(Source: ECI/ABP News/ABP Majha)
Chanakya Niti: చాణక్య నీతి - ఇలాంటి లక్షణాలు ఉన్న ముగ్గురితో స్నేహం ప్రమాదకరం - మీ దోస్తులు ఇలాగే ఉన్నారా?
Chanakya Niti: జీవితంలో మంచి - చెడు, ద్వేషం - స్నేహం, బంధం, డబ్బు, విజయం మొదలైన అనేక సమస్యల గురించి చాణక్యుడు ప్రస్తావించాడు. చాణక్య నీతిలో మనం ముగ్గురితో సహవాసం చేయకూడదని చెప్పాడు.
Chanakya Niti: చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన అన్ని రకాల ఆలోచనలు ప్రస్తావించాడు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో వ్యాపారం, వైవాహిక జీవితం, సమాజం, జీవితం, డబ్బు, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై చాలా సమాచారం ఇచ్చాడు. ఆచార్య చాణక్యుడి విధానాలు నేటికీ ఉపయోగకరమని పరిగణిస్తారు. ఆచార్య చాణక్యుడు దౌత్యవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా పేరొందాడు, అటువంటి పరిస్థితిలో, అతను చెప్పిన విషయాలను అనుసరించడం ద్వారా మాత్రమే జీవిత సమస్యలు పరిష్కారమవుతాయి. మన పురోగతికి ఎలాంటి వ్యక్తులు అడ్డుపడతారో చాణక్య నీతి వివరించింది. అలాంటి వారి నుంచి దూరం పాటించాలని ఆచార్య చాణక్యుడు సలహా ఇస్తున్నాడు. మనం సురక్షితంగా ఉండాలంటే ఎవరికి దూరంగా ఉండాలో తెలుసా..?
1. మూర్ఖులు
కొంతమంది ఏ పరిస్థితిలోనైనా తమను తాము ఉన్నతంగా భావిస్తారు. వారు ఎప్పుడూ తప్పు చేయరని అనుకుంటారు. వారు ఇతరుల సరైన పనిని కూడా తప్పుగా అంచనా వేస్తారు. ఎదుటివారి మాట వినరు. అలాంటి వారిని మూర్ఖుల వర్గంలో చేర్చాడు ఆచార్య చాణక్యుడు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిదని చాణక్యుడు అభిప్రాయపడ్డాడు. వారు మీ సమయాన్ని మాత్రమే వృథా చేస్తారు. అతి విశ్వాసం కారణంగా వారు చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ పురోగతికి కూడా హానికరం.
2. ఏడ్చే వ్యక్తులు
కొంతమంది ఏ సంతోషకరమైన సందర్భం నుంచీ ఆనందాన్ని పొందలేరు. అలాంటి వారితో ఉండటం వల్ల ఎదుటి వారు కూడా ప్రతికూలంగా ఆలోచించడం ప్రారంభించి ఏదైనా పనిని ప్రారంభించి వదిలేస్తారు. అలాంటి వారి నుంచి దూరం పాటించాలని ఆచార్య చాణక్యుడు సూచించాడు.
3. దుష్ట స్వభావమున్న స్త్రీలు
కొందరు మహిళలు తమ స్వార్థం కోసం కుటుంబాన్ని నాశనం చేసేందుకు వెనుకాడరు. అలాంటి స్త్రీలు తాము కోరుకున్నది సాధించడానికి, కోరుకున్నది పొందడానికి కుటుంబంలో అశాంతిని సృష్టిస్తారు. అలాంటి వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు అబద్ధాలను ఆశ్రయిస్తారు. వారు తమ పని కోసం ఇతరుల గురించి ఎలాంటి చేదు పదాలనైనా ఉపయోగిస్తారు. ఇలాంటి దుష్ట స్వభావం గల స్త్రీలకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు సలహా ఇస్తున్నాడు. అలాంటి స్త్రీలు మీ జీవితంలో పురోగతిని అడ్డుకుంటారు. వీలైనంత వరకు వారికి దూరంగా ఉండటం మంచిది.
Also Read : ఒకరిని నమ్మడానికి ముందు ఈ 4 లక్షణాలు సరిచూసుకోండి!
ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, పై ముగ్గురితో మనం ఎప్పుడూ సహవాసం చేయకూడదు. వారితో సహవాసం చేయడం ద్వారా మనం జీవితంలో ఎప్పటికీ రాణించలేము. మీరు మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటే, జీవితంలో పురోగతి సాధించాలని భావించే ఈ ముగ్గురితో సహవాసం లేదా స్నేహం చేయవద్దు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.