అన్వేషించండి

Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు, ఆగష్టు 07 నుంచి 13 వారఫలాలు

Weekly Horoscope: ఆగష్టు 7 సోమవారం నుంచి ఆగష్టు 13 ఆదివారం వరకూ ఈ వారం ఏ రాశులవారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి....

Weekly Horoscope 7- 13 August 2023

మేష రాశి
ఈ వారం ఈ రాశివారికి అంతా మంచే జరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కార్యాలయంలో పని బాగాసాగుతుంది.  రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. వైవాహిక జీవితంలో ఉన్నవారికి, ప్రేమికులకు శుభసమయం. జీవిత భాగస్వామితో వివాదేలేమైనా ఉంటే సమసిపోతాయి. ఈ వారంలో కెరీర్ పరంగా మరింత వృద్ధి చెందుతారు. స్నేహితులను కలుస్తారు. వినాయకుడిని దర్శించుకోండి. 

వృషభ రాశి
ఈ వారం వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. నిన్నటి వరకూ వెంటాడిన కొన్ని సమస్యలు ఈ వారంలో పరిష్కారం అవుతాయి. మీరు సంతోషంగా ఉండడంతో పాటూ నలుగురితో ఆ సంతోషాన్ని పెంచుకుంటారు. వచ్చే వారం మీ ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. పని విషయంలో కొంత ఒత్తిడి ఉంటుంది కానీ మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులు లాభపడతారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణం అంత లాభదాయకం కాదు.  మీ సోదర, సోదరీమణులతో పరస్పర సామరస్యం ఉంటుంది. పరిహారం - శివుడిని దర్శించండి.

మిథునం రాశి
ఈ వారం మీకు ప్రశాంతంగానే ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. ఆ ప్రభావం కనిపిస్తుంది.  వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో కొన్ని కొత్త సమస్యలు రావచ్చు. ఉద్యోగులు  చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ పనిలో కుటుంబ సభ్యులు మీకు సహాయం చేస్తారు వారి నుంచి ప్రయోజనం పొందుతారు. ఈ వారంలో రెండు పనులు పూర్తిచేయడానికి మీరు బయటకు వెళ్లాల్సి రావొచ్చు.  ఈ వారం మీరు పక్షులకు ఆహారం, నీరు అందించండి. 

Also Read: ఈ 4 రాశులవారు స్నేహం కోసం ప్రాణం ఇచ్చేస్తారు

కర్కాటక రాశి
ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మీ పనితీరుకి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వారం వ్యాపార వర్గాలకు కూడా మంచిది. అయితే వ్యాపార భాగస్వాములతో వివాదాలకు దూరంగా ఉండాలి. వైవాహిక జీవితంలో వివాదాలకు చోటివ్వవద్దు. ప్రేమ జీవితం బావుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. చేపలకు ఆహారం అందించండి

సింహ రాశి
ఈ వారం మీకు చాలా మంచిది. పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు. కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో మంచి సమయం గడుపుతారు.    కొన్ని కొత్త విషయాలు తెలియడం వల్ల సంతోషం ఉంటుంది.  మీ గౌరవం పెరుగుతుంది. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా ప్రేమతో నిండి ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. బయటి పనుల వల్ల నిరంతరం పరిగెత్తే ఒత్తిడి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.  వినాయకుడికి మోదకం సమర్పించండి.

కన్యారాశి
మీకు ఈ వారం హెచ్చు తగ్గులు ఉండబోతున్నాయి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించండి. పని విషయంలో శ్రద్ధ చూపించడం మంచిది..అప్పుడే మెరుగైన ఫలితాలు పొందుతారు. భవిష్యత్ లో పర్యటనను ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబ జీవితంలో సంతృప్తి ఉంటుంది కానీ చిన్న చిన్న సమస్యలు అధిగమించగలగాలి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. చికిత్స తీసుకోవలసిన అవసరం ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించండి 

Also Read: ఈ రాశులవారికి ఫ్రెండ్స్ తక్కువ ఎందుకో తెలుసా!

తులా రాశి 
ఈ వారం మీకు చాలా అనుకూలమైన ఫలితాలున్నాయి. జాగ్రత్తగా ఉండండి , అనవసరమైన పనిలో జోక్యం చేసుకోకండి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు..నష్టాలు ఎదుర్కోకతప్పదు. వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ వారం చాలా మంచిది. పని విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకండి. ఆరోగ్యం, ఆహారం విషయంలో జాగ్రత్త. మీ ప్రతిభకు గౌరవం పొందుతారు. హనుమంతుడిని దర్శించుకోండి. 

వృశ్చిక రాశి 
ఈ వారం మీకు మంచి జరుగుతుంది. వ్యాపారం పుంజుకుంటుంది మంచి లాభాలు పొందుతారు.  వైవాహిక జీవితంలో కూడా ప్రేమ పెరుగుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి కూడా ఈ వారం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నా సమసిపోతాయి.  ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. 

ధనుస్సు రాశి
ఈ వారం మీకు హెచ్చు తగ్గులతో కూడి ఉంటుంది. మీ ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ మీరు ఊహించినంతగా ఉండదు. కుటుంబంలో ఏదో ఒక విషయంలో టెన్షన్ పెరుగుతోంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. మీరు ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు. వైవాహిక జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ప్రేమ జీవితం గడిపే వారు జాగ్రత్తగా ఉండాలి. మీరు పనికి సంబంధించి మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగాలు మారే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం చివరి మూడు రోజుల్లో మంచి పురోగతిని సాధిస్తారు. పేదలకు ఆహారం ఇవ్వండి. 

మకర రాశి
ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రేమ జీవితాన్ని ఆనందిస్తారు . మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మీ పనిని ఆనందిస్తారు. తలపెట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

Also Read: ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఏబీపీ దేశం ప్రత్యేక కథనాలు

కుంభ రాశి
ఈ వారం ఈ రాశివారు కుటుంబానికి ఎక్కువ సమయం గడుపుతారు. ఆదాయం సాధారణంగా ఉంటుంది ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఏ పనినీ వాయిదా వేయవద్దు. బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకండి. వారం ఆరంభంలో కన్నా వారం చివర్లో అనుకూల ఫలితాలుంటాయి. 

మీన రాశి
ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేక మిత్రులతో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తారు. పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమ జీవితాన్ని ఆస్వాదించే మార్గాలు వెతికే పనిలో ఉంటారు. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. తలపెట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారం బాగానే సాగుతుంది. శివుడిని దర్శించుకోండి..

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TV Movies: మహేష్ బాబు ‘ఆగడు’, ‘భరత్ అనే నేను’ టు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘ఆయ్’ వరకు- ఈ శనివారం (జనవరి 11) టీవీలలో వచ్చే సినిమాలివే..
మహేష్ బాబు ‘ఆగడు’, ‘భరత్ అనే నేను’ టు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘ఆయ్’ వరకు- ఈ శనివారం (జనవరి 11) టీవీలలో వచ్చే సినిమాలివే..
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TV Movies: మహేష్ బాబు ‘ఆగడు’, ‘భరత్ అనే నేను’ టు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘ఆయ్’ వరకు- ఈ శనివారం (జనవరి 11) టీవీలలో వచ్చే సినిమాలివే..
మహేష్ బాబు ‘ఆగడు’, ‘భరత్ అనే నేను’ టు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘ఆయ్’ వరకు- ఈ శనివారం (జనవరి 11) టీవీలలో వచ్చే సినిమాలివే..
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Telangana News: తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
Embed widget