అన్వేషించండి

Friendship Astrology: ఈ రాశులవారికి ఫ్రెండ్స్ తక్కువ ఎందుకో తెలుసా!

ఈ రాశులవారికి స్నేహితులుంటారు కానీ ఉత్తమ స్నేహితులు ఉండరంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఆ రాశులేంటో ఎందుకో ఇక్కడ తెలుసుకోండి....

Zodiac Signs Have Less Friends: ఆగష్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారంతా. కొందరికి జస్ట్ ఫ్రెండ్స్, మరికొందరికి ఫ్రెండ్స్, ఇంకొందరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఇది కూడా మీ రాశిపై ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ  రాశులవారికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు, ఎందుకో తెలుసా....

మేష రాశి
ఈ రాశివారిది మంచి వ్యక్తిత్వం, దృఢ నిశ్చయంతో ఉంటారు. వీరికి ఉత్తేజకరమైన స్నేహితులుంటారు.  కానీ వీరి హఠాత్తు స్వభావం... అభిప్రాయాలు వెంటనే మారిపోతుంటాయి.  అందుకే వీళ్లతో స్నేహం కొనసాగించేవారి సంఖ్య తక్కువ. తాత్కాలిక స్నేహితులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక కనెక్షన్లు కొనసాగించడంలో వీరు వెనుకబడే ఉంటారు

మిథున రాశి
నేను అందరితో బాగుంటా నాకు అందరూ స్నేహితులే అన్నది మిథున రాశివారి భావన. వీరికి స్నేహితులు చాలామంది ఉంటారు కానీ క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువే ఉంటారు. అందరితో కలసిపోయి సరదాగా ఉంటారు. ఎక్కువ మందితో స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి కానీ నిజమైన స్నేహితులు వీరికి దొరకడం కష్టమే. ఎవ్వరితోనూ పూర్తిగా ఉండరు. స్నేహ విషయంలో అస్థిరమైన ధోరణి కలిగి ఉంటారు.

Also Read: ద్వాపరయుగంలో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే!

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు కుటుంబ బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. ఏ మాత్రం టైమ్ దొరికినా కుటుంబ సభ్యులకే టైమ్ కేటాయిస్తారు. అందులోనే ఆనందం వెతుక్కుంటారు. సమాజంలో బాగానే కనెక్ట్ అవుతారు. ఎక్కువ మందితో పరిచయాలుంటాయి కానీ ఎవ్వరితోనూ క్లోజ్ గా ఉండరు. ఎవ్వరితోనూ ప్రత్యేక బంధాన్ని ఏర్పరుచుకోవడం వీరికి ఇష్టం ఉండదు. పైగా అంత సులభంగా ఎవ్వర్నీ నమ్మరు. అందుకే  ఈ రాశివారికి స్నేహాలు పెద్దగా సూటవ్వవు.

సింహ రాశి
సింహరాశి వారు ఆకర్షణీయంగా, నమ్మకంగా కనిపిస్తారు. వీళ్లతో స్నేహం చేయాలని అందరూ అనుకుంటారు కానీ వీళ్ల తీరు గమనించాక దూరమైపోతారు. వ్యక్తిగత లాభం కోసం పరిస్థితులను తారుమారు చేసే ధోరణి కలిగి ఉంటారు. అందుకే వీరితో స్నేహం చేసేందుకు వెళ్లినప్పటికీ అతి త్వరలోనే ఈ రాశివారికి దూరమైపోతారు. వీళ్లకి కూడా తాత్కాలిక స్నేహితులే కానీ శాశ్వత స్నేహితులు ఉండరంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

తులా రాశి
తులారాశి వారు సంబంధాలలో సామరస్యం కోరుకుంటారు. అయినప్పటికీ ఈ రాశివారిలో ఎక్కువ మంది అవసరం కోసం మాత్రమే స్నేహం చేస్తారట. నిజాయితీగా ఉండడం కన్నా ఎదుటివారితో వివాదాలు లేకుండా గడిచిపోతే చాలనుకుంటారట. అందుకే వీరికి పరిచయాలు, స్నేహాలు ఉంటాయి కానీ ఉత్తమ స్నేహితులంటూ ఉండరని అంటారు.

Also Read: త్రేతాయుగంలో ఉత్తమ స్నేహితులు!

ధనస్సు రాశి
ధనుస్సు రాశివారు సాహసోపేతంగా ఉంటారు. స్వతంత్రంగా వ్యవహరిస్తారు. వీరిలో చంచలత్వం ఎక్కువ. శాశ్వత స్నేహం అంటే ఈ రాశివారికి సవాలే అని చెప్పాలి. ఈ రాశివారు దృఢమైన కనెక్షన్‌ కొనసాగించడం కన్నా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారట. 

​కుంభ రాశి
కుంభ రాశి వారు చాలామంది అంతర్ముఖులు. అంటే ఏ విషయం బయటకు చెప్పకుండా లోపలే దాచేసుకుంటారు. ఏ విషయంలోనూ ఇతరుల ముందు ఓపెన్ అవరు. పైకి  స్నేహం చేస్తున్నట్లు ఉన్నా లోపల మాత్రం ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. అందుకే ఈ రాశివారు తొందరగా ఎవ్వర్నీ నమ్మరు. ఎదుటివారు కూడా తమపై నమ్మకాన్ని కోల్పోతారనే భావనలో ఉంటారు. ఈ కారణంగా అందరితో స్నేహం చేస్తున్నట్టే ఉన్నా లోతైన స్నేహం కొనసాగించరు.

​మీన రాశి
మీన రాశి వారు కొంచెం ఎమోషనల్ గా ఉంటారు. ప్రతి విషయంలోనూ ఎక్కువగా ఆలోచిస్తుంటారు. చాలాసార్లు మరీ ఎక్కువగా ఆలోచించి పరిస్థితులను గందరగోళం చేసుకునే సందర్భాలూ వీరి జీవితంలో ఉన్నాయి. ఈ ఆలోచనల ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వీరు ఇతరుల ముందు సులభంగా ఓపెన్ అవ్వరు. అందుకే వీరితో స్నేహం చేద్దామని ప్రయత్నించే వారు కూడా వీరి ధోరణి ఆర్థం చేసుకోలేక దూరమైపోతారట. అందుకే మీన రాశివారికి స్నేహాలు ఉంటాయి కానీ బలమైన స్నేహితులు ఉండరు.

గమనిక:.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget