News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఆర్థికంగా బావుంటుంది కానీ మానసిక ఆందోళన తప్పదు

ఉగాది పంచాంగం: ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ వ్యయాలు, అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అలాంటి వారికోసమే ఏ రాశివారికి ఎలా ఉందో ముందుగానే అందిస్తోంది మీ ఏబీపీ దేశం

FOLLOW US: 
Share:

Sri Sobhakritu Nama Samvatsaram (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023-2024 మీన రాశి ఫలితాలు
మీన రాశి
పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆదాయం : 8 వ్యయం : 11 రాజ్యపూజ్యం :1 అవమానం : 2

శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మీన రాశివారికి సంపదకు కారణమైన గురుడు బలంగానే ఉన్నాడు కానీ ఈ ఏడాది నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. అక్టోబరు వరకూ అష్టమంలో ఉన్న కేతువు ప్రభావం అధికంగానే ఉంటుంది. 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ మీన రాశివారికి ఎలాఉందంటే.. 

  • గురుబలం ఉన్నందున ఆదాయానికి లోటుండదు కానీ ఏలినాటి శని ప్రభావం వల్ల మానసిక బాధలు తప్పవు
  • తలపెట్టిన పనులు పూర్తికావు..ప్రతి పనిలోనూ ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి
  • సాంఘికంగా, రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎంత ఓపికగా ఉందాం అనుకున్నప్పటికీ సహనం కోల్పోతారు
  • కుటుంబ సభ్యులనుంచి కూడా మీపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది
  • విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు, ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి, విదేశీ ప్రయాణాలు మాత్రం కలిసొస్తాయి
  • రాహు,కేతు ప్రభావం వల్ల కాశీ యాత్ర చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు
  • ఎలినాటి శని ప్రారంభం అవడం వల్ల జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది..ఏదీ కలసిరాక మానసికంగా కుమిలిపోతారు, అలసిపోతారు
  • గతంలో మీనుంచి సహాయం అందుకున్నవారే ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, ఊహించని కేసులలో చిక్కుకునే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండాలి

ఉద్యోగులకు

మీన రాశి ఉద్యోగులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలనిస్తోంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు, ప్రైవేటు ఉద్యోగులు ఉద్యోగం మారడం జరుగుతుంది కానీ...గురుబలం వల్ల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నవారికి ఈ ఏడాది కూడా పర్మినెంట్ అవదు.

Also Read: ఈ రాశివారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువే - శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జీవితం పరీక్షా కాలమా అన్నట్టుంటుంది!

విద్యార్థులకు

మీన రాశి విద్యార్థులకు గురుబలం ఉండడం వల్ల జ్ఞాపకశక్తి బాగానే ఉంటుంది. అయితే ఏలినాటి శని కారణంగా చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది.ఎంట్రన్స్ పరీక్షల్లో ఆశించిన దానికన్నా తక్కువ ఫలితం పొందుతారు కానీ సీట్ పొందగలుగుతారు

వ్యాపారులకు

మీన రాశి వ్యాపారులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఏలినాటి శని ప్రభావం వల్లల కొన్ని రకాల వ్యాపారాలు చేసేవారికి మాత్రమే కలిసొస్తాయి. హోల్ సేల్ -రీటైల్ రంగంలో ఉండే వ్యాపారులకు కొంతమే అనుకూలిస్తుంది. జాయింట్ వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు తప్పవు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి బాగానే ఉంటుంది...

కళాకారులకు

మీన రాశి కళాకారులకు ఈ ఏడాది బాగానే ఉంటుంది. మీరు చేస్తున్న ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. టీవీ, సినిమా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు వస్తాయి. జీవితంలో స్థిరత్వం పొందుతారు

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ప్రశాంతత ఉండదు, కక్కలేక-మింగలేక అన్నట్టుంటుంది పరిస్థితి

రాజకీయ నాయకులకు

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మీన రాశికి చెందిన రాజకీయనాయకులకు అంత అనుకూలంగా లేదు. ప్రజలు, అధిష్టానం నుంచి మంచి పేరు పొందలేరు. ఎన్నికల్లో పోటీచేసినా ఓటమి పాలవక తప్పదు. పార్టీలు మారే పరిస్థితి ఉంటుంది. డబ్బు అధికంగా ఖర్చు చేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది

వ్యవసాయదారులకు

మీన రాశి వ్యవసాయదారులకు ఒక పంట మాత్రమే లాభించును. ఆదాయం పర్వాలేదనిపిస్తుంది. కౌరుదార్లకు బావుంటుంది. చేపలు, రొయ్యల వ్యాపారం చేసేవారికి నష్టాలు తప్పవు. పండ్ల తోటలు నిర్వహించే వారికి లాభం వస్తుంది

మీన రాశికి చెందిన పూర్వాభాద్ర నక్షత్రం వారికి తెలివితేటలు, సమయానుకూల ధోరణితో అనుకున్న పనులు పూర్తిచేస్తారు
ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఇతరులకు మేలుచేయుట, ఆధ్యాత్మిక విషయాల్లో పరిజ్ఞానం పెరుగుతుంది
రేవతి నక్షత్రం వారికి గృహంలో సంతోషం ఉంటుంది

ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు. 
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Published at : 21 Mar 2023 12:24 PM (IST) Tags: 2023 sri Sobhakritu nama samvatsara ugadi rasi phalalu 2023-2024 ugadi panchagam meena Rashi Yearly horoscope in Telugu meena rasi Sobhakritu Nama Samvatsaram rasi phalau Pisces astrology predictions 2023 Pisces 2023

ఇవి కూడా చూడండి

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

Horoscope Today September 23: ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు

Horoscope Today September 23:  ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

టాప్ స్టోరీస్

Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత

Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

Hyderabad Boy Death: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి మృతి, పది నిమిషాలకే అంత ఘోరం - పజిల్‌గా మారిన కేసు!

Hyderabad Boy Death: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి మృతి, పది నిమిషాలకే అంత ఘోరం - పజిల్‌గా మారిన కేసు!

Asian Games: బంగ్లా 51కే ఆలౌట్‌ - ఆసియా టీ20 ఫైనల్‌కు స్మృతి మంధాన సేన

Asian Games: బంగ్లా 51కే ఆలౌట్‌ - ఆసియా టీ20 ఫైనల్‌కు స్మృతి మంధాన సేన