News
News
వీడియోలు ఆటలు
X

Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

ఉగాది పంచాంగం: ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ వ్యయాలు, అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అలాంటి వారికోసమే ఏ రాశివారికి ఎలా ఉందో ముందుగానే అందిస్తోంది మీ ఏబీపీ దేశం

FOLLOW US: 
Share:

Sri Sobhakritu Nama Samvatsara Ugadi Predictions 2023-2024 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో రాశులవారీగా వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ కింద ఇచ్చిన లింక్స్ క్లిక్ చేయండి...

మేష రాశి 
( అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం )
ఆదాయం: 5 , వ్యయం:5  , రాజపూజ్యం:3  , అవమానం:1

శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో (2023-2024) మేషరాశివారికి... భాగ్య, వ్యయాధిపతి  అయిన గురువు జన్మరాశిలో సంచరిస్తున్నందున గతంలో కన్నా శుభఫలితాలనే అందించనున్నాడు. శని పదకొండో స్థానంలో ఉండడం కొంత ఉపశనమం. జన్మంలో రాహుకేతువుల ప్రభావం వల్ల తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. పదకొండో స్థానంలో ఉన్న శనివల్ల ఎలాంటి చిక్కు సమస్యలను అయినా పరిష్కరించుకోగలుగుతారు . 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ మేష రాశివారికి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

వృషభ రాశి 
( కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు)
ఆదాయం : 14 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 6 అవమానం : 1

వృషభరాశివారికి ఈ ఉగాది నుంచి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. గురుడు 12 వ స్థానంలో ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల బలం వల్ల అన్నింటా యోగ్యమైన ఫలితాలు పొందుతారు. శని, రాహువు మంచి స్థానంలో ఉండడం వల్ల అన్నింటా ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ వృషభ రాశివారికి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

మిథున రాశి
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు )
ఆదాయం : 2 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 2 అవమానం : 4

ఈ రాశివారికి సప్తమ రాజ్యాధిపతి, ధనం, సంపత్తుకారకుడైన గురువు శుభసంచారం చేస్తున్నాడు. అష్టమ శని తొలగిపోయినందున అన్ని రంగాల వారికి శుభసమయం. ఆర్థికంగా పుంజుకుంటారు, సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. శని, రాహు బలంవల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇంకా మిథున రాశివారికి శోభకృత్ నామ సంవత్సరం ఎలా ఉందంటే... 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ మిథున రాశివారికి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

కర్కాట రాశి
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆదాయం : 11 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 5 అవమానం : 4

శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో కర్కాటక రాశివారి గ్రహస్థితి పరిశీలిస్తే.. సంపదకు కారకుడైన గురుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు, రాహుకేతువులు శుభ స్థానంలో ఉన్నారు. అయితే శని అష్టమంలో ఉన్నందుకు మిశ్రమ ఫలితాలున్నాయి. గురుబలం వల్ల జీవితం సంతోషంగా ఉంటుంది...ఇంటా-బయటా కొన్ని ఇబ్బందులున్నప్పటికీ ధైర్యంగా దూసుకెళతారు. . 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ కర్కాటక రాశివారికి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

సింహ రాశి
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం:1 అవమానం : 7

 శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో సింహరాశివారికి గురుబలం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో రాహువు అష్టమంలో ఉండడం వల్ల ఈ ప్రభావంతో మిశ్రమ ఫలితాలుంటాయి.  సింహ రాశివారికి 2023 ఉగాది నుంచి 2024 వరకూ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి....

కన్యా రాశి
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం : 2 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 4 అవమానం : 7

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కన్యారాశివారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. శని సంచారం శుభాన్నిస్తాడు...ఆర్థికంగా బావుంటుంది , అభివృద్ధి వైపు అడుగేస్తారు.. అయితే అష్టమంలో ఉన్న గురుడు సంచారం ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. రాహువు సంచారం వల్ల లోలోపల భయం, ఆందోళన, చికాకులు తప్పవు.. కన్యా రాశివారికి 2023-2024 ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి...

