearly Horoscope 2024)

వృశ్చిక రాశి వారికి శనితో ఇబ్బందులు 2025 వరకూ తప్పవు.  ఈ సమయంలో అధిక మానసిక ఒత్తిడి, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అకాశం ఉంది. ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారు వాటికి దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు అంత మంచి ఫలితాలు సాధించలేరు. అయితే ఈ రాశి ఉద్యోగులకు మంచి పురోగతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి సాధారణ ఫలితాలుంటాయి. ఓ గుడ్ న్యూస్ వింటారు. న్యాయ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. వాహన సంతోషం ఉంటుంది. జనవరి 2024 నుంచి డిసెంబరు వరకూ వృశ్చిక శివారి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి. 

ధనస్సు రాశి వార్షిక ఫలితాలు 2024 (Sagittarius  Yearly Horoscope 2024)

ధనస్సు రాశివారికి 2024లో అదృష్టం కలిసొస్తుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ నిలబడతారు. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. మేధోపరమైన పనిలో అద్భుతంగా రాణిస్తారు. పురోభివృద్ధి బాటలు తెరుచుకుంటాయి. పోటీలలో మంచి విజయాలు సాధిస్తారు. కష్టపడి సంపాదించే మార్గాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కలలు ఫలిస్తాయి. వైవాహిక జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది. ఇంట్లో సమస్యలు ఇబ్బందిపెడతాయి. జనవరి 2024 నుంచి డిసెంబరు వరకూ ధనస్సు రాశివారి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి. 

మకర రాశి వార్షిక ఫలితాలు 2024 (Capricorn Yearly Horoscope 2024)

కొత్త ఏడాదిలో మకర రాశివారికి శని కారణంగా ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా గృహ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలుంటాయి. వ్యాపారులకు బాగానే ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలే సాధిస్తారు కానీ ఉన్నత విద్యలో ఉండేవారు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంపాదనలో హెచ్చుతగ్గులుంటాయి. ఖర్చులు ఎక్కువే ఉంటాయి. జనవరి 2024 నుంచి డిసెంబరు వరకూ మకర రాశివారి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి. 

కుంభ రాశి వార్షిక ఫలితాలు 2024 (Aquarius Yearly Horoscope 2024)

2024 సంవత్సరం కుంభ రాశి వారికి మ్యాగ్జిమం అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి ఉంటుంది. భూమి, వాహనం, ఇల్లు సౌఖ్యాలు పెరుగుతాయి. కొత్త ఆదాయ వనరుల సృష్టి కొనసాగుతుంది. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు పిల్లలకు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. సంతానం అబివృద్ధి చెందుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. అయితే శని సంచారం కారణంగా మానసిక సమస్యలు కొన్ని ఉంటాయి.  జనవరి 2024 నుంచి డిసెంబరు వరకూ కుంభ రాశివారి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి. 

మీన రాశి వార్షిక ఫలితాలు 2024 (Pisces Yearly Horoscope 2024)

మీన రాశి వారికి 2024 మొత్తం పోరాటంలానే అనిపిస్తుంది. ఒకే ఒక్క ఉపశమనం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులుండవు. శని సంచారం మీ మానసిక ఒత్తిడి, ఆందోళన పెంచుతుంది. ప్రారంభించిన ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మితిమీరిన కోపం ఉంటుంది, డబ్బు ఖర్చు అవుతుంది. కాళ్లకు సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. ఆలోచించి ఖర్చు చేయండి. చెడు కలలు వస్తాయి. కొన్ని సంఘనలు జరగడం వింతగా అనిపిస్తుంది. జనవరి 2024 నుంచి డిసెంబరు వరకూ మీన రాశివారి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PBKS vs RCB: పంజాబ్ బ్యాటర్లను నిలువరించిన బౌలర్లు, ఆర్సీబీకి మోస్తరు టార్గెట్- రివేంజ్‌కు ఇదే మంచి ఛాన్స్
పంజాబ్ బ్యాటర్లను నిలువరించిన బౌలర్లు, ఆర్సీబీకి మోస్తరు టార్గెట్- రివేంజ్‌కు ఇదే మంచి ఛాన్స్
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Simran: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP DesamAvesh Khan Game Changer vs RR | IPL 2025 లో లక్నోకు గేమ్ ఛేంజర్ గా మారిన ఆవేశ్ ఖాన్ | ABP DesamYashasvi Jaiswal Vaibhav Suryavanshi | భలే క్యూట్ గా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు | ABP Desm

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PBKS vs RCB: పంజాబ్ బ్యాటర్లను నిలువరించిన బౌలర్లు, ఆర్సీబీకి మోస్తరు టార్గెట్- రివేంజ్‌కు ఇదే మంచి ఛాన్స్
పంజాబ్ బ్యాటర్లను నిలువరించిన బౌలర్లు, ఆర్సీబీకి మోస్తరు టార్గెట్- రివేంజ్‌కు ఇదే మంచి ఛాన్స్
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Simran: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
Kakinada DCCB Chairman: కాకినాడ డీసీసీబీ ఛైర్మ‌న్ గిరి కోసం ఎందుకంత పోటీ..? రేసులో టిడిపి, జనసేన నేతలు
కాకినాడ డీసీసీబీ ఛైర్మ‌న్ గిరి కోసం ఎందుకంత పోటీ..? రేసులో టిడిపి, జనసేన నేతలు
Malavika Mohanan: లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
MI vs CSK: నేటి రాత్రి ముంబై వర్సెస్ చెన్నై హైటెన్షన్ మ్యాచ్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే..
నేటి రాత్రి ముంబై వర్సెస్ చెన్నై హైటెన్షన్ మ్యాచ్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే..
Ponnam Prabhakar: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
Embed widget