Capricorn Horoscope 2024: 2024 ఈ రాశివారితో చెడుగుడు ఆడేసుకుంటుంది!
Capricorn Yearly Astrology : 2024 లో మీ రాశిప్రకారం వృత్తి, విద్య, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, కెరీర్ విషయాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి...
Capricorn Yearly Horoscope 2024: కొత్త ఏడాదిలో మకర రాశివారికి శని కారణంగా ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా గృహ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలుంటాయి. వ్యాపారులకు బాగానే ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలే సాధిస్తారు కానీ ఉన్నత విద్యలో ఉండేవారు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంపాదనలో హెచ్చుతగ్గులుంటాయి. ఖర్చులు ఎక్కువే ఉంటాయి. జనవరి 2024 నుంచి డిసెంబరు వరకూ మకర రాశివారి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Also Read: ఈ రాశివారికి 2024 లో కెరీర్ బావుంటుంది కానీ పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు తప్పవ్!
Capricorn January to December Horoscope 2024
జనవరి, ఫిబ్రవరి
జనవరి, ఫిబ్రవరి నెలలు మిశ్రమంగా ఉంటాయి. ఈ రెండు నెలల్లో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావొచ్చు. ఉద్యోగానికి సంబంధించి ప్రయాణం చేయవలసి రావచ్చు. పెండింగ్ పనులు మరింత కష్టపడి పూర్తి చేస్తారు. కొన్నిసార్లు ఆకస్మిక ధననష్టం సంభవించే అవకాశం ఉంది. కుటుంబంలో వివాదాలు , వాదనలకు అవకాశం ఉంటుంది.
మార్చి, ఏప్రిల్
ఈ రెండు నెలల్లో పోరాటం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మార్చి మధ్యానంతరం కుజుడు, శనిగ్రహాల ప్రభావం వల్ల తగాదాలు లేదా పెద్ద గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాడీ వ్యవస్థ లేదా రక్తానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. ఏప్రిల్ నెల బాగానే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధన కలిగే అవకాశం ఉంటుంది.
Also Read: ఈ రాశివారిని 2025 వరకూ శని ఆడుకుంటుంది కానీ ఆర్థికంగా బలపరుస్తుంది
మే, జూన్
మాసాల్లో గురుగ్రహం తిరోగమనంలో ఉండటం వల్ల సంఘర్షణ వంటి పరిస్థితులు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలసిరావు. ఎంతో కష్టపడితే కొంతే ఫలితం అందుకుంటారు. ధార్మిక కార్యకలాపాలు పెరుగుతాయి . ఆర్థిక లాభాలు, ఖర్చులు రెండూ ఉంటాయి.
జులై, ఆగష్టు
జూలై, ఆగష్టు నెలల్లో బాగానే ఉంటాయి. చిన్నచిన్న మానసిక సమస్యలు, ఒత్తిడి మాత్రం తప్పదు కానీ అదృష్టం మీ వైపు ఉంటుంది . కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. కొత్త పనులు ప్రారంభించడంలో విజయం సాధిస్తారు.
సెప్టెంబర్
ఈ నెలలో మీకు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు మీ కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. మీ గౌరవం పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
అక్టోబర్
ఈ నెలలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పోలీసులకు సంబంధించిన విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
నవంబర్
ఈ నెలలో మానసిక సమస్యలు ఉండవచ్చు. అనారోగ్యం కారణంగా మీరు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉండొచ్చు. భగవంతుని పట్ల భక్తి పెరుగుతుంది.
Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ తిరుగులేదంతే!
డిసెంబర్
ఈ నెలలో ఉద్యోగం, ఆర్థిక పురోగతికి అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
Capricorn Health Rashifal 2024
ఆరోగ్య పరంగా 2024 మీకు సాధారణంగా ఉంటుంది. కొన్ని స్వీయ సంబంధిత సమస్యలు లేదా తలనొప్పి మైగ్రేన్ సమస్య కావచ్చు. మోకాలి లేదా చేతికి గాయం అయ్యే అవకాశం ఉంది.
Capricorn Bussines and Money Rashifal 2024
కొత్త ఏడాదిలో వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలే ఉన్నాయి. అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. పెద్దగా లాభం, నష్టం రెండూ ఉండవు
Capricorn Education Rashifal 2024
విద్యార్థులకు 2024 మంచి విద్య అందుతుంది. కానీ ఉన్నత విద్యలో ఉండేవారికి ఏదో సమస్య ఇబ్బంది పెడుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.
Also Read: 2024 లో ఈ రాశివారికి డబ్బుకి లోటుండదు కానీ మనశ్సాంతి ఉండదు!
Capricorn Marriage Life Rashifal
2024 లో ఈ రాశివారి వైవాహిక జీవితానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వివాహేతర సంబంధాలకు ఆకర్షితులైతే అది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. అనవసర ఆకర్షణలకు దూరంగా ఉండడం మంచిది.
పరిహారం : శివ మహిమ స్తోత్రం , శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం
2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి