అన్వేషించండి

Friendship Day 2023: ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఏబీపీ దేశం ప్రత్యేక కథనాలు

Friendship Day 2023:  స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏబీపీ దేశం ప్రత్యేక కథనాలు ఇక్కడ చూడొచ్చు...

Friendship Day 2023:  మిత్రుడు అంటే సూర్యభగవానుడు. సర్వజగత్తుకూ వెలుగులు పంచేవాడు, చైతన్యప్రదాత. అందుకే స్నేహితుణ్ని మిత్రుడన్నారు. దుర్మార్గమైన పనుల నుంచి నివారించే వ్యక్తి, సత్కార్యాలు చేయడానికి ప్రోత్సాహాన్నిచ్చేవాడు, రహస్యాలను కాపాడేవాడు, సద్గుణాలను కలిగి ఉండేవాడు, ఆపత్కాలంలో నీడలా అనుసరించివచ్చేవాడే నిజమైన మిత్రుడు. స్నేహితులు చాలామంది ఉండొచ్చు కానీ అందరూ నిజమైన స్నేహితులు కాలేరు. ఒక వ్యక్తి సౌశీల్యం తను పాటించే మిత్రధర్మాన్ని బట్టి నిర్ణయించవచ్చు. ఐశ్వర్యం, విద్య, పదవిని దృష్టిలో పెట్టుకుని స్నేహం చేయకూడదు.  

పురాణాల్లో ఉత్తమ స్నేహితులు, తత్వవేత్తలు చెప్పిన విషయాలు, మీ రాశుల ఆధారంగా స్నేహానికి మీరిచ్చే ప్రాముఖ్యత ఏంటో ఈ కథనాల ద్వారా తెలుసుకోవచ్చు....

రామకథలో వాల్మీకి మహర్షి.. స్నేహితుడి గొప్పదనాన్ని, మైత్రీప్రాశస్త్యాన్ని రాముడి ద్వారా లోకానికి వివరించాడు. రామాయణంలో గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు రాముడికి ఆప్తమిత్రులుగా కనిపిస్తారు. రాముడు చక్రవర్తి అయినప్పటికీ గిరిజనుడైన గుహునితో, వానరుడైన సుగ్రీవునితో, రాక్షసుడైన విభీషణుడితో స్నేహం చేసి మైత్రీధర్మానికి స్థాయీభేదాలు లేవని ప్రపంచానికి చాటిచెప్పాడు. త్రేతాయుగంలో ఉత్తమ స్నేహితుల గురించి  ఈ కథనంలో చూడొచ్చు....

మహాభారతంలో ఉత్తమ స్నేహితుల విషయానికొస్తే కర్ణుడు-దుర్యోధనుడు, కృష్ణుడు కుచేలుడిని ప్రధానంగా చెబుతారు. మిగిలిన స్నేహాలన్నీ కూడా కృష్ణుడి చూట్టూనే తిరుగుతాయి.ద్వాపరయుగంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

మన పురోగతికి ఎలాంటి వ్యక్తులు అడ్డుపడతారో చాణక్య నీతి వివరించింది. అలాంటి వారి నుంచి దూరం పాటించాలని ఆచార్య చాణక్యుడు సలహా ఇస్తున్నాడు. మనం సుర‌క్షితంగా ఉండాలంటే ఎవరికి దూరంగా ఉండాలో  చాణక్యుడు స్పష్టంగా వివరించాడు....ఆ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

వ్యక్తిగత జీవితమైనా, వృత్తిపరమైన జీవితమైనా విజయం సాధించాలంటే చాణక్య నీతి అన్ని కాలాల్లోనూ చక్కని మార్గదర్శి. తన శిష్యులకు చాణక్యుడు అప్పట్లో బోధించిన ప్రతి విషయం ఇప్పటికీ అనుసరణీయమే. ఇందులో భాగంగా ఒక వ్యక్తిని విశ్వసించే ముందు లేదా స్నేహం చేసే ముందు ఈ నాలుగు విషయాలు పరిశీలించాలని సూచించాడు చాణక్యుడు. అవేంటంటే... చాణక్యుడు ఇంకా చెప్పాడో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

ఈ రాశులవారికి స్నేహితులుంటారు కానీ ఉత్తమ స్నేహితులు ఉండరంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఆ రాశులేంటో ఎందుకో ఇక్కడ తెలుసుకోండి. వారిలో మీ రాశి ఉందా, స్నేహానికి మీరిచ్చే ప్రాముఖ్యత ఏంటో ఇక్కడ తెలుసుకోండి...

ఈ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ప్రవర్తన. కొందరు అందరితోనూ కలివిడిగా కలసిపోతారు. మరికొందరు ముభావంగా ఉంటారు. ఇంకొందరు మాట్లాడుతారు కానీ కొన్ని పరిధిలు విధించుకుంటారు. స్నేహం విషయంలోనూ అంతే. కొందరు కొత్త స్నేహాలను తొందరగా ఏర్పాటు చేసేసుకుంటారు. మరికొందరు తక్కువ మందితో స్నేహితులతో సరిపెట్టుకుంటారు. అయితే నాలుగు రాశులవారు మాత్రం స్నేహంకోసం ప్రాణం ఇచ్చేస్తారట. ఈ రాశులవారు స్నేహితులుగా దొరకడం చాలా అదృష్టం అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి ఆ రాశులేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి...

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Golbal Star Ram Charan : అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
Posani Krishna Murali: సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Embed widget