తులా రాశి
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 14 వ్యయం : 11 రాజ్యపూజ్యం:7 అవమానం : 7

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప తులా రాశివారికి యోగకాలమనే చెప్పాలి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. స్వశక్తితో రాణిస్తారు. 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ తులారాశివారికి ఎలాఉందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి

వృశ్చిక రాశి
విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదాలు 
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 3

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి గ్రహసంచారం అనుకూలంగా ఉంది. సంపత్తు కారకుడైనా గురుడు అనుకూల స్థానంలో ఉన్నందున మీలో అంతర్గతంగా ఉన్న ఆశలు నెరవేరుతాయి, ఆదాయం,గౌరవం పెరుగుతుంది. అర్థాష్టమ శని కారణంగా ఏడాది ఆరంభంలో అంతంతమాత్రంగా ఉన్నా రానురాను పరిస్థితి మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహార్లో చిక్కుకున్న వారు ఈ ఏడాది వాటినుంచి బయటపడతారు విజయం సాధిస్తారు... 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ  వృశ్చిక రాశివారికి ఎలాఉందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి

ధనస్సు రాశి
మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం 
ఆదాయం : 8 వ్యయం :11 రాజ్యపూజ్యం : 6 అవమానం : 3

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో  ధనస్సు రాశివారికి మహోన్నత యోగం ఉంది. దేవతల గురువు బృహస్పతి, శని ఇద్దరూ శుభ స్థానంలోనే ఉన్నారు. ఈ ఫలితంగా గతంలో పడిన బాధలు, ఇబ్బందులు, చికాకులు తొలగిపోయి సంపూర్ణంగా శుభ ఫలితాలు పొందుతారు. ద్వితీయార్థంలో మాత్రం అర్దష్టమ రాహువు వలన మానసిక ఆందోళనలుంటాయి. కొందరికో అభిప్రాయ బేధాలుంటాయి.. 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ  ధనస్సు రాశివారికి ఎలాఉందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి...

మకర రాశి
ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 6

శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మకర రాశివారికి బాగానే ఉంది. గురుడు, రాహువు బలీయంగా ఉన్నందున.. ముఖ్యంగా సంపత్తుకి కారకుడైన గురుబలం బావున్నందున ఆదాయానికి లోటుంటదు. గౌరవ మర్యాదలు పొందుతారు. ఏలినాటి శని ఉన్నప్పటికీ దాని ప్రభావం అంతగా ఉండదు. రాహువు ప్రభావం, ఏలినాటి శని ప్రభావం ఉన్నందున కొన్ని సూతకాలు తప్పవు..ఆప్తబంధువులు మరణం మిమ్మల్ని బాధిస్తుంది. 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ  మకర రాశివారికి ఎలాఉందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి...

కుంభ రాశి
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 6

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కుంభ రాశివారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. అనుకున్నపనులు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. అయితే గురుబలం ఉండడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ  కుంభ రాశివారికి ఎలాఉందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి

మీన రాశి 
పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆదాయం : 8 వ్యయం : 11 రాజ్యపూజ్యం :1 అవమానం : 2

శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మీన రాశివారికి సంపదకు కారణమైన గురుడు బలంగానే ఉన్నాడు కానీ ఈ ఏడాది నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. అక్టోబరు వరకూ అష్టమంలో ఉన్న కేతువు ప్రభావం అధికంగానే ఉంటుంది. 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ మీన రాశివారికి ఎలాఉందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 21 Mar 2023 12:59 PM (IST) Tags: Sri Sobhakritu Nama Samvatsaram Ugadi Panchangam in Telugu 2023-2024 yearly horoscope for all zodiac signs Ugadi Predictions 2023-2024 in telugu 2023- 2024 horoscope in Telugu

సంబంధిత కథనాలు

Weekly Horoscope 29 May to 04 June:  జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!

Weekly Horoscope 29 May to 04 June: జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!

మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది

మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది

NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!

NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!

Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!

Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!

మే 27 రాశిఫలాలు, ఈ రోజు రాశులవారు మంచి గుర్తింపు పొందుతారు!

మే 27 రాశిఫలాలు, ఈ రోజు రాశులవారు మంచి గుర్తింపు పొందుతారు!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!