By: RAMA | Updated at : 21 Mar 2023 11:20 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
Sri Sobhakritu Nama Samvatsaram (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023-2024 కుంభ రాశి ఫలితాలు
కుంభ రాశి
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 6
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కుంభ రాశివారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. అనుకున్నపనులు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. అయితే గురుబలం ఉండడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ కుంభ రాశివారికి ఎలాఉందంటే..
కుంభ రాశి ఉద్యోగులకు శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో గడ్డుకాలమనే చెప్పాలి. జన్మంలో శని ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కష్టపడి పనిచేసినా మాటలు పడతారు. శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ప్రభుత్వ ఉద్యోగులకు సుదూర ప్రాంతాలకు బదిలీలు తప్పవు. కొందరైతే కేసుల్లో కూడా ఇరుక్కుంటారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నవారికీ నిరాశ తప్పదు. నిరుద్యోగులకు ఈ ఏడాది నిరాశ తప్పదు
Also Read: మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
ఏలినాటి శని ఉన్నప్పటికీ గురుబలం బావుండడం వల్ల విద్యార్థులకు ఈ ఏడాది బాగానే ఉంటుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది కానీ ఇతర వ్యాపకాలపై కూడా దృష్టి మరలుతుంది. అందుకే కష్టపడి చదివితేనే మంచి ఫలితం అందుకోగలుగుతారు..అదృష్టం అనేమాటను పక్కన పెట్టేయడమే. ప్రవేశ పరీక్షలలో మంచి ర్యాంకులే సాధిస్తారు
కుంభ రాశి వ్యాపారులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలున్నాయి. గురుబలం వల్ల ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, సరుకులు నిల్వచేసే వ్యాపారులకు లాభాలొస్తాయి. భాగస్వామ్య వ్యాపారం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి కలసిరాదు. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది..
కుంభ రాశి కళాకారులకు ఏలినాటి శని ఉన్నప్పటికీ గురుబలం వల్ల మంచి ఫలితాలే పొందుతారు. కొన్ని విషయాలలో మీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ మంచి అవకాశాలే పొందుతారు
కుంభ రాశికి చెందిన రాజకీయనాయకులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం గడ్డుకాలమనే చెప్పాలి. ప్రజల్లో మీపై విశ్వాసం కోల్పోతారు. అధిష్ఠాన వర్గంలోనూ మీపై సదభిప్రాయం ఉండదు. మీపై వ్యతిరేకత పెరుగుతుంది.. నమ్మినవారే దగా చేస్తారు. మీతో ఉన్నవారే మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు జాగ్రత్త...
ఈ రాశి వ్యవసాయదారులకు ఒక పంట మాత్రమే లాభిస్తుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. కౌలుదారులకు ఇబ్బందులు తప్పవు. పండ్ల తోటలు నమ్ముకున్నవారికి నష్టాలు తప్పవు
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు
Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం
25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు
Horoscope Today September 23: ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు
Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
Hyderabad Boy Death: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి మృతి, పది నిమిషాలకే అంత ఘోరం - పజిల్‌గా మారిన కేసు!
/body>