News
News
వీడియోలు ఆటలు
X

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

ఉగాది 2023: మీ బంధుమిత్రులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి

FOLLOW US: 
Share:

Ugadi Wishes in Telugu 2023

చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ

బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం.మొదటి నెల చైత్రం.మొదటి తిథి పాడ్యమి.మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
ఈ ఏడాది మీరు తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తూ
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

ఈ ఉగాది మీకు మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం, ఉల్లాసాన్ని ఇవ్వాలని కోరుకుంటూ
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

ఉగాది వెలుగులు మీ జీవితంలో నూతన కాంతిని తెస్తాయని ఆశిస్తూ
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు!

Also Read: ఈ రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆరంభం అంతంతమాత్రం - ద్వితీయార్థం సరిలేరు మీకెవ్వరు!

ఈ ఏడాది పొడవనా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

గతించిన కాలాన్ని మర్చిపోవాలి
కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలకాలి 
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ 
అందరికీ ఉగాది శుభాకాంక్షలు

తీపి-చేదు కలిసినదే జీవితం
కష్టం-సుఖం తెలిసినదే జీవితం 
ఈ ఉగాది మీ ఇంట ఆనందోత్సహాలు పూయిస్తుందని   కోరుకుంటూ.. 
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం 
ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలెన్నో మీకు అందించాలని కోరుకుంటూ
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి అష్టమంలో గురుడు ఆరోగ్యంపై దెబ్బకొడతాడు, ఏ రంగం వారికీ శుభఫలితాలు లేవు!

మామిడి పువ్వు పూతకొచ్చింది
కోయిల గొంతుకు కూత కొచ్చింది 
వేప కొమ్మకు పూవు పూసింది
పసిడి బెల్లం తోడు వచ్చింది 
గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది 
ఉగాది పండుగ రానే వచ్చింది 
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. 
ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. 
శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 

ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను 
విరబూసే వసంతాలను  అందించాలని ఆకాంక్షిస్తూ  
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 

జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం  అదే ఉగాది పండుగ సందేశం
మీకు మీ కుటుంబ సభ్యులకు  శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ
శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Also Read: హమ్మయ్య ఈ ఉగాదితో ఈ రాశివారికి 'శని' వదిలిపోయింది, ఇక మంచిరోజులు మొదలైనట్టే!

Published at : 21 Mar 2023 06:34 AM (IST) Tags: Sri Sobhakritu Nama Samvatsaram 2023-2024 happy ugadi 2023 ugadi wishes messages quotes in telugu ugadi whatsapp sharechat Ugadi Panchangam in Telugu

సంబంధిత కథనాలు

Chanakya Neeti In Telugu: మహిళల్లో ఈ చెడు అలవాట్లు చిన్నప్పటి నుంచి ఉంటాయి!

Chanakya Neeti In Telugu: మహిళల్లో ఈ చెడు అలవాట్లు చిన్నప్పటి నుంచి ఉంటాయి!

Bhagavad Gita: ఈ 4 పనులు చేస్తేనే మానసిక ప్రశాంతత సాధ్యం..!

Bhagavad Gita: ఈ 4 పనులు చేస్తేనే మానసిక ప్రశాంతత సాధ్యం..!

జూన్ 11 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటారు!

జూన్ 11 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటారు!

వారఫలాలు (జూన్ 12-18): ఈ వారం 3 రాశులవారిపై లక్ష్మీ అనుగ్రహం, ఆ రాశులవారికి వ్యక్తిగత సమస్యలు!

వారఫలాలు (జూన్ 12-18): ఈ వారం 3 రాశులవారిపై లక్ష్మీ అనుగ్రహం, ఆ రాశులవారికి వ్యక్తిగత సమస్యలు!

Yogini Ekadashi 2023 Date: యోగినీ ఏకాదశి విశిష్ఠత ఏంటి - ఈ రోజు ఏం చేయాలి!

Yogini Ekadashi 2023 Date: యోగినీ ఏకాదశి విశిష్ఠత ఏంటి - ఈ రోజు ఏం చేయాలి!

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!